PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/hot-discussion-on-greater-polling-in-social-mediaab08d2a7-7d5b-4272-bc58-8c3c06b8727e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/hot-discussion-on-greater-polling-in-social-mediaab08d2a7-7d5b-4272-bc58-8c3c06b8727e-415x250-IndiaHerald.jpgజీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం అత్యల్పంగా ఉండటంతో.. హైదరాబాద్ వాసులపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. గ్రేటర్ ఓటర్లు బద్దకస్తులని, వరదసాయం కోసం క్యూలైన్లలో నిలబడినవారు, వైన్ షాపుల ముందు కరోనా టైమ్ లో కూడా క్యూ కట్టినవారు, కనీసం ఓటింగ్ కి ఎందుకు రాలేదని విమర్శిస్తున్నారు. సాక్షాత్తూ పోలీస్ ఉన్నతాధికారి సైతం.. ఓటు వేయనివారికి ప్రభుత్వ పథకాలు కట్ చేయాలంటూ మాట్లాడటం సంచలనంగా మారింది. అసలింతకీ గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేయకపోడవం పాపమా? ఓటు వేసినవాళ్లంతా పుణ్యాత్ములా? వేయనివాళ్లు ప్రజాస్వామ్యాన్ని అgreater-war;hyderabad;traffic police;partyగ్రేటర్ యుద్ధం : ఓటు వేయని వారు తప్పు చేసినట్టేనా..?గ్రేటర్ యుద్ధం : ఓటు వేయని వారు తప్పు చేసినట్టేనా..?greater-war;hyderabad;traffic police;partyThu, 03 Dec 2020 08:00:00 GMTహైదరాబాద్ వాసులపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. గ్రేటర్ ఓటర్లు బద్దకస్తులని, వరదసాయం కోసం క్యూలైన్లలో నిలబడినవారు, వైన్ షాపుల ముందు కరోనా టైమ్ లో కూడా క్యూ కట్టినవారు, కనీసం ఓటింగ్ కి ఎందుకు రాలేదని విమర్శిస్తున్నారు. సాక్షాత్తూ పోలీస్ ఉన్నతాధికారి సైతం.. ఓటు వేయనివారికి ప్రభుత్వ పథకాలు కట్ చేయాలంటూ మాట్లాడటం సంచలనంగా మారింది. అసలింతకీ గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేయకపోడవం పాపమా? ఓటు వేసినవాళ్లంతా పుణ్యాత్ములా? వేయనివాళ్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినవాళ్లవుతున్నారా..?

రాజ్యాంగం ఓటు హక్కునిప్రసాదించింది కానీ, దాన్ని ఎక్కడా నిర్బంధం చేయలేదు. అంటే ఓటు వేసే హక్కుతోపాటు, దాన్ని ఎవరికి వేయాలనే విచక్షణ, అసలు వేయాలా వద్దా అనే నిర్ణయం అన్నీ ఓటరుకే ఉన్నాయి. ఎవరూ వారిని ప్రలోభపెట్టడానికి వీల్లేదు, ప్రేరేపించడానికి అంతకంటే వీల్లేదు. అలాంటి సందర్భంలో ఓటు నిర్బంధం కాకపోవడం వల్లే పోలింగ్ శాతం తగ్గుతుందనే మాట వాస్తవం. అయితే గ్రేటర్ ఎన్నికల పోలింగ్ శాతంపై వినిపిస్తున్న కౌంటర్లకు.. సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రివర్స్ కౌంటర్లు పడుతున్నాయి.

"గత ఎన్నికల్లో మేం ఓటేశాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కదా అని ప్రతిపక్షాలకు చెందిన నాయకుల్ని ఎంచుకున్నాం. అయితే రెండు నెలలు తిరిగేలోగా వారు పార్టీ మారారు. అలాంటప్పుడు మేము ఈసారి ఎందుకు ఓటు వేయాలి. మేము ఓటు వేసి గెలిపించుకున్న నాయకులు పార్టీ మారితే మా ఓటు వృథా అయినట్టే కదా? శ్రమపడి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవడం ఎందుకు? అందుకే సైలెంట్ గా ఉంటున్నాం అంటున్నారు" కొంతమంది.

వీరి లాజిక్ లో కూడా ఎంతో కొంత నిజం ఉందని అనిపించక మానదు. ఓటు వేయకపోవడం తప్పు అంటున్నవారు, వారికి పథకాలు అందకూడదు అంటున్నవారు, పార్టీ ఫిరాయిస్తున్న వారిని ఎందుకు విమర్శించడంలేదని ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఫిరాయిస్తున్నవారికి పదవి తొలగించి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేకుండా చేస్తే.. తాము కూడా ఓటుని విధిగా వేస్తామని బదులిస్తున్నారు. ఇక్కడ ఫిరాయింపు దారులకి చట్టంలోని లొసుగులు బాగా ఉపయోగపడుతున్నాయి. తాము వేసిన ఓటుకి ఓ అర్థం, పరమార్థం లేనప్పుడు, నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాప్పుడు.. ఇక సామాన్య ప్రజలు, ఓటర్లు చేయగలిగిందేంటని ప్రశ్నిస్తున్నారు. 


టీడీపీ జగన్ ని ఇలా ఇబ్బంది పెడుతుందా...?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>