MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/short-film-stars60b21fb1-1109-433c-877d-e545006a5186-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/short-film-stars60b21fb1-1109-433c-877d-e545006a5186-415x250-IndiaHerald.jpgనిన్న మొన్నటి వరకు కేవలం షార్ట్ ఫిలిం నటులు ..నేడు స్టార్ యాక్టర్స్. షార్ట్ ఫిలిమ్స్ తో స్టార్ట్ చేసి వెండితెరపై మెరుస్తున్న నటీనటులు వీరే. ప్రముఖ నటీనటులు షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి వెండితెరపై తళుక్కుమని మెరుస్తున్నారు. short film stars;nani;chandni;ram gopal varma;atreya;chandini chowdary;choudary actor;madhura sridhar reddy;pujita ponnada;pujitha;rahul new;rahul;rahul ramakrishna;raj;ramakrishna;rithu;rajamouli;suhas;tarun;vijay;vijay deverakonda;k l rahul;adinarayanareddy;cinema;telugu;jabardasth;arjun reddy;media;majili;marriage;youtube;you tube;hero;rahul sipligunj;heroine;joseph vijay;dear comrade;kusuma jagadish;samanthakamani;arjun 1;raj tarun;reddy;tuck jagdish;tarun kumar;devarakonda;tuck jagadish;chitramనిన్న మొన్నటి వరకు కేవలం షార్ట్ ఫిలిం నటులు ..నేడు స్టార్ యాక్టర్స్నిన్న మొన్నటి వరకు కేవలం షార్ట్ ఫిలిం నటులు ..నేడు స్టార్ యాక్టర్స్short film stars;nani;chandni;ram gopal varma;atreya;chandini chowdary;choudary actor;madhura sridhar reddy;pujita ponnada;pujitha;rahul new;rahul;rahul ramakrishna;raj;ramakrishna;rithu;rajamouli;suhas;tarun;vijay;vijay deverakonda;k l rahul;adinarayanareddy;cinema;telugu;jabardasth;arjun reddy;media;majili;marriage;youtube;you tube;hero;rahul sipligunj;heroine;joseph vijay;dear comrade;kusuma jagadish;samanthakamani;arjun 1;raj tarun;reddy;tuck jagdish;tarun kumar;devarakonda;tuck jagadish;chitramThu, 03 Dec 2020 12:00:00 GMTగతంలో సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలంటే రోజులతరబడి ఆడిషన్స్ జరిగే ప్రాంతంలో నటీనటులు వేచి చూసేవారు. ఆడిషన్స్ లో ఫెయిల్ అయితే మళ్లీ ఇంకొక ఆడిషన్స్ కి వెళ్లి ఎంతో కష్టపడి సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి ప్రయత్నించేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా యూసేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో.. నటీనటుల కష్టాలు పోయాయి. యూట్యూబ్ లో గాని ఫేసుబుక్ గాని నటీనటులు తమ నటనా ప్రతిభను చూపిస్తే చాలు.. అవకాశాలు అంతట అవే వచ్చేస్తున్నాయి. హైపర్ ఆది కూడా ఒక చిన్న షార్ట్ ఫిలిం లో నటించి జబర్దస్త్ షో లో అవకాశం దక్కించుకొని ఆ తర్వాత సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ఇంకా అదే విధంగా చాలామంది ప్రస్తుత ప్రముఖ నటీనటులు షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి వెండితెరపై తళుక్కుమని మెరుస్తున్నారు. వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1. రీతూ వర్మ

 పెళ్లి చూపులు, ఎవడే సుబ్రహ్మణ్యం, కేశవా వంటి చిత్రాల్లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్న రీతూవర్మ ప్రస్తుతం హీరో నాని సరసన టక్ జగదీష్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఆమె "అనుకోకుండా" అనే ఒక షార్ట్ ఫిలిం తో బాగా పాపులారిటీ తెచ్చుకుని సినిమా అవకాశాలు చేజిక్కించుకున్నారు.

2. సుహాస్

కలర్ ఫోటో సినిమాలో హీరోగా నటించిన సుహాస్ కూడా షార్ట్ ఫిలిమ్స్ తోనే తన కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, మజిలీ, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించి బాగా క్రేజ్ సంపాదించారు.

3. విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి సినిమా తో నేషనల్ స్టార్ గా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ కెరీర్ కూడా షార్ట్ ఫిలిమ్స్ తోనే ప్రారంభం అయ్యింది. ఈ రౌడీ బాయ్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే షార్ట్ ఫిలిం తో బాగా పాపులర్ అయ్యారు.  

4. చాందినీ చౌదరి

కలర్ ఫోటో సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ చాందిని చౌదరి కూడా షార్ట్ ఫిలిమ్స్ తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించారు. ముఖ్యంగా మధురం అనే షార్ట్ ఫిలిం ద్వారా ఆమె చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటివరకు చాందినీ చౌదరి ‘బ్రహ్మోత్సవం’ ‘శమంతకమణి’ ‘మను’ ‘కలర్ ఫోటో’ వంటి సినిమాల్లో నటించారు.

5. రాహుల్ రామకృష్ణ

అర్జున్ రెడ్డి సినిమాలో హీరో కి ఫ్రెండ్ పాత్రలో నటించిన రాహుల్ రామకృష్ణ ఆ తర్వాత కూడా చాలా ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటించి తెలుగులో మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. సైన్మా వంటి చిన్న షార్ట్ ఫిలిం తో క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు.

ఇంకా చెప్పుకుంటూ పోతే కుమారి 21ఎఫ్ ఫేమ్ రాజ్ తరుణ్, బ్రాండ్ బాబు ఫేమ్ పూజిత పొన్నాడ, ఈ నగరానికి ఏమైంది ఫేమ్ విశ్వక్సేన్ తదితరులు షార్ట్ ఫిలిమ్స్ తోనే పాపులారిటీ సంపాదించిన వెండితెరపై నటించే అవకాశాలను దక్కించుకున్నారు.


కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి ఆయనేనా...?

తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>