PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-kollywood-politics-tamilnadu80b4b24a-b506-4407-8876-9ee9509ced76-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-kollywood-politics-tamilnadu80b4b24a-b506-4407-8876-9ee9509ced76-415x250-IndiaHerald.jpgరజనీకాంత్ తన ప్రత్యక్ష రాజకీయాల అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చేశారు. ఇది ఫ్యాన్స్‌కు నెల రోజులకు ముందే అందిన న్యూ ఇయర్ గిఫ్ట్ గా అభిమానులు ఫీల్ అవుతున్నారు. తమ రాజకీయ పార్టీపై ట్విట్టర్ వేదికగా తలైవా క్లారిటీ ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నామని ట్వీట్ చేశారు. జనవరిలో పార్టీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.. డిసెంబర్ 31న పార్టీ వివరాలు ప్రకటిస్తామన్నారు. 2021 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని తెలిపారు.rajnikant;rajinikanth;cinema;rajani kanth;tamil;december;twitter;industry;gift;party;raghavendraఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ !ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ !rajnikant;rajinikanth;cinema;rajani kanth;tamil;december;twitter;industry;gift;party;raghavendraThu, 03 Dec 2020 15:00:00 GMTసూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ అభిమానులు ఆయన ప్రత్యక్ష రాజకీయాల అనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రతీ సందర్భంలోనూ వారికి వారి ఆరాధ్య నటుడి నుంచి నిరాశ కలిగించే దాటవేత సమాధానాలే వినిపించడంతో కాసింత బాధతోనే నిరాశ చెందుతుండేవారు కానీ ఇప్పుడు వారి ఆశలకు ఊతమిచ్చేలాంటి విషయం తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు. అదే తన ప్రత్యక్ష రాజకీయాల అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చేశారు. ఇది ఫ్యాన్స్‌కు నెల రోజులకు ముందే అందిన న్యూ ఇయర్ గిఫ్ట్ గా అభిమానులు ఫీల్ అవుతున్నారు. తమ రాజకీయ పార్టీపై ట్విట్టర్ వేదికగా తలైవా క్లారిటీ ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నామని ట్వీట్ చేశారు. జనవరిలో పార్టీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.. డిసెంబర్ 31న పార్టీ వివరాలు ప్రకటిస్తామన్నారు. 2021 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని తెలిపారు.


సోమవారం తన అభిమాన సంఘాల నాయకులతో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో రజినీ సమావేశమయ్యారు. రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో సమావేశం తర్వాత నేరుగా తన నివాసం పోయెస్ గార్డెన్‌కు చేరుకున్న రజినీ.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రవేశంపై వీలైనంత తర్వగా నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. మక్కళ మండ్రం సభ్యులతో తన అభిప్రాయాలను పంచుకున్నానని తెలిపారు. మక్కళ మండ్రంలోని లోటుపాట్ల గురించి చర్చించినట్టు తలైవా వివరించారు. రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం సుమారు పాతికేళ్లుగా నలుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అనే విషయమై 1996వ ఏడాది నుంచి చర్చ జరుగుతుండగా.. మూడేళ్ల క్రితం రజనీ ఆ ఉత్కంఠకు తెరదించారు. రాజకీయాలకు సంబంధించిన ప్రకటన చేసినా కూడా క్రియాశీలక రాజకీయాలకు ఇన్నాళ్లు దూరంగానే ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ అరంగేట్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చలకే పరిమితమైంది. ఇప్పుడు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ విషయమై చర్చ నడుస్తుంది. ఇప్పుడు చూడాలి సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ వెంట తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి ఎంతమంది సినీ ప్రముఖులు నడువనున్నారో!

" style="height: 414px;">




విధి ఎంత విచిత్రమైనది.. తల పైకి లేపి ఉంటే ప్రాణం నిలిచేది.. కానీ చివరికి..?

అమ్మ: పాలిచ్చే తల్లులూ.. పిల్లల ఎదుగుదలకు ఈ ఆహారం తీసుకోండి..!?

గ్రేటర్ యుద్ధం : ఈ ఒక్క రోజు గడిస్తే చాలు..?

గ్రేటర్ యుద్ధం : ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ది కోసమే పువ్వాడ హత్య కుట్ర...!!

క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు.. ఇక ఆ తర్వాత..?

తమిళ నాట తలైవా ఎంట్రీ: రాజకీయ అరంగేట్రానికి రజిని ఓకే

2000 రూ..ల నోట్లు బంద్... క్లారిటీ ఇచ్చిన కేంద్రం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>