PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war9da9c49c-c39e-43fd-b78d-4969ad50c8b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war9da9c49c-c39e-43fd-b78d-4969ad50c8b8-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల్లో అసలైన గెలుపు మాత్రం బీజేపీదే అని చెప్పాలి. బీజేపీ ఏకంగా అర్ధ సెంచరీకి దగ్గరగా సీట్లు సంపాదించింది. ఆ పార్టీకి గత కార్పొరేషన్ లో కేవలం 4 సీట్లు మాత్రమే ఉన్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆనాడు 45 సీట్లలో పోటీ చేసిన బీజీపీ 4 మాత్రమే నాడు దక్కించుకుంది. ఇపుడు చూసే మొత్తం 149 సీట్లలో పోటీకి దిగి మూడవ వంతు తెచ్చుకుంది. అది కూడా సొంతంగా తొడగొట్టి మరీ గెలిచింది. ఇది నిజంగా బీజేపీకి ఘనమైన విజయం కింద చూడాలి. greater-war;hyderabad;bharatiya janata party;winner;tdp;nijam;narendraగ్రేటర్ యుద్ధం : గెలుపు బీజేపీదే ?గ్రేటర్ యుద్ధం : గెలుపు బీజేపీదే ?greater-war;hyderabad;bharatiya janata party;winner;tdp;nijam;narendraFri, 04 Dec 2020 20:00:00 GMTబీజేపీ ఏకంగా అర్ధ సెంచరీకి దగ్గరగా సీట్లు సంపాదించింది. ఆ పార్టీకి గత కార్పొరేషన్ లో కేవలం 4 సీట్లు మాత్రమే ఉన్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆనాడు 45 సీట్లలో పోటీ చేసిన బీజీపీ 4 మాత్రమే నాడు దక్కించుకుంది. ఇపుడు చూసే మొత్తం 149 సీట్లలో పోటీకి దిగి మూడవ వంతు తెచ్చుకుంది. అది కూడా సొంతంగా తొడగొట్టి మరీ గెలిచింది. ఇది నిజంగా బీజేపీకి ఘనమైన విజయం కింద చూడాలి.

ఇక గ్రేటర్ హైదరాబాద్ లో మళ్ళీ బీజేపీకి రోజులు వచ్చాయని చెప్పాలి. అప్పట్లో అంటే టీయారెస్ పుట్టకముందు, టీడీపీ ఉన్న రోజుల్లో బద్ధం బాలిరెడ్డి, ఆలె నరేంద్ర  లాంటి వారు బీజేపీకి పెద్ద లీడర్లుగా ఉండేవారు. అప్పట్లో బీజేపీకి భాగ్యనగరంలో బలం చాలానే ఉండేది. ఒకానొక టైంలో బీజేపీయే సోలోగా  చక్రం తిప్పింది కూడా.

మళ్ళీ నాటి రోజులు వస్తున్నాయా అనిపించేలా తాజా ఎన్నికల్లో సీట్లు వచ్చాయి. ఈ సీట్లు చాలు బీజేపీ హైదరాబాద్ సహా తెలంగాణా అంతటా పాతుకుపోవడానికి ఇపుడు టీయారెస్ కి అసలైన ప్రతిపక్షం ఎవరూ అంటే అది బీజేపీనే అని చెప్పాల్సివుంటుంది. బీజేపీ కొన్ని తప్పులు చేయడం వల్ల దాదాపుగా మరో పది నుంచి పదిహేను సీట్లు కోల్పోయింది అని కూడా అంటున్నారు. బీజేపీ అనవసరంగా పాత బస్తీ, సర్జికల్ స్ట్రైక్స్ అంటూ కెలుక్కుంది. దాంతో తటస్థ ఓటర్లు దూరం అయ్యారు. లేకపోతే బీజేపీకి వచ్చిన ఊపునకు మరో డజన్ సీట్లు హ్యాపీగా వచ్చి ఒళ్ళోకి వాలేవి. ఏది ఏమైనా దడ పుట్టించి మరీ బరి లోకి దిగిన బీజేపీ ఇక మీద హైదరాబాద్ కి గుండే కాయ లాంటి గ్రేటర్ లో పవర్ ఫుల్ అప్పోజిషన్ గా తొడగొట్టి మరీ బస్తీ మే సవాల్ చేయనుంది. నిజానికి ఈ ఎన్నికల్లో అసలైఅన్ విజేత ఎవరూ అంటే అది బీజేపీ అనే చెప్పాలి మరి.




గ్రేటర్ యుద్ధం: పాతబస్తీలో మజ్లీస్‌ హవా..!

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>