PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-ward22aa43e-b6dc-4033-bb88-2b7feec1c0cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-ward22aa43e-b6dc-4033-bb88-2b7feec1c0cf-415x250-IndiaHerald.jpgగ్రేటర్ పీఠం ఎవరిదన్న ఉత్కంఠకు తెర పడింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. అయితే ఈ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీకి ఓట్లు, సీట్లు వచ్చాయి. ఫలితాలు వెల్లడైన తర్వాత గెలిచిన పార్టీలు సంబరాల్లో మునిగిపోయాయిgreater-war;prasanna;tara;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;police;kanna lakshminarayana;festival;mla;tdp;local language;kothapalli;party;santoshamగ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..greater-war;prasanna;tara;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;police;kanna lakshminarayana;festival;mla;tdp;local language;kothapalli;party;santoshamFri, 04 Dec 2020 23:50:23 GMTహైదరాబాద్ : గ్రేటర్ పీఠం ఎవరిదన్న ఉత్కంఠకు తెర పడింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. అయితే ఈ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీకి ఓట్లు, సీట్లు వచ్చాయి. ఫలితాలు వెల్లడైన తర్వాత గెలిచిన పార్టీలు సంబరాల్లో మునిగిపోయాయి. ఎన్నికల్లో సూపర్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సంతోషంలో కాషాయ పార్టీ కూడా పండుగ చేసుకుంది. అయితే గ్రేటర్ పరిధిలోని నేరేడ్‌మెట్ డివిజన్‌ లో ఓట్ల కౌంటింగ్ నిలిపివేశారు.

ఇక్కడ పోలైన కొన్ని ఓట్లపై ఎన్నికల సంఘం గుర్తించిన స్వస్తిక్ ముద్ర కాకుండా వేరే ముద్ర ఉంది. ఇలా వేరే ముద్ర ఉన్న ఓట్లు మెజార్టీ కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో వెంటనే స్పందించిన అధికారులు.. ఓట్ల కౌంటింగ్ ఆపేశారు. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అందుకే ఓట్ల లెక్కింపును పక్కన పెట్టేశామని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని వివరిస్తూ ఇక్కడి రిటర్నింగ్ అధికారి ఓ నివేదికను సిద్ధం చేశారు. దాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించారు. తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాతనే మళ్లీ కౌంటింగ్ ప్రారంభం అవుతుందని అధికారులు తేల్చి చెప్పారు.

అయితే నేరెడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపి వేయడానికి కారణం టీఆర్ఎస్ నేతలేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఇక్కడి బీజేపీ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాల విషయంలో జోక్యం చేసుకున్నారని, దీంతోనే ఫలితాలు తారుమారు అయ్యాయని బీజేపీ అభ్యర్థి ఆరోపించారు.

నేరెడ్‌మెట్ నియోజక వర్గం మహిళల కోటాలో ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి వీ ప్రసన్న నాయుడు పోటీ చేస్తున్నారు. అలాగే అధికార టీఆర్ఎస్ తరఫున కొత్తపల్లి మీనారెడ్డి, టీడీపీ నుంచి ఎం తమిల్ మానవి, కాంగ్రెస్ నుంచి మరియమ్మ లైప్ పోటీ చేస్తుండగా.. స్వతంత్ర అభ్యర్థిగా నాగేశ్వరి రుద్రి గ్రేటర్ బరిలో నిలిచారు. ఈ సారి గ్రేటర్ ఎన్నికలు మొత్తం మీద 46.60 శాతం పోలింగ్ జరగ్గా.. ఇక్కడ 44.61 శాతం పోలింగ్ నమోదయింది.


బీజేపీ మళ్ళీ స్టార్ట్: జగన్‌కు ఇబ్బందేనా?

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>