PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020e8170067-8968-4bb5-bd0a-6918f9c82f01-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020e8170067-8968-4bb5-bd0a-6918f9c82f01-415x250-IndiaHerald.jpgఎన్నికలు అంటేనే అధికార పార్టీలకు గుబులు సహజం. ఎన్ని చేసినా కూడా జనాల్లొ ఎక్కడో అసంతృప్తి గూడు కట్టుకుని ఉంటుంది. ఇది కట్టలు తెంచుకునేలా చేయడంతో విపక్షాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. అదే కనుక జరిగితే కొంప కొల్లేరు అని పాలక పార్టీలు కంగారు పడుతూంటాయి. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఖాయం, లక్ష ఓట్ల మెజారిటీ అని బరిలోకి దిగిన టీయారెస్ అనూహ్యంగా ఓటమి పలకరించింది. exit-polls-ghmc-2020;tiru;bharatiya janata party;partyగ్రేటర్ యుద్ధం : టీయారెస్ కి కౌంట్ డౌన్ ?గ్రేటర్ యుద్ధం : టీయారెస్ కి కౌంట్ డౌన్ ?exit-polls-ghmc-2020;tiru;bharatiya janata party;partyThu, 03 Dec 2020 22:00:00 GMT
దాంతో ఇపుడు గ్రేటర్ లో ఏం జరుగుతుంది. కధ ఎటు మలుపు తిరుగుతుంది అన్న టెన్షన్ లో గులాబీ శిబిరం మల్లగుల్లాలు పడుతోంది అంటున్నారు. కౌంటింగ్ కి కౌంట్ డౌన్ ఓ వైపు స్టార్ట్ అవుతూంటే టీయారెస్ కి పొలిటికల్ గా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీజేపీ అపుడే హాట్ హాట్ కామెంట్స్ చేస్తోంది. ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ అయితే బ్యాలెట్ బాక్సులు తెరిస్తే చాలు కమలం వికాసం తధ్యమని అంటున్నారు.

టీయారెస్ కి ఈసారి ఎన్నికలు క్యాట్ వాక్ అయితే కావు. రెండు నెలల క్రితం వచ్చిన భారీ వరదలతో గ్రేటర్ లో వ్యతిరేకతకు తొలి బీజం పడిపోయింది. దాని పెంచేలా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం వచ్చిపడింది. ఇక బీజేపీ చేసిన అతి తీవ్రమైన ఎన్నికల ప్రచారం వల్ల కూడా గ్రేటర్ జనం ఏమైనా ఆలోచనలో పడితే రిజల్ట్ తేడా కొడుతుందన్న ఆందోళన ఉంది.

గ్రేటర్ లో మేయర్ పీఠం కచ్చితంగా తమ పరం అవుతుంది అన్న ధీమా ఇప్పటికీ టీయారెస్ కి ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు ఉండడంతో 67 సీట్లు వస్తే చాలు అంతకంటే తగ్గితే మాత్రం మజ్లీస్ సాయం తీసుకోవాలి. నిజానికి టీయరెస్ కి ఈ రెండూ కూడా ఇష్టం లేదు అంటున్నరు. తాము ముందే చెప్పినట్లుగా సెంచరీ కొట్టి పూర్తి మెజారిటీతో మేయర్ పీఠమెక్కాలని ఆరాటపడుతోంది. కానీ ఇపుడున్న  నెక్ టూ నెక్ రాజకీయంలో అది జరిగే పనేనా అన్న డౌట్లు అందరిలోనూ ఉన్నాయి. టీయారెస్ కి కనుక 60 లోపు సీట్లు వస్తే మాత్రం మేయర్ పీఠం దక్కించుకున్నా కూడా పొలిటికల్ గా కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లేనని అంటున్నారు. కొద్ది గంటల్లో వచ్చే ఫలితాలు గులాబీ పార్టీకి  గుభాళింపును ఇస్తాయా గుబులు రేపుతాయా అన్నది తేలిపోతుంది.




రజినీకాంత్ పార్టీ పెట్టడాన్ని స్వాగతించిన చంద్రబాబు నాయుడు

గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్

సొంతంగా గ్రేటర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాం

గ్రేటర్ యుద్ధం : బీజేపీకి అర్ధ సెంచరీ ఖాయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>