PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bandi-sanjay-sensational-comments-7f54932f-4f78-49e6-a23d-dfc65aa2ee95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bandi-sanjay-sensational-comments-7f54932f-4f78-49e6-a23d-dfc65aa2ee95-415x250-IndiaHerald.jpgఎన్నికల సందర్భంగా మొన్న తెరాస, ఎంఐఎం దాడుల్లో, పోలీస్ లాఠీచార్జిలో గాయపడిన కార్యకర్తలను నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనా రెడ్డి, పేరాల శేఖర్ రావుతో కలిసి పరామర్శించడానికి చైతన్యపురి, వెంగళరావు నగర్, ఆల్విన్ కాలనీ, షేక్ పేట తదితర ప్రాంతాలలో నిన్న పొద్దుబోయే దాకా పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసి అడ్డదారిలో ఎన్నికల్లో గెలవడానికి తెరాస ఎంఐఎం పార్టీలు అనేక మంది బీజేపీ కార్యకర్తల పై దgreater war;sekhar;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;huzur nagar;police;december;traffic police;cpi;reddy;pettaగ్రేటర్ యుద్ధం : పోలీసులే అలా చేయడం దుర్మార్గంగ్రేటర్ యుద్ధం : పోలీసులే అలా చేయడం దుర్మార్గంgreater war;sekhar;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;huzur nagar;police;december;traffic police;cpi;reddy;pettaThu, 03 Dec 2020 07:00:00 GMTఎన్నికల సందర్భంగా మొన్న తెరాస, ఎంఐఎం దాడుల్లో, పోలీస్ లాఠీచార్జిలో గాయపడిన కార్యకర్తలను నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనా రెడ్డి, పేరాల శేఖర్ రావుతో కలిసి పరామర్శించడానికి చైతన్యపురి, వెంగళరావు నగర్, ఆల్విన్ కాలనీ, షేక్ పేట తదితర ప్రాంతాలలో నిన్న పొద్దుబోయే దాకా పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసి అడ్డదారిలో ఎన్నికల్లో గెలవడానికి తెరాస ఎంఐఎం పార్టీలు అనేక మంది బీజేపీ కార్యకర్తల పై దాడులు చేశాయని ఆయన అన్నారు. 


దీన్ని బీజేపీ ఖండిస్తున్నదని అన్నారు. కళ్ళ ఎదుటే బీజేపీ కార్యకర్తల పైన దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గమని బండి సంజయ్ అన్నారు. కొన్ని చోట్ల స్వయంగా పోలీసులే విచక్షణారహితంగా బీజేపీ కార్యకర్తల పై లాఠీలు ఝళిపించారని, బాధితులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి బాధితుల పైనే కేసులు బనాయించారని ఆయన అన్నారు. ఇదంతా చూస్తుంటే ఈ తతంగం అంతా సీఎం, డీజీపీ ల డైరెక్షన్ లోనే జరుగుతున్నట్లు స్పష్టమవుతుందని ఆయన అన్నారు. ఎన్ని దాడులు జరిగినా, కార్యకర్తల కాళ్ళు చేతులు విరిగినా బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించి ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకారం అందించారని సంజయ్ అన్నారు. 


బీజేపీ కార్యకర్తల మీద జరిగిన దాడులకు రాష్ట్ర డిజిపి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దాడులు ఎదుర్కొని ప్రజాస్వామ్య తెలంగాణ ను నిర్మించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఇక మరి కాసేపట్లో మొన్న జరగని ఓల్డ్ మలక్ పేట డివిజన్ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 1 పోలింగ్ న బ్యాలెట్ పత్రాల్లో తప్పులు దొర్లడంతో రిపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసి నిర్ణయం తీసుకుంది. సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తు ముద్రించారు. ఈ అంశం మీద ఆర్వోను సస్పెండ్ చేసిన ఎన్నికల కమిషన్ ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తోంది.




ప్రభాస్ ఆదిపురుష్ సినిమా లో సీతా దేవిగా కృతి సనన్

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>