MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas01fedf5d-eb8a-489a-a042-6df8aa70fa0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas01fedf5d-eb8a-489a-a042-6df8aa70fa0c-415x250-IndiaHerald.jpgఇటీవల టాలీవుడ్ బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్ ఒకదాని వెంట ఒకటి వరుసగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ దాని అనంతరం నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ వారి సినిమా, టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాణంలో ఆదిపురుష్ అనే ప్రతిష్టాత్మక సినిమా అలానే కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీస్ లో కూడా నటించనున్న విషయం తెలిసిందే. prabhas;war movie;prabhas;bhushan kumar;hrithik roshan;kumaar;tiger shroff;krishnam raju;naga;prasanth;prashanth neel;roshan;vyjayanthi;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;blockbuster hit;war;kgf;prasanth neel;vemuri radhakrishna;prashant kishorప్రభాస్ ఖాతాలో బడా బాలీవుడ్ మూవీ ... మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాకే ...??ప్రభాస్ ఖాతాలో బడా బాలీవుడ్ మూవీ ... మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాకే ...??prabhas;war movie;prabhas;bhushan kumar;hrithik roshan;kumaar;tiger shroff;krishnam raju;naga;prasanth;prashanth neel;roshan;vyjayanthi;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;blockbuster hit;war;kgf;prasanth neel;vemuri radhakrishna;prashant kishorThu, 03 Dec 2020 22:49:52 GMTటాలీవుడ్ బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్ ఒకదాని వెంట ఒకటి వరుసగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ దాని అనంతరం నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ వారి సినిమా, టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాణంలో ఆదిపురుష్ అనే ప్రతిష్టాత్మక సినిమా అలానే కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీస్ లో కూడా నటించనున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించి పక్కాగా కాల్షీట్స్ షెడ్యూల్ చేసి ఆయా మూవీ యూనిట్స్ కి కేటాయించారుట ప్రభాస్. ఇక ఈ సినిమా కోసం కొద్దిరోజులుగా ఒక ప్రత్యేకమైన ఫిజికల్ ట్రైనర్ ఆధ్వర్యంలో ప్రభాస్ తన బాడీని బాగా బిల్డప్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. కాగా వీటిలో ముందుగా రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఇక పోతే ఈ నాలుగు సినిమాల అనంతరం ప్రభాస్ లిస్ట్ లో మరో సినిమా అతిత్వరలో చేరనుందని అంటున్నారు. ఇటీవల బాలీవుడ్లో సంచలన విజయం అందుకున్న భారీ మల్టీస్టారర్ సినిమా వార్. బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు కలిసి నటించిన ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఇక అతి త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కనుందని ఇప్పటికే ఈ సినిమా కోసం హృతిక్ రోషన్ తో పాటు మరొక హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ ని ఎంచుకున్నారట మూవీ యూనిట్. ఇక స్క్రిప్ట్ పరంగా మొదటి భాగాన్ని మించేలా ఈ రెండో భాగం ఉంటుందని అలానే యాక్షన్ సన్నివేశాలు మరింత అదిరిపోతాయని అంటున్నారు. ఇక అతి త్వరలో ప్రభాస్ ని కలిసి దర్శకుడు ఈ సినిమా కథను ఆయనకి వినిపించనున్నారని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఏడాది మార్చిలో రానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ సినిమా గనుక నిజమైతే ప్రభాస్ ఖాతాలో మరొక భారీ బ్లాక్ బస్టర్ మూవీ చేరినట్లే.... !!


బాలకృష్ణ మళ్ళీ ఆ ఫ్లాప్ డైరెక్టర్ తో చేతులు కలుపుతున్నడా..?

గ్రేటర్ యుద్ధం: 97 సీట్లలో బీజేపీ జయభేరి?

గ్రేటర్ యుద్ధం: కౌంటింగ్ సమయంలో నగరంలో ఆంక్షలు

గ్రేటర్ యుద్దం: బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో బండి సంజయ్ భేటీ!

ఇండియా గ్రేట్.. ఇలాంటి టైంలో కూడా చైనాకు హెల్ప్

సొంతంగా గ్రేటర్ లో గులాబీ జెండా ఎగురవేస్తాం

గ్రేటర్ యుద్ధం : బీజేపీకి అర్ధ సెంచరీ ఖాయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>