Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna49b51317-1187-45a2-bd15-25e34db0b026-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna49b51317-1187-45a2-bd15-25e34db0b026-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మన్మధుడు నాగార్జున కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గా కొనసాగుతున్న నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమలో మైలురాళ్లుగా నిలిచిపోయే విధంగా ఎన్నో సినిమాల్లో నటించారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగార్జున నటించిన అద్భుతమైన సినిమాలలో ఒకటి అన్నమయ్య. అయితే కేవలం అన్నమయ్య సినిమా లోనే కాదు శ్రీరామదాసు.. ఓం నమో వెంకటేశాయ శిరిడి సాయి ఇలాంటి భక్తి కథా చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులందరినీ మైమరిపించారు నాగార్జున. ఇక భక్తి కథా చిత్రాలు ఏకంగా పnagarjuna;nagarjuna akkineni;deva;nageshwara rao akkineni;suman;vidya;tollywood;cinema;sri venkateswara swamy;hero;annamayya'అన్నమయ్య' సినిమాలో వెంకటేశ్వర స్వామిగా నటించాల్సింది.. సుమన్ కాదట.. ఎవరంటే..?'అన్నమయ్య' సినిమాలో వెంకటేశ్వర స్వామిగా నటించాల్సింది.. సుమన్ కాదట.. ఎవరంటే..?nagarjuna;nagarjuna akkineni;deva;nageshwara rao akkineni;suman;vidya;tollywood;cinema;sri venkateswara swamy;hero;annamayyaThu, 03 Dec 2020 11:20:00 GMTటాలీవుడ్ మన్మధుడు నాగార్జున కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గా కొనసాగుతున్న నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమలో  మైలురాళ్లుగా నిలిచిపోయే విధంగా ఎన్నో సినిమాల్లో నటించారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగార్జున నటించిన అద్భుతమైన సినిమాలలో ఒకటి  అన్నమయ్య. అయితే కేవలం అన్నమయ్య సినిమా లోనే కాదు శ్రీరామదాసు.. ఓం నమో వెంకటేశాయ శిరిడి సాయి ఇలాంటి భక్తి కథా చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులందరినీ మైమరిపించారు నాగార్జున.



 ఇక భక్తి కథా చిత్రాలు ఏకంగా పాత్రలో ఒదిగిపోయి జీవించి మరి నటించడం నాగార్జున కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే శిరిడి సాయిబాబా సినిమాలో  దేవుడు పాత్రలో నటించిన నాగార్జున మిగతా సినిమాల్లో మాత్రం దేవుడికి భక్తుడి పాత్రల్లో నటించారు. ముఖ్యంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన అన్నమయ్య సినిమాలో నాగార్జున ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు రాసిన పరమభక్తుడు అన్నమయ్యగా  నాగార్జున నటించిన ఎంతగానో గుర్తింపు సంపాదించడమే కాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ మైలురాయిలా నిలిచిపోయే సినిమా తన కెరీర్లో చేశాడు.



 అయితే నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన అన్నమయ్య సినిమాలో శ్రీ ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి గా సుమన్ నటిస్తాడు అన్న విషయం తెలిసిందే. ఇక వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ ఒదిగిపోయిన తీరు అటు భక్తులందరిని  కూడా ఎంతో మెప్పిస్తుంది. అయితే మొదట వెంకటేశ్వర స్వామి గా సుమన్ ను  కాకుండా బాలకృష్ణను ఈ పాత్ర కోసం సెలెక్ట్ చేయాలి అని అందరూ అనుకున్నారట. కానీ వెంకటేశ్వరస్వామి పాత్ర దారి పాదాలపై పడే  ఒక సన్నివేశం సినిమా లో ఉంటుంది ఈ క్రమంలోనే అక్కినేని అభిమానులు మనోభావాలు దెబ్బతినకుండా.. ఫ్యాన్స్ మధ్య గొడవలు కాకుండా.. సుమన్ ను  ఆ పాత్ర కోసం సెలెక్ట్ చేసారట చిత్ర బృందం.


అయ్యప్ప భక్తులకు శుభవార్త.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>