PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warc8017ce2-3033-495d-b4da-b5dd43ee78c6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warc8017ce2-3033-495d-b4da-b5dd43ee78c6-415x250-IndiaHerald.jpgప్రధాన పార్టీలన్నీ హోరా హోరీగా ప్రచారం చేసిన గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి. శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపుతో పార్టీల భవితవ్యం తేలిపోనుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్యే గట్టి పోటీ కనబడుతోంది. దీనికి తగ్గట్లే ఈ రెండు పార్టీలో గ్రేటర్ ఎన్నికల కోసం భారీగా ప్రచారం నిర్వహించాయి. టీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వంటి నేతలు ప్రచారం చేశారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు.greater-war;amit shah;kcr;ktr;kumaar;adhithya;kavitha;yogi;bharatiya janata party;telangana rashtra samithi trs;maharashtra - mumbai;smriti irani;devendra fadnavis;amith shah;police;uttar pradesh;maharashtra;traffic police;central government;mantraగ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలుగ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలుgreater-war;amit shah;kcr;ktr;kumaar;adhithya;kavitha;yogi;bharatiya janata party;telangana rashtra samithi trs;maharashtra - mumbai;smriti irani;devendra fadnavis;amith shah;police;uttar pradesh;maharashtra;traffic police;central government;mantraThu, 03 Dec 2020 21:00:00 GMTహైదరాబాద్‌: ప్రధాన పార్టీలన్నీ హోరా హోరీగా ప్రచారం చేసిన గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి. శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపుతో పార్టీల భవితవ్యం తేలిపోనుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్యే గట్టి పోటీ కనబడుతోంది. దీనికి తగ్గట్లే ఈ రెండు పార్టీలో గ్రేటర్ ఎన్నికల కోసం భారీగా ప్రచారం నిర్వహించాయి. టీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వంటి నేతలు ప్రచారం చేశారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. స్మృతి ఇరానీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.

ఇంతలా ప్రచారం చేసిన పార్టీలన్నీ ఎదురు చూస్తున్న ఫలితాల రోజు రానే వచ్చింది. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రేటర్‌ పరిధిలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, దీనిలో భాగంగా 4వ తేదీ ఉదయం 6గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6గంటల వరకు నగరంలో ఆంక్షలు విధిస్తున్నామని పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు. తాజా నిబంధనల ప్రకారం, రోడ్లపై ఎక్కువ మంది గుమిగూడటం, ఊరేగింపులు చేయడం నిషిద్ధం. అలాగే ఎవరూ కూడా ఎటువంటి ఆయుధాలూ కలిగి ఉండ కూడదు. చేతిలో కర్రలు, లాఠీలు, పేలుడు పదార్ధాలు, ఇతర ఆయుధాలు ఏవి ఉన్నా శిక్షార్హులే.


అలాగే ఊరేగింపులు, బృందాలుగా పోగవడం, సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా చేయకూడదు. టెంట్లు వేయడం, స్టేజీలు ఏర్పాటు చేయడంపై కూడా తాత్కాలికంగా నిషేధం విధించారు. మైకుల ఏర్పాటు, పబ్లిక్‌ లౌడ్‌ స్పీకర్లు వాడటం తప్పు. రాళ్లు పట్టుకొని ఉన్నా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారు. రోడ్లపైనా, కూడళ్లలో స్పీచులు ఇవ్వడం, ప్రదర్శనలు నిర్వహించడం, ప్లకార్డుల పట్టుకొని ప్రదర్శనలు చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం నేరాలని పోలీస్ ‌కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పోలీసులు, మిలిటరీ, పారామిలిటరీ, హోమ్‌ గార్డులు, ఎన్నికల సిబ్బందికి కొన్ని సడలింపులు ఇచ్చారు.




హరిద్వార్ లో జరగనున్న కుంభమేళా పనులు పరిశిలించిన ఉత్తరాఖండ్ సీఎం

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్

సొంతంగా గ్రేటర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాం

గ్రేటర్ యుద్ధం : బీజేపీకి అర్ధ సెంచరీ ఖాయం ?

ప్రశాంత్ నీల్ అదిరిపోయే గిఫ్ట్.. నిన్న సలార్..ఇప్పుడు..?

గ్రేటర్ యుద్దం : ఎగ్జిట్ పోల్స్ లో టి‌ఆర్‌ఎస్ విజయ భేరి.. ఫలితాలు కూడా ఇంతేనా !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>