PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/repe77c99256-3a07-428f-9400-b5c9e153765f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/repe77c99256-3a07-428f-9400-b5c9e153765f-415x250-IndiaHerald.jpgదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. సమాజంలో ఏదొఒక్క ప్రాంతంలో మహిళపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జార్ఖండ్‌లో దారుణం జరిగింది. 15 ఏళ్ల ఓ ఆదివాసీ బాలికపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి ఓ ఉత్సవానికి వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో బాలికపై ఈ అఘాయిత్యం జరిగింది. repe;sekhar;bharatiya janata party;congress;district;police;air;police station;traffic police15 ఏళ్ల బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం..!15 ఏళ్ల బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం..!repe;sekhar;bharatiya janata party;congress;district;police;air;police station;traffic policeThu, 03 Dec 2020 08:00:00 GMTపోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఖుంతీ జిల్లా ఎస్పీ అశుతోష్ శేఖర్ వెల్లడించిన కథనం ప్రకారం సోమవారం ఆ బాలిక తన స్నేహితులైన ఓ బాలిక, నలుగురు అబ్బాయిలతో కలిసి వారి గ్రామానికి 12కి.మీ దూరంలో జరుగుతున్న ఓ ఉత్సవానికి వెళ్లింది.

ఇక రాత్రి 9.30గంటల సమయంలో ఆ ఆరుగురు జాతర నుంచి ఇళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఓచోట ఐదుగురు దుండగులు బైక్స్‌తో వారిని అడ్డగించారు. ఆపై దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ ఆరుగురు తలో దిక్కు పరిగెత్తారు. 15ఏళ్ల ఆదివాసీ బాలికను వెంబండించారు. పరిగెత్తుతున్న ఆ బాలికను దుండగులు వెంటాడి మరీ పట్టుకున్నారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో దుండగుల కోసం విస్తృతంగా గాలించారు. బాధిత బాలికను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దుండగులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
గ్యాంగ్ రేప్ ఘటనపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ శాడియో తీవ్ర స్థాయిలో స్పందించారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేఎంఎం నేత్రుత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. గడిచిన 11 నెలల్లో రాష్ట్రంలో దాదాపు 1300 అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా జేఎంఎం,కాంగ్రెస్ నోరు విప్పకపోవడం దారుణమన్నారు. తాజా ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రతుల్ శాడియో డిమాండ్ చేశారు.


దారుణం : భార్య అలా చేసిందని.. ఐదుగురు స్నేహితులతో రేప్ చేయించిన భర్త..?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>