PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/unoace6bf76-9e74-4b73-ba61-fa3403fe8b13-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/unoace6bf76-9e74-4b73-ba61-fa3403fe8b13-415x250-IndiaHerald.jpgఅంతర్జాతీయ వేదిక అయిన ఐరాస సభలో పాకిస్థాన్‌ చర్యలను ఎండగడుతూ భారత్ గట్టిగా షాక్ ఇచ్చింది. దీనితో పాక్ కు అంతర్జాతీయ వేదికపై గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ అసలు రంగును భారత్‌ మరోసారి బయటపెట్టింది. పాక్‌ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే దక్షిణాసియా దేశాల్లో శాంతి స్థాపనకు వీలవుతుందని స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఐరాస వేదికగా భారత్ సభ్య దేశాలకు మరోసారి వివరించింది.uno;seema;vedhika;india;pakistan;telugu;internationalఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !ఐరాస వేదికగా పాక్ చర్యలను ఎండగట్టిన భారత్ !uno;seema;vedhika;india;pakistan;telugu;internationalFri, 04 Dec 2020 10:15:00 GMTమన దాయాది దేశం పాకిస్తాన్ ఎప్పటికప్పుడు మన దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి చాలాసార్లు ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదులు చేసినా సరే పాక్ నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తుంది. తన వైఖరిలో ఎలాంటి మార్పు చోటు చేసుకోవటం లేదు. ఇక భారత్ కూడా పాక్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని భావించింది. అందులో భాగంగా పలు అంతర్జాతీయ వేదికలపై పాక్ చర్యలను లేవనెత్తాలని భావించింది. అందుకే ఇప్పుడు అంతర్జాతీయ వేదిక అయిన ఐరాస సభలో పాకిస్థాన్‌ చర్యలను ఎండగడుతూ భారత్ గట్టిగా షాక్ ఇచ్చింది. దీనితో పాక్ కు అంతర్జాతీయ వేదికపై గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ అసలు రంగును భారత్‌ మరోసారి బయటపెట్టింది. పాక్‌ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే దక్షిణాసియా దేశాల్లో శాంతి స్థాపనకు వీలవుతుందని స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఐరాస వేదికగా భారత్ సభ్య దేశాలకు మరోసారి వివరించింది. 



ఐక్యరాజ్య సమితి సాధారణ‌ అసెంబ్లీలో ‘కల్చర్‌ ఆఫ్‌ పీస్‌’ అనే అంశంపై చర్చ జరిగింది. ఐరాస శాశ్వత మిషన్‌లో భారత తరఫున తొలి కార్యదర్శి ఆశిశ్ శర్మ ఈ చర్యల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచంలో అసహనం, ద్వేషం, హింస, ఉగ్రవాదం అనేవి ఒక నియమంగా మారిపోయాయని ఆశిశ్ శర్మ అన్నారు. హింసను ప్రేరేపించడంలో ఉగ్రవాదం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారత్‌లో కొందర్ని పావులుగా వాడుకొని పాక్‌ ఉగ్రకార్యకలాపాలకు కూడా పాల్పడుతోందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆ దేశంలోని మైనార్టీలపైనా నిరంకుశంగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. ‘పాకిస్థాన్‌ మత విద్వేషాలను రెచ్చగొట్టకుండా, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకపోతే.. దక్షిణాసియా దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా శాంతిని స్థాపించగలం’ అని ఆశిశ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. భారత్‌లోని కొందర్ని పావులుగా వాడుకొని.. పాక్‌ ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. ఆ దేశంలోని మైనార్టీలపైనా నిరంకుశంగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతోందని ఆరోపించారు.







డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...!

గ్రేటర్ యుద్ధం : గెలిచిన అభ్యర్థులు అలా చేస్తే చర్యలు తప్పవు..?

స్వస్తిక్ గుర్తే కాదుపెన్నుతో ఏ గుర్తు పెట్టినా ఓటు వేసినట్లే - ఈసీ

గ్రేటర్ యుద్ధం : నగరంపై పోలీస్ కన్ను..?

ఇంకా తెరుచుకోని ఆ కౌంటింగ్ కేంద్రం... ఏం జ‌రుగుతోందంటే..?

గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..

గ్రేటర్ యుద్ధం : ఓట్ల లెక్కింపు జరిగిన.. ఆయనదే తుది నిర్ణయం అంటున్న ఈసీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>