MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunil32f55d15-ed3f-416e-bef5-fc9ba18dd9f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunil32f55d15-ed3f-416e-bef5-fc9ba18dd9f2-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ సునీల్ గురించి తెలియని వారంటూ ఉండరు. క‌మెడియ‌న్ నుండి హీరోగా.. అటు నుండి మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారి, ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గానూ మెప్పిస్తున్నాడు సునీల్‌. డిస్కోరాజా, క‌ల‌ర్‌ఫొటో వంటి చిత్రాల్లో సునీల్ విల‌నిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సునీల్. sunil;adhithya;rajamouli;sunil;ram madhav;cinema;ala venkatapuram lo;producer;remake;comedian;producer1;research and analysis wing;discoraja;ala vaikunthapurramloo;v;ala vaikuntapuramloకొత్త అవ‌తారం ఎత్త‌నున్న‌ సునీల్... అసలు ఏం చేయబోతున్నాడు..!?కొత్త అవ‌తారం ఎత్త‌నున్న‌ సునీల్... అసలు ఏం చేయబోతున్నాడు..!?sunil;adhithya;rajamouli;sunil;ram madhav;cinema;ala venkatapuram lo;producer;remake;comedian;producer1;research and analysis wing;discoraja;ala vaikunthapurramloo;v;ala vaikuntapuramloThu, 03 Dec 2020 11:00:00 GMTకమెడియన్ సునీల్ గురించి తెలియని వారంటూ ఉండరు. క‌మెడియ‌న్ నుండి హీరోగా.. అటు నుండి మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారి, ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గానూ మెప్పిస్తున్నాడు సునీల్‌. డిస్కోరాజా, క‌ల‌ర్‌ఫొటో వంటి చిత్రాల్లో సునీల్ విల‌నిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సునీల్. ఎన్ని అవతారాలు ఎత్తిన సునీల్ తాజాగా త‌్వ‌ర‌లోనే ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నాడు. నిజానికి సునీల్‌కు ద‌ర్శ‌క‌త్వం చేయాల‌ని చాలా రోజుల నుండి కోరిక‌. అయితే యాక్ట‌ర్‌గా బిజీ కావ‌డంతో ఆ ధైర్యం చేయ‌లేక‌పోయాడు.

ఎట్ట‌కేల‌కు సునీల్‌ని డైరెక్ట‌ర్ చేయ‌డానికి ఓ నిర్మాత రెడీ అన‌డంతో సునీల్ మెగాఫోన్ ప‌ట్ట‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ టైమ్స్‌లో సునీల్‌కు ఓ మ‌రాఠి మూవీ బాగా న‌చ్చింద‌ట‌. ఆ సినిమాలో రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుని.. దాన్ని తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్లు మార్పులు, చేర్పులు చేయిస్తున్నాడ‌ట‌. అంతా ఓకే అయ్యింద‌ని అనుకున్నాక‌నే సునీల్ త‌న మెగాఫోన్ విష‌యాన్ని చెప్పే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. క‌మెడియ‌న్‌గా పీక్స్‌లో ఉన్న‌ప్పుడే హీరోగా మారాడు. అందాల‌రాముడు, పూల‌రంగ‌డు, మర్యాద‌రామ‌న్న వంటి సినిమాల‌తో హీరోగా మంచి స‌క్సెస్‌ల‌ను ద‌క్కించుకున్నాడు.

ఆ త‌ర్వాత నుండి హీరోగా స‌క్సెస్ కావ‌డానికి అన్నీ ప్ర‌య‌త్నాలు చేశాడు సునీల్‌. కానీ ఏ సినిమా కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. హీరోగా సునీల్ చేసిన ఈడు గోల్డ్ ఎహే, భీమవరం బుల్లోడు, జక్కన్న, టు కంట్రీస్, ఉంగరాల రాంబాబు ఇలా వ‌రుస ప్లాప్స్ ప‌ల‌క‌రించాయి. ఇక హీరోగా సునీల్‌కు క‌ష్ట‌మే అనుకున్నారందరూ. అదే స‌మ‌యంలో సునీల్ మ‌ళ్లీ బ్యాక్‌టు పెవిలియ‌న్ అంటూ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. కమెడియన్‌గా అరవిందసమేత, అల వైకుంఠపురములో వంటి స్టార్స్ సినిమాలో నటిస్తూనే డిస్కోరాజా, కలర్‌ఫొటో చిత్రాల్లో మెయిన్ విలన్‌గా నటించి ఆకట్టుకున్నాడు. ఆసక్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. క‌మెడియ‌న్‌గా, విల‌న్‌గా సునీల్ ఆక‌ట్టుకుంటోన్న స‌మ‌యంలో హీరోగా కూడా సునీల్‌కు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ద‌ర్శ‌కుడు వి.ఎన్‌.ఆదిత్య.. మినిమం బ‌డ్జెట్‌లో సునీల్‌తో ఓ సినిమాను చేస్తున్నాడు. దీన్ని అనీల్ సుంక‌ర నిర్మిస్తాడు. హీరోయిన్‌గా స‌లోని న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. 


రోజుకి 110 రూ.లు ఆదా చేస్తే.. 27 లక్షలు చేతికి.. అదిరిపోయే పాలసీ అందుబాటులో..?

తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>