PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pearlprasad01b8d5ec-7650-44d6-b8c3-288dad2da95c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pearlprasad01b8d5ec-7650-44d6-b8c3-288dad2da95c-415x250-IndiaHerald.jpgవిశాలాంధ్ర పత్రిక సంపాదకులు ముత్యాల ప్రసాద్ ఆకస్మిక మరణం మీడియా ప్రపంచానికి తీరని లోటని ఐజెయు జాతీయ ఆధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చిన్న వయస్సులోనే విశాలాంధ్ర సంపాదకుడిగా పనిచేయడం గొప్పవిషయంగా ఆయన పేర్కొన్నారు. ఆదర్శ భావాలు, సిద్దాంతాలు వుంటే గానీ కమ్యూనిస్టు పత్రికలో సంపాదకునిగా రణించలేరనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. pearlprasad;auto;ali;amar;deva;lakshman;prasad;raj;srikanth;srinivas;venkat;apple;andhra pradesh;telangana;district;east;media;letter;medchal;ranga reddy;european union;custard apple;reddyసిద్దాంతాలతో కూడిన జర్నలిస్టు ముత్యాల ప్రసాద్సిద్దాంతాలతో కూడిన జర్నలిస్టు ముత్యాల ప్రసాద్pearlprasad;auto;ali;amar;deva;lakshman;prasad;raj;srikanth;srinivas;venkat;apple;andhra pradesh;telangana;district;east;media;letter;medchal;ranga reddy;european union;custard apple;reddyWed, 02 Dec 2020 18:24:35 GMTవిశాలాంధ్ర పత్రిక సంపాదకులు ముత్యాల ప్రసాద్ ఆకస్మిక మరణం మీడియా ప్రపంచానికి తీరని లోటని ఐజెయు జాతీయ ఆధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చిన్న వయస్సులోనే విశాలాంధ్ర సంపాదకుడిగా పనిచేయడం గొప్పవిషయంగా ఆయన పేర్కొన్నారు. ఆదర్శ భావాలు, సిద్దాంతాలు వుంటే గానీ కమ్యూనిస్టు పత్రికలో సంపాదకునిగా రణించలేరనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బుధవారం నాడు విశాలాంధ్ర సంపాదకులు ముత్యాల ప్రసాద్ సంస్మరణ సభను తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే), విశాలాంధ్ర బృందం అధ్వర్యంలో బషీర్ బాగ్ లోని దేశోద్దారక భవన్లో నిర్వహించడం జరిగింది.



 ఈ కార్యక్రమానికి టియుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షత వహించగా, ఐజెయు జాతీయ మాజీ అధ్యక్షులు, ఏపీ ప్రభుత్వ  జాతీయ మీడియా సలహదారులు దేవులపల్లి అమర్, ఐజెయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, విశాలాంధ్ర పత్రిక తెలంగాణ ఇంచార్జీ రామారావు తదితరులు హజరై ప్రసంగించారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ విలువలతో కూడిన వ్యక్తులను సమాజానికి పరిచయం చేసిన పత్రిక విశాలాంధ్ర అని కొనియాడారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో గానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో గానీ విశాలాంధ్ర పోషించిన పాత్ర అభినందనీయమని, ఎందరో అదర్శ పాత్రికేయులను సమాజానికి అందించిన ఘనత విశాలాంధ్రకు వుందని వారు కొనియాడారు. ఈ సందర్భంగా ముత్యాల ప్రసాద్ చిత్ర పటానికి పూల మాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళ్ళు అర్పించారు.


 ప్రజానాట్య మండలి తెంగాణ ప్రధాన కార్యదర్శి పల్లే నర్సింహా పాడిన పాట సభికులను ఆకర్షించింది. ఇంకా ఈ కార్యక్రమంలో సీనీయర్ పాత్రికేయులు లక్ష్మణ్, ఫాజిల్, టియుడబ్ల్యుజె రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకట్ రెడ్డి, జి.బాల్ రాజ్ లతో  పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. టియుడబ్ల్యుజె మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.బాలరాజు వందన సమర్పణ చేశారు.



పోలవరంపై రచ్చరచ్చ: మూడోరోజూ టీడీపీ సభ్యుల సస్పెన్షన్

బుడుగు: చలికాలంలో పిల్లలకు ఇవి పెడుతున్నారా.. జాగ్రత్త సుమీ..!?

కొత్త కార్ కొనాలనుకునే వారికి శుభవార్త.. కేవలం ఈఎంఐ రూ.లు 1900..?

డైట్ మెయింటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. దేనికోసమో తెలుసా..??

పవన్ కళ్యాణ్ స్లిమ్ లుక్ కోసం లిక్విడ్ డైట్ ... !!

జాతీయ గీతం మార్చాలంటూ ప్రధానికి లేఖ రాసిన సుబ్రమణ్యస్వామి

గ్రేటర్ యుద్ధం: ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ బీజేపీ నేతల ఫిర్యాదు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>