PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020e4d71f81-76f1-4177-b129-216777772415-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020e4d71f81-76f1-4177-b129-216777772415-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల యుద్ధం ముగిసింది. ఫలితాల కోసం ఇప్పుడు అభ్యర్థులు, పార్టీలు ప్రజలు అందరిలోనూ టెన్షన్ ఉంది . ఎవరు గెలుస్తారు అనేది అర్థం కాని పరిస్థితి. ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో గెలుపు ఎవరు వైపు అనేది క్లారిటీ రావడం లేదు. అయితే ఎవరికి వారు గెలుపు తమదే అనే ధీమాలో ఉన్నారు. నాలుగో తేదీ అంటే రేపు ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని పార్టీలు టెన్షన్ గా ఎదురు చూస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ,గ్రేటర్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రేపు ఉదయం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు విధిస్greter- war ghmc elections results party;auto;amala akkineni;police;letter;traffic police;houseగ్రేటర్ యుద్ధం : రేపు బయటకి వచ్చారో అంతే ? ఎన్ని రూల్సో ?గ్రేటర్ యుద్ధం : రేపు బయటకి వచ్చారో అంతే ? ఎన్ని రూల్సో ?greter- war ghmc elections results party;auto;amala akkineni;police;letter;traffic police;houseThu, 03 Dec 2020 22:00:00 GMTగ్రేటర్ ఎన్నికల యుద్ధం ముగిసింది. ఫలితాల కోసం ఇప్పుడు అభ్యర్థులు, పార్టీలు ప్రజలు అందరిలోనూ టెన్షన్ ఉంది . ఎవరు గెలుస్తారు అనేది అర్థం కాని పరిస్థితి. ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో గెలుపు ఎవరు వైపు అనేది క్లారిటీ రావడం లేదు. అయితే ఎవరికి వారు గెలుపు తమదే అనే ధీమాలో ఉన్నారు. నాలుగో తేదీ అంటే రేపు ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని పార్టీలు టెన్షన్ గా ఎదురు చూస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ,గ్రేటర్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రేపు ఉదయం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలియజేశారు. ఈ నిషేధాజ్ఞలు కఠినంగా అమలు చేస్తామని, రోడ్లపై ఎక్కువమంది ఊరేగింపులు చేయడం వంటి వాటిని నిషేధించాము అని చెప్పారు.



 అలాగే ఎవరు ఆయుధాలతో తిరిగి రాదని, చేతుల్లో కర్రలు , లాఠీలు , పేలుడు పదార్థాలు ఇతర ఆయుధాలు ఏవి ఎవరి వద్ద ఉండకూడదని సీపీ స్పష్టం చేశారు. ఇక ఊరేగింపులు , గుంపులు గుంపులుగా జనాలు ఒకే చోట చేరడం,  సభలు , సమావేశాలు నిర్వహించడం వంటి వాటిని కూడా నిషేధిస్తున్నట్లు, ఎక్కడైనా తాత్కాలికంగా టెంట్లు వేసినా, స్టేజీలు ఏర్పాటుచేసినా, అలాగే మైకులు, పబ్లిక్ లౌడ్ స్పీకర్లు ఉపయోగించినా, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రోడ్ల పైన కూడళ్ళలో స్పీచ్ లు ఇవ్వడం , ప్రదర్శనలు నిర్వహించడం , ప్ల కార్డుల ప్రదర్శనలు, మత విద్వేషాలను రెచ్చగొట్టడం వంటివి చేయకూడదని నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు స్పష్టంగా తెలియజేశారు. 



ఇక నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు 
పోలీసులు, పారామిలటరీ, హోమ్ గార్డ్స్ తో
భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఎన్నికల డ్యూటీలో ఉన్న వారికి ఈ నిబంధనల నుంచి సడలింపు ఇచ్చారు. అలాగే నగరంలో అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో , ముందుగా నగరంలో భారీ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా నగరం మొత్తం పోలీసుల నిఘా నీడలో ఉన్న నేపథ్యంలో , పైన తెలిపిన అన్ని విషయాలను గుర్తుపెట్టుకుని వాటికి అనుగుణంగా వ్యవహరించకపోతే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే.







గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ ఏజెంట్లతో టీఆర్ఎస్ మంత్రుల భేటీ!

గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్

సొంతంగా గ్రేటర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాం

గ్రేటర్ యుద్ధం : బీజేపీకి అర్ధ సెంచరీ ఖాయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>