PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/exit-polls-ghmc-20202cd0c19f-0cda-473f-861b-20a5d578d550-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/exit-polls-ghmc-20202cd0c19f-0cda-473f-861b-20a5d578d550-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే పోలింగ్ స్టేషన్ 69 ఇది గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్‌‌లో సంచలనంగా మారిన నెంబర్. ఎందుకంటే ఈ సెంటర్‌లో గురువారం రీ పోలింగ్ జరుగనుంది. ఓల్డ్‌ మలక్‌పేటలోని డివిజన్‌ నంబరు 26లో సీపీఐ అభ్యర్థి ఎన్నికల గుర్తుకు బదులుగా సీపీఎం గుర్తును ముద్రించారు. exit polls ghmc 2020;hyderabad;election;central government;election commission;chadha venkat reddy;cpi;partyగ్రేటర్ యుద్ధం: మలక్‌పేటలో రీ పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు..!గ్రేటర్ యుద్ధం: మలక్‌పేటలో రీ పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు..!exit polls ghmc 2020;hyderabad;election;central government;election commission;chadha venkat reddy;cpi;partyThu, 03 Dec 2020 07:00:00 GMTహైదరాబాద్ పోలింగ్‌‌లో సంచలనంగా మారిన నెంబర్. ఎందుకంటే ఈ సెంటర్‌లో గురువారం రీ పోలింగ్ జరుగనుంది. ఓల్డ్‌ మలక్‌పేటలోని డివిజన్‌ నంబరు 26లో సీపీఐ అభ్యర్థి ఎన్నికల గుర్తుకు బదులుగా సీపీఎం గుర్తును ముద్రించారు. పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే దీనిని గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో డివిజన్‌ మొత్తం ఎన్నికను నిలిపి వేశారు. ఈనెల 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ స్టేషన్లు 69.. రీపోలింగ్‌ నిర్వహించనున్నారు.

అయితే ఓల్డ్ మలక్‌పేటలోని 26వ డివిజన్‌లో ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ డివిజన్‌ పరిధిలో సుమారు 54,655 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 27889, స్త్రీలు 26763, ఇతరులు 3 ఉన్నారు. ఇక్కడ పోలింగ్‌ను పూర్తిగా రద్దు చేయడంతో రద్దు అయిన రోజు ఓటు వేసినవారు కూడా మరోసారి ఓటును వినియోగించుకోవల్సి ఉంటుంది. కాగా, ఇక్కడ పోలింగ్‌లో పాల్గొన్న వారి ఎడమ చేతి చూపుడు వేలికి ఇప్పటికే సిరా గుర్తు వేసినందున 3వ తేదీన జరిగే పోలింగ్‌ రోజున ఓటర్లకు ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని ఈసీ నిర్ణయించింది.

ఇక ఆ రోజు బ్యాలెట్‌పై నాలుగో అభ్యర్థిగా సీపీఐ నుంచి ఫిర్దౌస్‌ ఫాతిమా బరిలో ఉన్నారు. సీపీఐ అభ్యర్థులకు కంకి కొడవలి గుర్తును కేటాయించాలి. కానీ, ఇక్కడ సుత్తి కొడవలి, నక్షత్రం (CPM గుర్తు) గుర్తును కేటాయించారు. ఈ పొరపాటును ఒక పోలింగ్‌ కేంద్రం ద్వారం వద్ద అతికించిన బ్యాలెట్‌ జాబితాలో గుర్తించిన ఆ పార్టీ నేతలు వెంటనే విషయాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన ఎన్నికల సంఘం కమిషనర్‌ సి.పార్థసారధికి ఫిర్యాదు చేశారు.


గ్రేటర్ యుద్ధం : అక్కడ రీపోలింగ్ మొదలయ్యింది..?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ అబ్జర్వర్ల నియామకం పూర్తి.. వెల్లడించిన టీఎస్ఈసీ

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

కవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>