MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/ravitejae91d768d-186b-45cf-8f83-c848c309aa64-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/ravitejae91d768d-186b-45cf-8f83-c848c309aa64-415x250-IndiaHerald.jpg ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తోన్న సినిమా 'క్రాక్‌'. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో "బలుపు" సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మళ్ళీ ఇన్నేళ్లకు వీరి కాంబినేషన్ లో "క్రాక్" మూవీ వస్తుంది. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్త‌యిన ఈ చిత్రానికి సంబంధించి ఓ పాట చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలి ఉంది. శుక్ర‌వారం నుంచి ప్రారంభం కానున్న చివ‌రి షెడ్యూల్‌లో ఈ సాంగ్ షూట్ చేయనున్నారుraviteja-sruthihasan;gopichand;shruti;shruti haasan;geetha;kranthi;kranti;rani;ravi anchor;sruthi;teja;makar sakranti;goa;india;cinema;sangeetha;sankranthi;blockbuster hit;heroine;mass;beautiful;krack;chitramగోవాకి వెళుతున్న మాస్ రవి తేజ, శృతి హాసన్...గోవాకి వెళుతున్న మాస్ రవి తేజ, శృతి హాసన్...raviteja-sruthihasan;gopichand;shruti;shruti haasan;geetha;kranthi;kranti;rani;ravi anchor;sruthi;teja;makar sakranti;goa;india;cinema;sangeetha;sankranthi;blockbuster hit;heroine;mass;beautiful;krack;chitramThu, 03 Dec 2020 16:00:00 GMT
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తోన్న సినిమా 'క్రాక్‌'. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో "బలుపు" సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మళ్ళీ ఇన్నేళ్లకు వీరి కాంబినేషన్ లో "క్రాక్" మూవీ వస్తుంది. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్త‌యిన ఈ చిత్రానికి సంబంధించి ఓ పాట చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలి ఉంది. శుక్ర‌వారం నుంచి ప్రారంభం కానున్న చివ‌రి షెడ్యూల్‌లో ఈ సాంగ్ షూట్ చేయనున్నారు. రేపటినుంచి మొదలు కాబోతున్న షెడ్యూల్ 'క్రాక్' సినిమాకు చివరి షెడ్యూల్ కానుంది. గోవా పర్యటనతో షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నామని తాజాగా ప్రకటించింది చిత్రయూనిట్.


ఈ క్రమంలో ర‌వితేజతో కలిసి గోవాకు పయనమైంది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్. గత కొంతకాలంగా మాస్ మాహారాజ్‌తో కలిసి క్రాక్ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆమె గోవా షెడ్యూల్‌తో మొత్తం ఫినిష్ చేయనుంది. గోవాలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ర‌వితేజ‌, శృతిహాసన్ లపై ఈ సాంగ్ చిత్రీకరించనున్నారు. రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీ స‌మ‌కూరుస్తున్న ఈ పాట‌తో క్రాక్ షూటింగ్ మొత్తం పూర్తికానుంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారట నిర్మాతలు . ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాను అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఓ ఇంటెన్స్ స్టోరీతో కెమెరాలో బంధిస్తున్నారు.


ఈ చిత్రంలో అప్స‌రా రాణి స్పెషల్ సాంగ్ చేసింది. ఇటీవలే విడుదలైన ఈ‌ "భూమ్ బ‌ద్ద‌ల్" స్పెష‌ల్ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. ఎస్. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా 'క్రాక్' మూవీని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....


హైదరాబాద్ లో రాజకీయ పార్టీలకు స్ట్రాంగ్ వార్నింగ్

అమ్మో.. ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న ఆ నటుడికి అన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారా..??

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు..!

స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేటస్ కో కి హై కోర్ట్ నో

పవర్ స్టార్, సూపర్ స్టార్ కాంబినేషన్ లో సినిమానా?

అదిరిపోయే ఆఫర్.. నెలకు 6000 తో కోటీశ్వరులు అవ్వండి..?

విధి ఎంత విచిత్రమైనది.. తల పైకి లేపి ఉంటే ప్రాణం నిలిచేది.. కానీ చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>