MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ramcharans-hopes-are-on-that-movie6caca6fc-85b8-41c3-9482-7b5e15350a20-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ramcharans-hopes-are-on-that-movie6caca6fc-85b8-41c3-9482-7b5e15350a20-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌కి సైన్‌ చెయ్యగానే, అభిమానులు పండుగ చేసుకున్నారు. రెండేళ్ల గ్యాప్‌ ఫిల్ అవుతుందని, పవన్ వరుస సినిమాలతో ఎంటర్‌టైన్‌ చేస్తాడని ఎక్స్‌పెక్ట్‌ చేశారు అభిమానులు. కానీ జనసేనాని రెండు పడవల ప్రయాణంతో వీళ్ల ఆశలకు బ్రేకులు పడుతున్నాయి.ramcharans hopes are on that movie;pawan;kalyan;surender reddy;2019;cinema;festival;agnyaathavaasi;reddyపవన్ కళ్యాణ్ తీరుపై అభిమానుల నిరాశ..!పవన్ కళ్యాణ్ తీరుపై అభిమానుల నిరాశ..!ramcharans hopes are on that movie;pawan;kalyan;surender reddy;2019;cinema;festival;agnyaathavaasi;reddyWed, 02 Dec 2020 18:00:00 GMTపవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌కి సైన్‌ చెయ్యగానే, అభిమానులు పండుగ చేసుకున్నారు. రెండేళ్ల  గ్యాప్‌ ఫిల్ అవుతుందని, పవన్ వరుస సినిమాలతో ఎంటర్‌టైన్‌ చేస్తాడని ఎక్స్‌పెక్ట్‌ చేశారు అభిమానులు. కానీ జనసేనాని రెండు పడవల ప్రయాణంతో వీళ్ల ఆశలకు బ్రేకులు పడుతున్నాయి.

పవన్‌ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌గా మారిపోయాడు. మధ్యలో సినిమాలు మానేస్తాడనే టాక్‌ వచ్చినా, 2019 ఎన్నికల్లో ఓడిపోయాక, మళ్లీ కెమెరాముందుకొచ్చాడు. 'వకీల్‌సాబ్'తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఒకేసారి 5 సినిమాలకు సైన్‌ చేసి, ఇండస్ట్రీని కూడా ఆశ్చర్యపరిచాడు పవన్.

పవన్ కళ్యాణ్‌ పాలిటిక్స్‌లోకి వెళ్లకముందు ఏడాదికి ఒక సినిమా చేసేవాడు. అయితే పాలిటిక్స్‌ నుంచి మళ్లీ సినిమాల్లోకి వచ్చాక స్పీడ్‌ పెంచాడు. ఒకేసారి నాలుగైదు సినిమాలకి సైన్‌ చేశాడు. క్రిష్‌తో పీరియాడికల్‌ డ్రామా, హరీశ్‌ శంకర్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే మళయాళం మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌కి కమిట్ అయ్యాడు పవన్.

'వకీల్‌ సాబ్' సెట్స్‌లో ఉండగానే, క్రిష్‌ పీరియాడికల్‌ డ్రామా షూటింగ్‌ కూడా మొదలుపెట్టాడు పవన్. ఇక పవర్‌ స్టార్‌ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడనగానే, అభిమానులు మొదట ఆశ్చర్యపోయారు. పవన్‌ స్పీడ్‌ చూసి ఆనంద పడ్డారు. బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌ వస్తాయి, రెండేళ్ల గ్యాప్‌ని ఇప్పుడు కవర్‌ చేసుకోవచ్చని ఆశించారు అభిమానులు. అయితే జరుగుతోంది మాత్రం మరోలా ఉందని ఫీలవుతున్నారు.

పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్‌ చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు గానీ, వాళ్ల ఆశలు తీరేలా కనిపించట్లేదట. జనసేనాని స్కెచ్చులతో  అభిమానుల ఆశలు పోస్ట్‌పోన్ అవుతున్నాయి. పొలిటికల్‌ షెడ్యూల్స్, సినిమా షూటింగ్స్‌ క్లాష్ అవుతున్నాయని, రాజకీయాలతో సినిమా షూటింగ్‌లకి బ్రేకులు పడుతున్నాయి అంటున్నారు సినీ జనాలు.

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలు, సినిమాలు రెండిటిని బ్యాలెన్స్‌ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాడు. కానీ వర్కవుట్‌ కాట్లేదట. పవన్‌ జనసైనికులకు అందుబాటులో ఉండాలనుకుంటే, సినిమా షూటింగ్స్‌ అడ్డొస్తున్నాయి.






సునీల్ ఇక హీరో గా చేయడా.. కొత్త అవతారం..?

బుడుగు: చలికాలంలో పిల్లలకు ఇవి పెడుతున్నారా.. జాగ్రత్త సుమీ..!?

కొత్త కార్ కొనాలనుకునే వారికి శుభవార్త.. కేవలం ఈఎంఐ రూ.లు 1900..?

డైట్ మెయింటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. దేనికోసమో తెలుసా..??

పవన్ కళ్యాణ్ స్లిమ్ లుక్ కోసం లిక్విడ్ డైట్ ... !!

జాతీయ గీతం మార్చాలంటూ ప్రధానికి లేఖ రాసిన సుబ్రమణ్యస్వామి

గ్రేటర్ యుద్ధం: ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ బీజేపీ నేతల ఫిర్యాదు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>