Breakingyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/bjp-won-only-one-seat-in-maharastra-electionsc7b7702d-9046-4841-96dc-8cc5efd41dc4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/bjp-won-only-one-seat-in-maharastra-electionsc7b7702d-9046-4841-96dc-8cc5efd41dc4-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 40కి పైగా స్థానాలను కైవసం చేసుకుని ఊపు మీదున్న బీజేపీకి మహారాష్ట్రలో ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ జరిగిన మండలి ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. మహా వికాస్ అగాడీ పార్టీలే నాలుగు స్థానాల్ని గెలుచున్నాయి. బీజేపీకి కంచుకోటగా చెప్పుకునే నాగ్‌పూర్‌లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానం గెలుచుకున్నారు. మండలికి సంబంధించి ...maharastra;govi;jayanth;kiran;nandu;sathish;hyderabad;bharatiya janata party;nationalist congress party;amaravati;maharashtra - mumbai;sharad pawar;congress;maharashtra;congress-ncp;local language;aurangabad;maha;party;jayamమహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ.. ఆరింటిలో ఒక్కటే!మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ.. ఆరింటిలో ఒక్కటే!maharastra;govi;jayanth;kiran;nandu;sathish;hyderabad;bharatiya janata party;nationalist congress party;amaravati;maharashtra - mumbai;sharad pawar;congress;maharashtra;congress-ncp;local language;aurangabad;maha;party;jayamFri, 04 Dec 2020 23:42:03 GMTనాగ్‌పూర్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 40కి పైగా స్థానాలను కైవసం చేసుకుని ఊపు మీదున్న బీజేపీకి మహారాష్ట్రలో ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ జరిగిన మండలి ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. మహా వికాస్ అగాడీ పార్టీలే నాలుగు స్థానాల్ని గెలుచున్నాయి. బీజేపీకి కంచుకోటగా చెప్పుకునే నాగ్‌పూర్‌లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానం గెలుచుకున్నారు. మండలికి సంబంధించి మొత్తం 6 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 3 పట్టభద్రుల నియోజకర్గాలు, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలు, 1 స్థానిక సంస్థల నియోజకవర్గం. కాగా పట్టభద్రుల నియోజకవర్గాల్లో బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. అంతేకాకుండా ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. స్థానిక సంస్థల నియోజకవర్గంలో మాత్రం గెలిచింది. దీంతో మొత్తం 6 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. ఇది బీజేపీ అధిష్టానానికి ఊహించని షాక్ ఇచ్చింది.

నాగ్‌పూర్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గోవిందరావు వాంజర్రి విజయం సాధించారు. దాదాపు 55 ఏళ్ల తర్వాత నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ ఉనికి చాటుకుంది. 1.33 లక్షల ఓట్లు ఉన్న నాగ్‌పూర్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి 55,947 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి కేవలం 15 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక పూణె, ఔరంగాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) విజయం సాధించింది. 1.22 లక్షల ఓట్లు ఉన్న పుణె పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సంగ్రం దేశ్‌ముఖ్‌ను ఎన్సీపీ అభ్యర్థి అరుణ్ లాండ్ 48 వేల ఓట్ల తేడాతో ఓడించారు.

ఔరంగాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా ఎన్సీపీనే గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి శిరీష్ బోరాల్కర్‌పై ఎన్సీపీ అభ్యర్థి సతీష్ చవాన్ విజయం సాధించారు. చవాన్‌కు 1,16,638 ఓట్లు రాగా శిరీష్‌కు 58,743 ఓట్లు మాత్రమే వచ్చాయి. పూణె ఉపాధ్యాయ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీకి చెందిన జయంత్ దిన్కర్ ఆస్గావ్కర్ గెలుపు దిశగా కొనసాగుతున్నారు. బీజేపీ, స్థానిక సంస్థల నియోజకవర్గమైన ధూలే-నందుర్బార్‌లో గెలిచింది. అమరావతి ఉపాధ్యాయ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి కిరణ్ సరనాయిక్ గెలుపొందారు. ఇదిలా ఉంటే ఈ గెలుపు తమ కూటమికే గొప్ప విజయమని మహా అగాఢీ పార్టీలైన ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లు చెబుతున్నాయి. 


బీజేపీ మళ్ళీ స్టార్ట్: జగన్‌కు ఇబ్బందేనా?

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>