EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-war18473c10-1b58-47b9-b8df-f601bfb99d7e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-war18473c10-1b58-47b9-b8df-f601bfb99d7e-415x250-IndiaHerald.jpgఅసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగల ఓర్పు నేర్పు ఉన్న నాయకుల్లో అగ్రగామిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉంటారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నా, లేకపోయినా అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించి తన సత్తా చాటుకోవడానికి కేసీఆర్ ఎప్పుడు ప్రయత్నిస్తూ పైచేయి సాధిస్తూ వస్తున్నారు. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి చూసుకుంటే ప్రతి దశలోనూ కెసిఆర్ టిఆర్ఎస్ ను ముందంజలో ఉంచే విధంగా చేయడంలో సక్సెస్ అవుతోనే వచ్చారు. శత్రువులు ఎంత బలంగా ఉన్నా, వారిని బలహీనం చేసి పైచేయి సాధించడం లో కెసిఆర్ సిద్ధహస్తులు గా మారిపోయారు. ప్రస్తుతం గ్రేgreter- war kcrtrs ghmc greter ktr election result;auto;kcr;ktr;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;cm;letter;success;party;shatru1ఎడిటోరియల్ : దటీజ్ కేసీఆర్ ! గ్రేటర్ ' కారు ' దే ?ఎడిటోరియల్ : దటీజ్ కేసీఆర్ ! గ్రేటర్ ' కారు ' దే ?greter- war kcrtrs ghmc greter ktr election result;auto;kcr;ktr;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;cm;letter;success;party;shatru1Fri, 04 Dec 2020 16:00:00 GMT
అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగల ఓర్పు నేర్పు ఉన్న నాయకుల్లో అగ్రగామిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉంటారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నా, లేకపోయినా అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించి తన సత్తా చాటుకోవడానికి కేసీఆర్ ఎప్పుడు ప్రయత్నిస్తూ  పైచేయి సాధిస్తూ వస్తున్నారు. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి చూసుకుంటే ప్రతి దశలోనూ కెసిఆర్ టిఆర్ఎస్ ను ముందంజలో ఉంచే విధంగా చేయడంలో సక్సెస్ అవుతోనే వచ్చారు. శత్రువులు ఎంత బలంగా ఉన్నా, వారిని బలహీనం చేసి పైచేయి సాధించడం లో కెసిఆర్ సిద్ధహస్తులు గా మారిపోయారు. 



ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల ఫలితాలను చూసుకుంటే,  కేసీఆర్ సత్తా ఏమిటో మరోసారి రుజువు అవుతోంది. ఎన్నికలలో బిజెపి టిఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు గా సత్తా చాటుకుంటూ వస్తున్నాయి. ఈ ఎన్నికలలో విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా బిజెపి టిఆర్ఎస్ పార్టీలు గట్టిగా ప్రచారం నిర్వహించాయి. బిజెపి తరఫున ఆ పార్టీ ఢిల్లీ స్థాయిలో గ్రేటర్ లో వాలిపోయి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రేటర్ లో సత్తా చాటుతామని బిజెపి భావించింది.తెలంగాణ ప్రభుత్వం పై జనాల్లో వ్యతిరేకత ఉందని, ఆ పార్టీని ప్రజలు ఆదరించరు అని లెక్కలు వేసుకున్న బిజెపికి గట్టి షాక్ తగిలింది. ఇప్పుడు మరోసారి గ్రేటర్ పీఠం దక్కించుకునే దిశగా బి.జె.పి ముందుకు వెళ్తున్న తీరు మిగతా పార్టీలలోనూ కంగారు మొదలైంది. 



ఇప్పుడు గ్రేటర్ లో టిఆర్ఎస్ ఆదిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు గ్రేటర్ పీఠం లో ఎవరు విజయం సాధిస్తే, వారికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉంటుందని లెక్కలు ఎన్నో వచ్చాయి. దీంతో మరోసారి విజయం టిఆర్ఎస్ ఖాతాలోకి పడితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుంది అని ఒక సెంటిమెంట్ ఉంది. గతంతో పోలిస్తే బిజెపి కూడా బాగా బలం పుంజుకుంది. తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బిజెపి ఎంతగా కవ్వింపు చర్యలకు దిగినా, ప్రభుత్వం పై ఎంతగా విమర్శలు చేసినా, కెసిఆర్ ఎక్కడ కంగారు పడకుండా గ్రేటర్ పై పైచేయి సాధించే దిశగా అడుగులు వేశారు.


 ఇక ఎన్నికల బాధ్యతలు మొత్తం కేటీఆర్ చూసుకోవడం రాబోయే రోజుల్లో ఆయన తెలంగాణ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉండడం వంటి కారణాలతో టిఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది . అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. మరి కొద్ది క్షణాల్లోనే గ్రేటర్ ఫలితం పై స్పష్టమైన ప్రకటన రాబోతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది.




కసితో రగిలిపోతున్న మనోళ్లు..!

గ్రేటర్ యుద్ధం: రామ్ నగర్‌లో కాషాయం హవా!

గ్రేటర్ యుద్ధం: అడికమెట్‌లో కమలానిదే విజయం

గ్రేటర్ యుద్ధం: ముషీరాబాద్‌లో కమల వికాసం

గ్రేటర్ యుద్ధం: మరోసారి గెలిచిన డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్

ప్రశాంత్ నీల్ పై మండిపడుతున్న అక్కడి అభిమానులు.. కారణం ఆ స్టార్ హీరోనే..??

గ్రేటర్ యుద్దం: కారుకు బ్రేకులు లేవు.. విజయం మాదే...టీఆరెఎస్ నేతలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>