EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/what-happened-to-chandrababu-in-the-assemblye9526dfd-f9a2-42a5-9cec-9fa36658dc28-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/what-happened-to-chandrababu-in-the-assemblye9526dfd-f9a2-42a5-9cec-9fa36658dc28-415x250-IndiaHerald.jpgఇక సభ నుండి సస్పెండ్ అయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత చేసిన ఆరోపణలు మరీ విచిత్రంగా ఉన్నాయి. జగన్ ఫేస్ సీఎం అంటు మీడియా సమావేశంలో ఊగిపోయారు. 151 సీట్ల అఖండ మెజారిటితో గెలిచి అధికారం అందుకున్న జగన్ ఫేక్ సీఎం ఎలా అవుతారో చంద్రబాబుకే తెలియాలి. జగన్ ఫేక్ సీఎం అయితే ఓట్లేసిన జనాలు, ఎన్నికలు నిర్వహించిన కేంద్ర ఎన్నికల కమీషనర్, జగన్ తో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ కూడా ఫేకేనా ? చంద్రబాబు ఆరోపణల ప్రకారం ఎంఎల్ఏలుంతా ఫేకే అయ్యుండాలి. ఎంఎల్ఏలంతా ఫేకే అయితే స్పీకర్ ఫేక్, అసెంబ్లీ కూడా ఫేకే కదా ? మరి ఇంతమంది naidu assembly jagan tdp kodali ycp buggana;cbn;tara;korcha;jagan;media;assembly;industry;governor;central government;party;mantraహెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఏదో అయినట్లే అనుమానంగా ఉందా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఏదో అయినట్లే అనుమానంగా ఉందా ?naidu assembly jagan tdp kodali ycp buggana;cbn;tara;korcha;jagan;media;assembly;industry;governor;central government;party;mantraFri, 04 Dec 2020 05:00:00 GMTఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు వ్యవహారం ఎక్కడో తేడా కొడుతోంది. నోటికేదొస్తే అది మాట్లాడేయటం, ప్రత్యర్ధులపై ఊరికే ఆరోపణలతో విరుచుకుపడటం ఎక్కువైపోయింది. నిన్నటికినిన్న అంటే సోమవారం అసెంబ్లీ సమావేశాల మొదటిరోజు సభలో ఎంతగా ఊగిపోయాడో అందరు చూసిందే. సభలో అంతలా ఊగిపోయి జగన్మోహన్ రెడ్డిని మంత్రులను నోటికొచ్చినట్లు తిట్టాల్సిన అవసరమే లేదు. అయినా తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రెచ్చిపోయి ఊగిపోయారు. విచిత్రమేమిటంటే తమ సభ్యుడు నిమ్మల రామానాయుడే మాట్లాడుతున్నా మాట్లాడేందుకు తనకు మైక్ ఇవ్వాలని చంద్రబాబు స్పీకర్ ను డిమాండ్ చేయటం. కుదరదని అన్నందుకు స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళిపోయి నోటికొచ్చినట్లు జగన్+మంత్రులను తిట్టేశారు. నిబంధనల ప్రకారం మాట్లాడేందుకు చంద్రబాబుకు అవకాశం లేదు. ఆ విషయాన్ని చెప్పినందుకు ఏకంగా స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి కింద కూర్చుని నిరసన తెలపారంటే చంద్రబాబుకు ఏదో అయ్యిందనే  సంకేతాలు జనాల్లోకి వెళ్ళిపోయాయి.




ఇక సభ నుండి సస్పెండ్ అయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత చేసిన ఆరోపణలు మరీ విచిత్రంగా ఉన్నాయి. జగన్ ఫేస్ సీఎం అంటు మీడియా సమావేశంలో ఊగిపోయారు. 151 సీట్ల అఖండ మెజారిటితో గెలిచి అధికారం అందుకున్న జగన్ ఫేక్ సీఎం ఎలా అవుతారో చంద్రబాబుకే తెలియాలి. జగన్ ఫేక్ సీఎం అయితే ఓట్లేసిన జనాలు, ఎన్నికలు నిర్వహించిన కేంద్ర ఎన్నికల కమీషనర్, జగన్ తో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ కూడా ఫేకేనా ? చంద్రబాబు ఆరోపణల ప్రకారం  ఎంఎల్ఏలుంతా ఫేకే అయ్యుండాలి. ఎంఎల్ఏలంతా ఫేకే అయితే స్పీకర్ ఫేక్, అసెంబ్లీ కూడా ఫేకే కదా ? మరి ఇంతమంది ఫేక్ అయినపుడు అసెంబ్లీలో ఎంఎల్ఏగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న చంద్రబాబు కూడా ఫేకే అవుతారు కదా ? అంటే చంద్రబాబు ఉద్దేశ్యంలో తాను, తన పార్టీ ఎంఎల్ఏలు మాత్రం నికార్సయిన వారని, మిగిలిన వాళ్ళు మాత్రమే ఫేకనుకుంటున్నారా ?




మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో  చంద్రబాబుకు తగిలిన దెబ్బ ప్రభావం మామూలుగా లేదని అర్ధమైపోయింది. ఆమధ్య విజయసాయిరెడ్డి చెప్పినట్లు చంద్రబాబు ఏదో మానసికమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లే అనుమానంగా ఉంది. లేకపోతే తాను మాత్రం సత్యమని మిగిలిన వాళ్ళంతా అబద్ధమని చెప్పే ఫేక్ బాబాలను జనాలు చాలామందిని చూశారు. అటువంటి వాళ్ళ కోవలోకే చంద్రబాబు కూడా చేరిపోయినట్లున్నారు. లేకపోతే తన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఫేక్ అయిపోయినపుడు తాను మాత్రం నికార్సయిన వ్యక్తి ఎలా అవుతారు ? అయితే తాను కూడా ఫేక్ అయ్యుండాలి లేకపోతే అంతా నికార్సయిన వాళ్ళే అయ్యుండాలి. ఇక్కడ చంద్రబాబు మరచిపోయిన విషయం ఏమిటంటే జగన్ పై ఆరోపణలు చేస్తున్నానని అనుకుంటూ తన పరువును తానే బజార్లో పడేసుకుంటున్నారు. ఏమిటో వయస్సు పెరుగుతున్న కొద్దీ చంద్రబాబులో హుందాతనం లోపిస్తున్నట్లు అర్ధమైపోతోంది.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దూసుకెళుతున్న ఎమ్మెల్యే... అక్కడ మళ్ళీ వైసీపీనే...

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ ఏజెంట్లతో టీఆర్ఎస్ మంత్రుల భేటీ!

గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>