MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mahesh-babu-telugu-film-industry93219c99-efed-47e2-a9c6-5f6f432bdbb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mahesh-babu-telugu-film-industry93219c99-efed-47e2-a9c6-5f6f432bdbb6-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోయే మరికొద్దిరోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనున్న సినిమా సర్కారు వారి పాట. ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక ల కలయికలో తెరకెక్కిన గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలోని తన క్యారెక్టర్ కోసం ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తిగా లాంగ్ హెయిర్ ని పెంచడంతో పాటు బాడీ ని కూడా బాగా ఫిట్ గా సిద్ధం చేసారు. ఇకపోతే దీని తరువాత ఇప్పటికే సూపర్ స్టార్ మరొక రెండు సినిమాలు కూడా లైన్లో పెట్టారు. superstar mahesh;sarkaru vaari paata;mahesh;ntr;ram charan teja;govinda;govi;kushi;parasuram;ram pothineni;rashmika mandanna;rajamouli;trivikram srinivas;vijay;vijay deverakonda;dussehra;rrr movie;cinema;rajani kanth;blockbuster hit;vijayadashami;success;joseph vijay;june;nandamuri taraka rama rao;nijam;lie;devarakondaవామ్మో .... మహేష్ ఆలోచనలు మాములుగా లేవుగా .....??వామ్మో .... మహేష్ ఆలోచనలు మాములుగా లేవుగా .....??superstar mahesh;sarkaru vaari paata;mahesh;ntr;ram charan teja;govinda;govi;kushi;parasuram;ram pothineni;rashmika mandanna;rajamouli;trivikram srinivas;vijay;vijay deverakonda;dussehra;rrr movie;cinema;rajani kanth;blockbuster hit;vijayadashami;success;joseph vijay;june;nandamuri taraka rama rao;nijam;lie;devarakondaFri, 04 Dec 2020 19:02:08 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోయే మరికొద్దిరోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనున్న సినిమా సర్కారు వారి పాట. ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక ల కలయికలో తెరకెక్కిన గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలోని తన క్యారెక్టర్ కోసం ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తిగా లాంగ్ హెయిర్ ని పెంచడంతో పాటు బాడీ ని కూడా బాగా ఫిట్ గా సిద్ధం చేసారు. ఇకపోతే దీని తరువాత ఇప్పటికే సూపర్ స్టార్ మరొక రెండు సినిమాలు కూడా లైన్లో పెట్టారు.

కాగా వాటిలో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో సినిమా కాగా మరొకటి త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా. అయితే వీటిలో ముందుగా త్రివిక్రమ్ సినిమా మొదలు కానున్నట్లు టాక్. నిజానికి సర్కారు వారి పాట అనంతరం మహేష్, రాజమౌళి సినిమా చేస్తారని కొద్దిరోజుల నుండి వార్తలు ప్రచారం అవుతున్నప్పటికీ, దానికంటే ముందు త్రివిక్రమ్ సినిమా ఉంటుంది అనడానికి ఒక బలమైన కారణాన్ని చెప్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి, అది పూర్తి చేయడానికి మరొక నెలకు పైగా పడుతుందని, ఆ తరువాత కూడా దానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి వాటికీ సంబంధించి కూడా ఆయన పూర్తి శ్రద్ధ తీసుకుంటారని, అందుతున్న సమాచారాన్ని బట్టి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ తరువాత జూన్ లేద్ జులై లో రిలీజ్ అవ్వొచ్చని అంటున్నారు.

అలానే అది పూర్తి అయిన వెంటనే కాకుండా, కొంత విరామం తీసుకునే అలవాటున్న రాజమౌళి, ఆపై మహేష్ తో సినిమా చేయడానికి మరొక మూడు నుండి నాలుగు నెలలు పడుతుందని, మొత్తంగా మహేష్, రాజమౌళి ల కాంబో సినిమా వచ్చే ఏడాది దసరా తరువాతనే అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. ఇక ఈ మొత్తం 11 నెలల్లో ఒకవైపు సర్కారు వారి పాట తో పాటు మరోవైపు త్రివిక్రమ్ సినిమాని కూడా వీలైనంత త్వరగా పూర్తికి చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని చూస్తున్నారట సూపర్ స్టార్. మొత్తంగా మహేష్ బాబు మామూలోడు కాదని, ఆయన ఆలోచనలకు నిజంగా హ్యాట్సాఫ్ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు..!!


కుట్రలు జరుగుతున్నాయ్.. జాగ్రత్త..!

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>