Breakingyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/diesel-door-delivery010a85f1-aa0e-4804-9b6f-bb5f91fc2b53-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/diesel-door-delivery010a85f1-aa0e-4804-9b6f-bb5f91fc2b53-415x250-IndiaHerald.jpgమీ ఇంటికి ఉదయాన్నే పాలు పోసే వ్యక్తి వచ్చి పాలు పోసి వెళతాడా..? అయితే ఇక నుంచి పాల గిన్నె పక్కనే మరో బాటిల్ కూడా పెట్టండి. ఎందుకంటే ఇకనుంచి డీజిల్ కూడా అలాగే ఇంటికొచ్చి పోసి వెళతారు. షాక్ తిన్నారా..? కానీ ఇది నిజం. ఇక నుంచి డీజిల్ డోర్ డెలివరీ చేసే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. అంటే ఇకపై డీజిల్ కోసం పెట్రోల్ బంకుల చుట్టూ ...diesel door delivery;chetan;delhi;ratan tata;korcha;himachal pradesh;smart phone;petrol;diesel;uttar pradesh;oil;central government;houseడీజిల్ వినియోగదారులకు శుభవార్త.. ఇక డోర్ డెలివరీ కూడా!డీజిల్ వినియోగదారులకు శుభవార్త.. ఇక డోర్ డెలివరీ కూడా!diesel door delivery;chetan;delhi;ratan tata;korcha;himachal pradesh;smart phone;petrol;diesel;uttar pradesh;oil;central government;houseThu, 03 Dec 2020 21:59:07 GMTన్యూఢిల్లీ: మీ ఇంటికి ఉదయాన్నే పాలు పోసే వ్యక్తి వచ్చి పాలు పోసి వెళతాడా..? అయితే ఇక నుంచి పాల గిన్నె పక్కనే మరో బాటిల్ కూడా పెట్టండి. ఎందుకంటే ఇకనుంచి డీజిల్ కూడా అలాగే ఇంటికొచ్చి పోసి వెళతారు. షాక్ తిన్నారా..? కానీ ఇది నిజం. ఇక నుంచి డీజిల్ డోర్ డెలివరీ చేసే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. అంటే ఇకపై డీజిల్ కోసం పెట్రోల్ బంకుల చుట్టూ మీరు తిరగాల్సిన అవసరంలేదు. దర్జాగా ఇంట్లో కూర్చుని ఓ ఫోన్ కాల్ చేస్తే చాలు ‘ఎస్ సార్’ అంటూ డెలివరీ పర్సన్స్ వచ్చి డీజిల్ పోసి వెళ్లిపోతారు. దీనికోసం ఓ స్టార్టప్ కంపెనీ భారత్‌లోనే మొదలైంది. ఇప్పటికే అనేక పట్టణాల్లో తమ సేవలు ప్రారంభించేసింది. విశేషం ఏంటంటే ఈ స్టార్టప్‌ను టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ప్రారంభించనున్నారు.

 దీని సాయంతో డీజిల్ వాహనదారులు తమ ఇంటికే డీజిల్ తెప్పించుకోవచ్చు. రతన్ టాటా సారధ్యంలో ఫ్యూయల్ స్టార్టప్ ప్రారంభం కానుంది. ఈ స్టార్టప్ రిపోస్ ఎనర్జీ భాగస్వామ్యంతో డీజిల్‌ను హోం డెలివరీ చేయనుంది. ఈ ప్రక్రియను వివిధ దేశాల్లోని వివిధ పట్టణాల్లో ప్రారంభించనున్నారు. డోర్-టు-డోర్ డీజిల్ డెలివరీ చేసే ఈ స్టార్టప్ కంపెనీ.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల భాగస్వామ్యంతో భారత్‌లోని అనేక ప్రాంతాల్లో కూడా డీజిల్ డోర్ డెలివరీని ప్రారంభించనుంది.

ఢిల్లీ, గుర్‌గావ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లలో ఈ ఫ్యూయల్ స్టార్టప్ తన సేవలను ప్రారంభించింది. పూణె కేంద్రంగా ఏర్పాటయిన ఈ కంపెనీని చేతన్, అదితి భోస్లే అనే ఇద్దరు వ్యక్తులు ప్రారంభించారు. మొబైల్ పెట్రోల్ పంపుల విధానంలో వీరు డీజిల్‌ను హోమ్ డెలివరీ చేస్తున్నారు. భవిష్యత్‌లో తమ వ్యాపారాన్ని మరింత వస్తృత పరచాలని, దాదాపు 3,200 రిపోస్ మొబైల్ పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయాలని ఈ స్టార్టప్ ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. రిపోస్ ఎనర్జీ స్టార్టప్ 2016లో ప్రారంభమైంది. ఇప్పటివరకూ 130 పట్టణాల్లో 300 రిపోస్ మొబైల్ పెట్రోల్ పంపుల ద్వారా తమ సేవలు అందిస్తున్నారు.


రజినీకాంత్ పార్టీ పెట్టడాన్ని స్వాగతించిన చంద్రబాబు నాయుడు

గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్

సొంతంగా గ్రేటర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాం

గ్రేటర్ యుద్ధం : బీజేపీకి అర్ధ సెంచరీ ఖాయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>