PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020ab71bf8e-ea70-46ab-b8d8-65ab97da1fd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020ab71bf8e-ea70-46ab-b8d8-65ab97da1fd7-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 24 గంటల్లో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అదరి జాతకాలూ బ్యాలెట్ బాక్సుల్లోనే జాగ్రత్తగా ఉన్నాయి. వాటిని లెక్కిస్తే చాలు ఎవరేంటి అన్నది బయటపడుతుంది. మరి గ్రేటర్ ఎన్నికల ఫలితాల విషయంలో ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. తామే విజయం సాధిస్తామని అటు అధికార పక్షం టీయారెస్ ఇటు బీజేపీ కూడా గట్టి నమ్మకంతో ఉన్నాయి. exit-polls-ghmc-2020;modi;delhi;bharatiya janata party;narendra modi;smart phone;prime minister;central government;party;narendraగ్రేటర్ యుద్ధం : ఫలితాలపై కేంద్రం ఆసక్తి ?గ్రేటర్ యుద్ధం : ఫలితాలపై కేంద్రం ఆసక్తి ?exit-polls-ghmc-2020;modi;delhi;bharatiya janata party;narendra modi;smart phone;prime minister;central government;party;narendraThu, 03 Dec 2020 10:00:00 GMTబీజేపీ కూడా గట్టి నమ్మకంతో ఉన్నాయి.

మరి ఇంతకీ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది అందరిలోనూ ఆసక్తిని కలిగించేదిగా ఉంది. గ్రేటర్ ఎన్నికల మీద కేంద్రం చూపు కూడా ఉందని తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ స్వంగా తమ పార్టీ ప్రెసిడెంట్ బండి సంజయ్ కి ఫోన్ చేసి మరీ గ్రేటర్ ఎన్నికలు జరిగిన తీరు గురించి వాకబు చేయడమే ఇందుకు నిదర్శనం.

దీనిని బట్టి చూస్తే కేంద్రం కూడా గ్రేటర్ ఫలితాలను సీరియస్ గానే తీసుకుందని అర్ధమవుతోంది. కచ్చితంగా కమలం పార్టీ ఈసారి గణనీయమైన సీట్లను సాధిస్తుందని ఢిల్లీ పెద్దలు కూడా విశ్వాసంతో ఉన్నారనుకోవాలి. అయితే పోలింగ్ తక్కువ జరగడం మాత్రం బీజేపీ ఉత్సాహానికి అడ్డుకట్ట వేసినట్లేనని విశ్లేషణలు అయితే ఉన్నాయి.

కనీసం అరవై శాతం పోల్ జరిగినా బీజేపీ విజయం మీద ఎవరైనా చెప్పగలిగే పరిస్థితి ఉంది. కానీ గతం లో మాదిరిగానే పోలింగ్ శాతం ఉండడంతో అది అధికార పార్టీకే అనుకూలం అని అంటున్నారు. ఇక సాయంత్రం అయిదు వరకూ 36 శాతం ఉన్న పోలింగ్ కాస్తా రాత్రి ఎనిమిది గంటలకు ఒక్కసారిగా 9 శాతం పెరిగిపోవడం పట్ల కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే క్యూ లైన్లలో చివరి వరకూ నిలిచిన వారికి అవకాశం ఇవ్వడం వల్ల పోలింగ్ పెరిగింది అని ఎన్నికల సంఘం చెబుతోంది. మరి ఈ పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలం అన్నది కూడా ఇపుడు చర్చగా ఉందిట.




సిల్క్ స్మితను ప్రేమ పేరుతో మోసం చేసిన గడ్డం డాక్టర్ ఇతడే..?

దూసుకొస్తున్న బురేవి తుపాను... త‌మిళ‌నాడు, కేర‌ళ వ‌ణికిపోతున్నాయిగా...

గ్రేటర్ యుద్ధం : పెరిగిన పోలింగ్.. మాకే అనుకూలం

ప్రభాస్ 300 కోట్ల వెనుక సీక్రెట్ !

భారత్ ఆస్ట్రేలియా పర్యటన.. క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్..?

ఏపీ శాసన సభ ముందుకు కీలక బిల్లులు

హెరిటేజ్ కి జగన్ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>