MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyam671ad2f3-b6a3-4793-bc1d-9c482c2e52a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyam671ad2f3-b6a3-4793-bc1d-9c482c2e52a5-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమా రాధేశ్యామ్. కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక వాస్తవ ప్రేమకథకు రూపంగా దర్శకడు రాధాకృష్ణ ఈ సినిమాని తీస్తున్నట్లు టాక్. ప్రభాస్ కి జోడీగా తొలిసారిగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయి ప్రేక్షకాభిమానులు నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువుprabhas;radheshyam;prabhas;pooja hegde;gopika;krishnam raju;sujeeth;india;italy;bollywood;tollywood;cinema;media;posters;v creations;vemuri radhakrishna;uv creations;panga;v;gopikrishna movies;ramoji film city'రాధేశ్యామ్' సెట్స్ నుండి ప్రభాస్ ఫోటో లీక్ ... సోషల్ మీడియాలో వైరల్ ....??'రాధేశ్యామ్' సెట్స్ నుండి ప్రభాస్ ఫోటో లీక్ ... సోషల్ మీడియాలో వైరల్ ....??prabhas;radheshyam;prabhas;pooja hegde;gopika;krishnam raju;sujeeth;india;italy;bollywood;tollywood;cinema;media;posters;v creations;vemuri radhakrishna;uv creations;panga;v;gopikrishna movies;ramoji film cityWed, 02 Dec 2020 05:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమా రాధేశ్యామ్. కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక వాస్తవ ప్రేమకథకు రూపంగా దర్శకడు రాధాకృష్ణ ఈ సినిమాని తీస్తున్నట్లు టాక్. ప్రభాస్ కి జోడీగా తొలిసారిగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయి ప్రేక్షకాభిమానులు నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దాదాపుగా రూ.400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. గత ఏడాది సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, దానితో కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగారు. దానితో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ రాధేశ్యామ్ మూవీ తో ఆయన పక్కాగా సూపర్ హిట్ కొడతారని పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీగా పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అన్ని భాషల ప్రేక్షకులతో పాటు విదేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ ఇటలీ లో జరిగిన విషయం తెలిసిందే.

ఇకపోతే కొద్దిరోజుల క్రితం ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సహా పలువురు ముఖ్య నటుల పై కీలక సన్నివేశాలు తీస్తున్నట్లు టాక్. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, నిన్న సాయంత్రం రాధేశ్యామ్ సెట్స్ లో పలువురు స్టంట్ కొరియోగ్రాఫర్స్ బృందంతో కలిసి ప్రభాస్ దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ప్రభాస్ తన హెయిర్ ని కవర్ చేస్తూ నల్లని క్లాత్ కట్టుకుని ఉండడం గమనించవచ్చు. కాగా ఈ సినిమాలో పలు యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయని సమాచారం. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.....!!




గ్రేటర్ యుద్దం : వార్ ముగిసింది..మరి గెలుపేవారిది ..??

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>