CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/how-to-make-prawns-biryani5a3974dc-d673-44ab-a997-507655edd9d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/how-to-make-prawns-biryani5a3974dc-d673-44ab-a997-507655edd9d4-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...నాన్ వెజ్ ప్రియులు అమితంగా ఇష్టపడేది బిర్యానీని. బిర్యానీ ని ఇష్టపడని వారుండరు. ఇక ఈ బిర్యానీలో చాలా రకాల బిర్యానీలు వున్నాయి. అందులో రొయ్యల బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఇక ఈ రుచికరమైన ఘుమ ఘుమ లాడే రొయ్యల బిర్యానీని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి.... రొయ్యల బిర్యాని తయారీకి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం- ఒక కేజీ, రొయ్యలు- కేజీన్నర, పెరుగు- 200 గ్రాములు, నిమ్మరసం- మూడు టీస్పూన్లు, కారంపొడి- 20 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్prawns-biryani;india;onion;ginger;oil;garlic;ghee;aaviri;red chilly powder;coriander.;dhaniya powder;masalaరుచికరమైన నోరూరించే రొయ్యల బిర్యాని ఎలా చెయ్యాలో తెలుసుకోండి...రుచికరమైన నోరూరించే రొయ్యల బిర్యాని ఎలా చెయ్యాలో తెలుసుకోండి...prawns-biryani;india;onion;ginger;oil;garlic;ghee;aaviri;red chilly powder;coriander.;dhaniya powder;masalaThu, 03 Dec 2020 12:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...నాన్ వెజ్ ప్రియులు అమితంగా ఇష్టపడేది బిర్యానీని. బిర్యానీ ని ఇష్టపడని వారుండరు. ఇక ఈ బిర్యానీలో చాలా రకాల బిర్యానీలు వున్నాయి. అందులో రొయ్యల బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఇక ఈ రుచికరమైన ఘుమ ఘుమ లాడే రొయ్యల బిర్యానీని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

రొయ్యల బిర్యాని తయారీకి కావలసిన పదార్థాలు:

 బాస్మతి బియ్యం- ఒక కేజీ,
 రొయ్యలు- కేజీన్నర,
 పెరుగు- 200 గ్రాములు,
 నిమ్మరసం- మూడు టీస్పూన్లు,
 కారంపొడి- 20 గ్రాములు,
 అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 100 గ్రాములు,
 ఉప్పు- 50 గ్రాములు,
 గరంమసాలా- 20 గ్రాములు,
 రిఫైన్డ్‌ ఆయిల్‌- 100 గ్రాములు,
 సన్నగా నిలువుగా కోసి వేయించిన ఉల్లి పాయలు -30గ్రాములు,
 జీడిపప్పు - కొద్దిగా,
 కొత్తిమీర తరుగు - 15 గ్రాములు,
 పుదీనా తరుగు - 15 గ్రాములు,
 బిర్యానీ ఆకులు- ఐదు గ్రాములు,
 డాల్డా లేదా నెయ్యి- 150 గ్రాములు,
 నీళ్లు- 5 లీటర్లు..

రొయ్యల బిర్యాని తయారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో రొయ్యలు వేసి వాటిలో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరంమసాలా, వేగించిన ఉల్లి ముక్కలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, ధనియాల పొడి, నూనె వేసి మాగ్నెట్ తయారు చేసుకోవాలి. దీన్ని రెండు గంటలపాటు అలాగే ఉంచాలి.ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో గరం మసాలా, బిర్యానీ ఆకులు వేయాలి. నీళ్లు మరిగాక కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేయాలి. బియ్యం సగం ఉడికాక నీళ్లు వంపేయాలి.తర్వాత అన్ని వైపులా సమంగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందుగా మాగ్నెట్ చేసుకున్న రొయ్యల్ని ఒక పొరలా వేయాలి.

వాటిపైన సగం ఉడికించిన బిర్యానీ రైస్‌ను పొరలా పరవాలి. పైన నెయ్యి వేయాలి.తర్వాత ఆ గిన్నెను ఒక స్టౌపై ఉంచి సన్నటి మంట మీద 25 నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, మూతను కలిపి మైదాతో మూసేయాలి. 20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి. అంతే రుచికరమైన రొయ్యల బిర్యానీ రెడీ అయినట్లే..ఈ రొయ్యల బిర్యానీ ఏమీ కలుపుకోకుండా అలానే తిన్నా రుచిగా ఉంటుంది. పెరుగు పచ్చడితో తింటే మరింత బాగుటుంది.ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


చంద్రబాబు భారీ బహిరంగ సభ...?

తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>