PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/greater-war70723266-380d-470f-b72e-1a5e4e4369d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/greater-war70723266-380d-470f-b72e-1a5e4e4369d2-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అగ్ర నాయకత్వం కదలి వచ్చింది. వ్యాక్సిన్ పని మీద మీద హైదరాబాద్ వచ్చినా.. సరిగ్గా ఎన్నికల ముందు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన కూడా ఆసక్తికరంగా సాగింది. ఆ లెక్కన చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. ఇంకా పలువురు కేంద్ర మంత్రులు.. హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. అయితే ఈ సందడి అక్కడికే పరిమితమా లేక త్వరలో జరగబోతున్న తిరుపతి ఉప ఎన్నికకు కూడా వర్తిస్తుందా అనేది సందేహాస్పదం. greater-war;pawan;amit shah;pawan kalyan;tara;tiru;hyderabad;bharatiya janata party;maharashtra - mumbai;narendra modi;amith shah;tirupati;prime minister;chief minister;uttar pradesh;minister;maharashtra;husband;central government;party;mantra;narendraగ్రేటర్ యుద్ధం: గ్రేటర్ ప్రభావం తిరుపతి ఉప ఎన్నికలపై ఉంటుందా..?గ్రేటర్ యుద్ధం: గ్రేటర్ ప్రభావం తిరుపతి ఉప ఎన్నికలపై ఉంటుందా..?greater-war;pawan;amit shah;pawan kalyan;tara;tiru;hyderabad;bharatiya janata party;maharashtra - mumbai;narendra modi;amith shah;tirupati;prime minister;chief minister;uttar pradesh;minister;maharashtra;husband;central government;party;mantra;narendraThu, 03 Dec 2020 12:00:00 GMTబీజేపీ అగ్ర నాయకత్వం కదలి వచ్చింది. వ్యాక్సిన్ పని మీద మీద హైదరాబాద్ వచ్చినా.. సరిగ్గా ఎన్నికల ముందు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన కూడా ఆసక్తికరంగా సాగింది. ఆ లెక్కన చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. ఇంకా పలువురు కేంద్ర మంత్రులు.. హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. అయితే ఈ సందడి అక్కడికే పరిమితమా లేక త్వరలో జరగబోతున్న తిరుపతి ఉప ఎన్నికకు కూడా వర్తిస్తుందా అనేది సందేహాస్పదం.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా, కనీసం చెప్పుకోదగ్గ స్థానాల్లో పాగా వేసినా కమలదళంలో ఉత్సాహానికి అంతే ఉండదు. అటు దుబ్బాక విజయం, ఇటు గ్రేటర్ సంతోషం వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అదే ఊపులో వారు తిరుపతి ఉప ఎన్నికకు సిద్ధం అవుతారు. పవన్ కల్యాణ్ అభ్యర్థన సైతం పక్కనపెట్టి తిరుపతికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు మెరుగవుతాయి. అంతే కాదు.. బీజేపీ అగ్రనాయకత్వం మరోసారి ఏపీలో కూడా పర్యటిస్తుంది. తిరుపతి ఉప ఎన్నికలకు మరింత మంది నేతలు ప్రచారం చేసే అవకాశాలున్నాయి.

ఇక గ్రేటర్ లో బీజేపీకి పరాజయం పాలయితే మాత్రం లెక్కలు తారుమారవుతాయి. ఇటు ఏపీలో తిరుపతి ఉప ఎన్నికల్లో సందడి తగ్గుతుంది. పవన్ కల్యాణ్ కూడా తిరుపతి ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ చేసే అవకాశం ఉంది. అంటే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయంపై తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిత్వం ఖరారవుతుందనమాట. ఒకవేళ గ్రేటర్ లో ఓడిపోతే.. తిరుపతిలో బీజేపీకి ప్రతికూల పవనాలు ఎదురవుతాయి. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కూడా కనుమరుగవుతుంది. దుబ్బాక ఫలితం వచ్చిన వెంటనే జోరుమీదున్న బీజేపీ నాయకులు.. రెండు రోజులపాటు తిరుపతి కేంద్రంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రేటర్ ఫలితం తేడా వస్తే.. ఆ సందడి మాయమైపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి ఆయనేనా...?

తెలంగాణలో ఆధార్ లేకుంటే నో రేషన్.....

గ్రేటర్ యుద్ధం : జాతకాలు మార్చేసే ఒకే ఒక్క ఓటు ...?

ఢిల్లీ దిగ్బంధం హోరెత్తుతున్న రైతుల నిరసన

ఫైజర్ వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అదిరిపోయిన నిహారిక వెడ్డింగ్ కార్డు..

పూజా ఏం చేసినా సెన్సేషనే కదా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>