Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/72/niharikad98065fb-e2cb-4ce8-8d61-9507d6c5801a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/72/niharikad98065fb-e2cb-4ce8-8d61-9507d6c5801a-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నిహారిక కాళ్లపై ఇద్దరు యువతులు పడిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ వాళ్లిద్దరూ నిహారిక కాళ్లపై ఎందుకు పడ్డారనే అనుమానం అందరికీ కలుగుతోంది. అందులోనూ ఈ ఫోటోను నిహారిక స్వయంగా తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయడంతో...niharika;niharika konidela;sai dharam tej;varun;varun sandesh;varun tej;marriage;makeupమెగా డాటర్ కాళ్లు పట్టుకున్న వాళ్లిద్దరూ ఎవరు..?మెగా డాటర్ కాళ్లు పట్టుకున్న వాళ్లిద్దరూ ఎవరు..?niharika;niharika konidela;sai dharam tej;varun;varun sandesh;varun tej;marriage;makeupFri, 04 Dec 2020 23:09:00 GMTనిహారిక కాళ్లపై ఇద్దరు యువతులు పడిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ వాళ్లిద్దరూ నిహారిక కాళ్లపై ఎందుకు పడ్డారనే అనుమానం అందరికీ కలుగుతోంది. అందులోనూ ఈ ఫోటోను నిహారిక స్వయంగా తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయడంతో మెగా అభిమానులు దీన్ని మరింత ట్రండ్ చేస్తున్నారు. అయితే దీనిపై నిహారిక క్లారిటీ ఇస్తూ ఓ కామెంట్‌ను కూడా ఆ పోస్ట్‌కు జత చేసింది. దీంతో అభిమానులకు అసలు విషయం అర్థమై నవ్వుకున్నారు.

విషయం ఏంటంటే.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి తంతు వేగంగా జరుగుతోంది. అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటికే కుటుంబం అంతా ఒక్కచోట చేరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, శ్రీజ, సుస్మిత, అల్లు వారబ్బాయిలు ఇలా మెగా కాంపౌండ్ మొత్తం ఒక్కటి కావడంతో నాగబాబు ఇల్లంతా కళకళలాడిపోతోంది. మరోవైపు పెళ్లి కూతురుగా ముస్తాబవుతున్న నిహారిక.. తన ప్రీ వెడ్డింగ్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు స్వీట్ ట్రీట్స్ ఇస్తోంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పిక్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ ఫోటోలో ఇద్ద‌రు యువతులు ఆమె కాళ్ల‌పై పడినట్లు కనిపిస్తుండటంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించిన నిహారిక.. క్లారిటీ ఇస్తూ ఓ కామెంట్ ట్యాగ్ చేసింది. ''చెప్తున్నా.. చెప్తున్నా.. వాళ్లిద్దరూ నా హీల్స్ సరి చేస్తున్నారు. నా దుస్తులతో పాటు మేకప్ విషయంలో వాళ్లే నాకు సాయంగా ఉంటున్నారు. వాళ్లు లేకపోతే చాలా ఇబ్బందులు పడేదాన్ని. ల‌వ్ యూ గర్ల్స్'' అంటూ రాసుకొచ్చింది. దీంతో పెళ్లి కూతురుగా ముస్తాబైన నిహారిక చిలిపితనం చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

ఇదిలా ఉంటే గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్‌రావు కొడుకు చైతన్యతో నిహారిక పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ నెల 9న రాజ‌స్తాన్‌లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌లో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సమాచారం. మరి ఇప్పుడే ఇంత కోలాహలంగా ఉన్న మెగా ఫ్యామిలీ ఇక పెళ్లి మండపంలో ఎంత హడావుడి చేస్తుందోనంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అందరినీ ఒకేసారి చూసే ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారు.


బీజేపీ మళ్ళీ స్టార్ట్: జగన్‌కు ఇబ్బందేనా?

గ్రేటర్ యుద్ధం: నేరేడ్‌మెట్‌లో కౌంటింగ్ నిలిపివేత.. ఎందుకంటే..

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>