PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/counting6a246bf5-ad76-416c-8b8a-0f66109bd646-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/counting6a246bf5-ad76-416c-8b8a-0f66109bd646-415x250-IndiaHerald.jpgసనత్ నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఖైరతాబాద్ జోన్ జిహెచ్ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు పిలిచి బయటే ఉంచారు అంటూ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. ఉదయం ఐదు గంటలకు వచ్చి ఇక్కడ వేచి చూస్తున్నామని దాదాపు 200 మంది ఉద్యోగులు పోలింగ్ కేంద్రం బయటనే ఉన్నామని అన్నారు. ఎలక్షన్ కౌంటింగ్ ట్రైనింగ్ ఇచ్చి డ్యూటీ లు వేసి ఇప్పుడు సరిపోయారు అంటూ మీరు ఇంటికి తిరిగి వెళ్లండి అని చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. greater war;sports;bharatiya janata party;huzur nagar;court;indian postal service;local language;central governmentగ్రేటర్ యుద్ధం : సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగుల ధర్నా..గ్రేటర్ యుద్ధం : సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగుల ధర్నా..greater war;sports;bharatiya janata party;huzur nagar;court;indian postal service;local language;central governmentFri, 04 Dec 2020 09:14:47 GMTసనత్ నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు.  ఖైరతాబాద్ జోన్ జిహెచ్ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు పిలిచి బయటే ఉంచారు అంటూ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు దిగారు.  ఉదయం ఐదు గంటలకు వచ్చి ఇక్కడ వేచి చూస్తున్నామని దాదాపు 200 మంది ఉద్యోగులు పోలింగ్ కేంద్రం బయటనే ఉన్నామని అన్నారు. ఎలక్షన్ కౌంటింగ్ ట్రైనింగ్ ఇచ్చి డ్యూటీ లు వేసి ఇప్పుడు  సరిపోయారు అంటూ మీరు ఇంటికి తిరిగి వెళ్లండి అని చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


మేము ఇక్కడకు విధులకు వచ్చినట్టు అటెండెన్స్ కూడా వేయడం లేదని అంటున్నారు. కావలసిన సిబ్బంది కంటే అధికంగా ఎందుకు పిలిచారు అంటూ వారంతా ఆందోళనకు దిగారు. ఇక ఇప్పటికే 30 కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ప్రారంభం అయ్యాయి. 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్ బ్యాలెట్స్ మాత్రమే పోల్ అయ్యాయి. ఈ రోజు ఉదయం 7.30 నిమిషాల కంటే ముందు వచ్చిన పోస్టల్ బ్యాలెట్స్ మాత్రమే ఎన్నికల సిబ్బంది లెక్కిస్తున్నారు. ఇక బ్యాలెట్ పై ఎలాంటి ముద్ర ఉన్నా ఓటును పరిగణలోకి తీసుకోవాలనే సర్కులర్ పై హై కోర్టులో బీజేపీ హౌజ్ మోషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.



 మరికాసేపట్లో జూమ్ మీటింగ్ ద్వారా పిటిషన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించనున్నారు. ఆ వెసులుబాటు స్థానిక సంస్థల ఎన్నికల రూల్ బుక్ లో ఉందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. కౌంటింగ్ అబ్జర్వర్ల సమావేశంలో చర్చించి నిబంధనలపై స్పష్టత ఇచ్చామని కమిషన్ చెబుతోంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు హైకోర్టు విచారణ అడ్డంకి కాదని అంటున్నారు. ఇక మధ్యాహ్నం 1 లేదా 2 గంటల వరకు ఫలితాల్లో స్పష్టత వస్తుందని ఎన్నికల కమిషన్ చెబుతోంది.




గ్రేటర్ యుద్ధం : నగరంపై పోలీస్ కన్ను..?

ఇంకా తెరుచుకోని ఆ కౌంటింగ్ కేంద్రం... ఏం జ‌రుగుతోందంటే..?

గ్రేటర్ యుద్ధం : ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్.. ఆసక్తికర ఫలితాలు..

గ్రేటర్ యుద్ధం : ఓట్ల లెక్కింపు జరిగిన.. ఆయనదే తుది నిర్ణయం అంటున్న ఈసీ..?

రేవంత్ రెడ్డి చీఫ్ అయిపోతారా...?

ఒక్క వ్యాక్సిన్ తో కరోనా మాయమైపోదు, దశాబ్దాల పాటు ప్రభావం ఉంటుంది - ఐరాస ప్రధాన కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ యుద్ధం :మొదటి ఈ డివిజన్ రిజల్ట్, చివరిగా ఇది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>