PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020390d5b24-0ca2-4169-a1de-aa8ddb45e866-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020390d5b24-0ca2-4169-a1de-aa8ddb45e866-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి తీవ్రస్థాయిలో మహానగరం మొత్తం మీద హడావుడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక పోలింగ్ కూడా ముగిసిపోవడంతో అందరూ ఇక చివరి అంకం అయిన ఫలితాల గురించి ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఆ ఘట్టం కూడా రేపే జరుగనుంది. ఇక రేపు జరగబోయే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే శుక్రవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రేటర్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బందోబస్తును ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ ఆంజనీ కుమార్ వెల్లడించారు.greater-war;kumaar;hyderabad;telangana;capitalగ్రేటర్ యుద్ధం: రేపు జరగబోయే ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం - సీపీ అంజనీ కుమార్!గ్రేటర్ యుద్ధం: రేపు జరగబోయే ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం - సీపీ అంజనీ కుమార్!greater-war;kumaar;hyderabad;telangana;capitalThu, 03 Dec 2020 19:00:00 GMTగత పదిహేను రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి తీవ్రస్థాయిలో మహానగరం మొత్తం మీద హడావుడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక పోలింగ్ కూడా ముగిసిపోవడంతో అందరూ ఇక చివరి అంకం అయిన ఫలితాల గురించి ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఆ ఘట్టం కూడా రేపే జరుగనుంది. ఇక రేపు జరగబోయే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే శుక్రవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రేటర్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బందోబస్తును ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ ఆంజనీ కుమార్ వెల్లడించారు. శుక్రవారం జరగబోయే జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రేటర్లో శాంతిభద్రతల ఏర్పాటులో భాగంగా 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిషేదాజ్ఞలు విధిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ర్యాలీలు కూడా చేయవద్దు అని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెల్సిందే.



అందులో భాగంగానే రోడ్లపై ఎక్కువ మంది గుమిగూడడం, ఊరేగింపులను చేయడం నిషేధించారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరూ ఆయుధాలను చేతిలో కర్రలు, లాఠీలు, పేలుడు పదార్ధాలు, ఇతర ఆయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. అలాగే ఊరేగింపులు, గుంపులు గుంపులుగా పోగవడం, సమావేశాలు నిర్వహించడం వంటివి కూడా నిషేధించారు. తాత్కాలికంగా ఎక్కడా టెండ్లు వేయడం, స్టేజీలను ఏర్పాటు చేయడం.. మైకులు ఏర్పాటుచేయడం, పబ్లిక్‌ లౌడ్‌ స్పీకర్లను ఉపయోగించరాదు. రాళ్లను కలిగి ఉండడం, తరలించం కూడా చేయరాదు. రోడ్లపైనా, కూడళ్లలో ప్రసంగాలు ఇవ్వడం, ప్రదర్శనలు నిర్వహించడం, ప్లకార్డుల ప్రదర్శనలు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వంటివి కూడా చేయరాదని పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులు మాత్రమే కాకుండా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఈ ఫలితాల కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.




గ్రేటర్ యుద్ధం : ఈ తీర్పు కఠినమేనట ?

ఈ విషయంలో మోడీ బిగ్గెస్ట్ ఫెయిల్

జమిలీ వద్దంటున్న బిజెపి సిఎంలు

గ్రేటర్ ఎన్నికలు: బండి సంజయ్ కీలక ఆదేశాలు

బ్రేకింగ్: విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ ఆరోగ్యం

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు.. భర్త !

సిల్క్ కన్ను మూస్తే ఆమెపై ఈగలు దోమలు వాలకుండా చూసుకున్న ఈ పెద్దావిడ ఎవరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>