MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tamannad016d8d8-0557-4a0f-954e-97497aa7743c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tamannad016d8d8-0557-4a0f-954e-97497aa7743c-415x250-IndiaHerald.jpgతమన్నాను మిల్క్ బ్యూటీ అంటారు. ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి అపుడే పదిహేనేళ్ళు అయిపోయింది. అయినా గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడంలేదు. ఇప్పటికీ ఆమె నాటౌట్ అంటోంది. తమన్నా గ్లామర్ తో పాటు టాలెంట్ కూడా చూపిస్తోంది. దాంతో రెండు వైపులా పదునైన కత్తిగా ఈ అమ్మడు వీర విహారం చేస్తోంది. tamanna;beauty;venkatesh;gopichand;tamannaah bhatia;tollywood;cinema;f2;november;remake;hero;fidaaతమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?తమన్నా తళుకుబెళుకులకు ఫిదా...?tamanna;beauty;venkatesh;gopichand;tamannaah bhatia;tollywood;cinema;f2;november;remake;hero;fidaaFri, 04 Dec 2020 19:30:00 GMT బ్యూటీ అంటారు. ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి అపుడే పదిహేనేళ్ళు అయిపోయింది. అయినా గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడంలేదు. ఇప్పటికీ ఆమె నాటౌట్ అంటోంది. తమన్నా గ్లామర్ తో పాటు టాలెంట్ కూడా చూపిస్తోంది. దాంతో రెండు వైపులా పదునైన కత్తిగా ఈ అమ్మడు వీర విహారం చేస్తోంది.

తమన్నాకు ఇపుడు వరసగా చేతిలో సినిమాలు ఉన్నాయంటే టాలీవుడ్ ఆమెకు ఎంతలా ప్రయార్టీ ఇస్తోందో అర్ధమవుతోంది. తమన్నా నితీన్ రీమేక్ మూవీ అంధాదున్  చేస్తోంది. ఇందులో బోల్డ్ టైప్ క్యారెక్టర్  ని ఆమె అంగీకరించడమే ఒక సవాల్ అంటున్నారు. హిందీలో టబూ ఆ రోల్ ప్లే చేసింది. మరి తమన్నా గ్లామర్ తో ఈ పాత్రకు మరింత కొత్త హంగులు తెస్తారని అంటున్నారు.

దీంతో పాటుగా గోపీచంద్ తో సిటీ మార్ మూవీ కూడా చేస్తోంది. ఈ మూవీలో కబడ్డీ కోచ్ పాత్రలో ఈ అమ్మడు కనిపించనుంది. ఇక్కడ కూడా గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ ఉండే రోల్ అన్న మాట. ఇక ఎఫ్ 2 లో వెంకటేష్ పక్కన నటించినా కూడా ఎక్కడా తగ్గలేదు ఈ ముద్దు గుమ్మ. ఫుల్ గ్లామర్ పండించింది. దాంతో ఆమెనే ఎఫ్ 3 లో కూడా తీసుకుంటున్నారుట.

అదే విధంగా తమన్నా యంగ్ హీరో సత్యదేవ్ పక్కన గురుతుందా శీతాకాలం మూవీ చేస్తోంది. ఇందులో కూడా ఆమెది గ్లామర్ రోల్. దీంతో పాటు వెబ్ సిరీస్ కి కూడా తమన్నా ఒకే చెబుతోంది. ఇపుడు నవంబర్ స్టోరీ పేరిట ఆమె చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ తొందరలోనే స్ట్రీమింగ్ అవబోతోంది. ఇక తమన్నా మరిన్ని సినిమాలకు కూడా ఓకే చెబుతోంది అంటున్నారు.

మొత్తానికి మూడు పదుల వయసు దాటినా కూడా ఈ అమ్మడు కెరీర్ ని చాలా బాగా ప్లాన్ చేసుకోవడమే కాకుండా గ్లామర్ ని మెయింటెయిన్  చేయడంతో ఆమెను వెతుక్కుంటూ టాలీవుడ్ వరస ఆఫర్లు ఇస్తోందని అంటున్నారు. మొత్తానికి తమన్నా మరికొన్నేళ్ళ పాటు అటు మూవీస్ లో ఇటు వెబ్ సిరీస్ లో కూడా సత్తా చాటుతుంది అంటున్నారు.






గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ గెలుపు పై కే‌టి‌ఆర్ కీలక వ్యాఖ్యలు ..!!

మహాబలేశ్వర్ లో ఆర్ఆర్ఆర్ ఏం చేస్తోందో తెలుసా?

గ్రేటర్ యుద్ధం: ప్రజలే పట్టం కట్టారన్న మంత్రి ఎర్రబెల్లి!

గ్రేటర్ యుద్దం: టీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ.. 33మంది సిట్టింగులు ఓటమి!

గ్రేటర్ యుద్ధం: కూకట్ పల్లి క్లీన్ స్వీప్.. మొత్తం గులాబీ మయం!

గ్రేటర్ యుద్ధం: భోలక్‌పూర్‌లో ఎంఐఎం విన్.. పోటీ ఇచ్చిన బీజేపీ!

గ్రేటర్ యుద్ధం: రామ్ నగర్‌లో కాషాయం హవా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>