PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warf33aa7f0-25df-4332-b5ca-3d81b55bb9b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warf33aa7f0-25df-4332-b5ca-3d81b55bb9b0-415x250-IndiaHerald.jpgఊహించిన‌ట్లుగానే పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగానే ఎక్కువ‌గా ప‌డిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. గురువారం ముందుగా వెల్ల‌డించిన అనేక డివిజ‌న్ల ఓట్ల‌లో బీజేపీకి ఎక్కువ‌... టీఆర్ ఎస్‌కు త‌క్కువ‌గా రావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌తీ డివిజ‌న్‌లో 30లోపే పోస్ట‌ల్ బ్యాలెట్లు న‌మోద‌య్యాయి. మ‌రి పోస్ట‌ల్ బ్యాలెట్ తీర్పు ఇలా ఉంటే... పోలింగ్ తీర్పు ఎలా ఉండ బోతోంద‌న్న‌ది ఉత్కంఠ క‌లిగిస్తోంది. కొద్ది సేప‌టి క్రిత‌మే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లుghmc;bharatiya janata party;huzur nagar;police;indian postal service;central government;pettaపోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో బీజేపీ ముందంజ‌.. ఉద్యోగులు టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పారా..?పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో బీజేపీ ముందంజ‌.. ఉద్యోగులు టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పారా..?ghmc;bharatiya janata party;huzur nagar;police;indian postal service;central government;pettaFri, 04 Dec 2020 08:40:23 GMTపోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. తర్వాత బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌కు గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశముంది.


 పెన్నుతో టిక్‌ పెట్టినా ఓటేసినట్లేనని ఎస్‌ఈసీ సర్క్యూలర్‌ జారీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది.గ్రేటర్ లో మొత్తం 150 డివిజన్లు ఉండగా... డివిజన్ కు ఒకటి చొప్పున 150 కౌంటింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్ లో 14 టేబుళ్ళను సిద్ధం చేశారు. ఒక్కో రౌండ్‌ ఓట్ల లెక్కింపునకు గంట నుంచి గంటన్నర సమయం పట్టనుంది. లెక్కింపులో 8,152 మంది సిబ్బంది పాల్గొంటుండగా.. 31 మంది ప్రక్రియను పరిశీలిస్తారు. సీసీటీవీ కెమెరాలతో లెక్కింపును రికార్డు చేయనున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద కూడా కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఒక్కో పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లను 25 చొప్పున కట్టలుగా కట్టి.. ఆయా పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్లకు సమానంగా బ్యాలెట్ పేపర్లు ఉన్నాయా లేవా అన్నది పరిశీలిస్తారు.


అత్యధికంగా ఓట్లు పోలైన మైలార్ దేవర్ పల్లి, సుభాష్ నగర్, గాజుల రామారం, అల్లాపూర్, సీతాఫల్ మండీ, బన్సీలాల్ పేట, తార్నాక డివిజన్ల లెక్కింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రంలో ఉన్న ఏజెంట్లు కోరితే మరోసారి ఓట్లు లెక్కించనున్నారు.ఇదంతా పూర్తయ్యాక లెక్కింపు మొదలు పెడతారు. ఒక్కో టేబుల్ కు 1000 ఓట్లు చొప్పున 14 టేబుళ్ళ పై 14 వేల ఓట్లను ఒక్కో రౌండ్ లో లెక్కిస్తారు. ఇక ఒక్కో టేబుల్ కు ముగ్గురు సూపర్ వైజర్లను నియమించారు. ఇదిలా ఉండ‌గా  గోషామహల్ డివిజన్ కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. కౌంటింగ్ కేంద్రానికి వందల మంది సిబ్బంది ఆర్డర్ కాపీలు, పాస్ పుస్తకాలు పట్టుకొని వచ్చి తోసుకోవడంతో స్వల్పంగా ఉద్రికత్త నెలకొంది. ఎన్నికల అధికారులను లోనికి అనుమతించడంలో నిర్లక్ష్యం వహించడంపై పోలీసులపై ఎన్నికల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..

గ్రేటర్ యుద్ధం : ఓట్ల లెక్కింపు జరిగిన.. ఆయనదే తుది నిర్ణయం అంటున్న ఈసీ..?

రేవంత్ రెడ్డి చీఫ్ అయిపోతారా...?

ఒక్క వ్యాక్సిన్ తో కరోనా మాయమైపోదు, దశాబ్దాల పాటు ప్రభావం ఉంటుంది - ఐరాస ప్రధాన కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ యుద్ధం :మొదటి ఈ డివిజన్ రిజల్ట్, చివరిగా ఇది

గ్రేటర్ యుద్ధం : లెక్కలు తేలనున్నాయి.. జాతకాలు మారనున్నాయి..?

బిజెపి ఫెయిల్ అవ్వడానికి కారణం అదేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>