PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/greater-warbc959fda-6e03-4161-8f00-9b38a924687c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/greater-warbc959fda-6e03-4161-8f00-9b38a924687c-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల పోలింగ్ తర్వాత టీఆర్ఎస్ కాస్త ధీమాగా కనిపిస్తుంటే.. బీజేపీ మాత్రం బేలగా మాట్లాడుతోంది. బీజేపీ నేతలు, సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పోలింగ్ సరళిపై పెదవి విరిచారు. ముఖ్యంగా పోలింగ్ శాతం తగ్గడాన్ని ఆయన అనుమానిస్తున్నారు. టీఆర్ఎస్ వల్లే పోలింగ్ శాతం తగ్గిందని, తగ్గిన పోలింగ్ శాతం వారికి అనుకూలంగా ఉందని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. అంటే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కే మద్దతిచ్చినట్టు పరోక్షంగా సంజయ్ చెబుతున్నట్టుంది. greater-war;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;police;chief minister;success;election commission;partyగ్రేటర్ యుద్ధం: ముందే చేతులెత్తేసిన బీజేపీ..గ్రేటర్ యుద్ధం: ముందే చేతులెత్తేసిన బీజేపీ..greater-war;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;police;chief minister;success;election commission;partyWed, 02 Dec 2020 12:00:00 GMTటీఆర్ఎస్ కాస్త ధీమాగా కనిపిస్తుంటే.. బీజేపీ మాత్రం బేలగా మాట్లాడుతోంది. బీజేపీ నేతలు, సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పోలింగ్ సరళిపై పెదవి విరిచారు. ముఖ్యంగా పోలింగ్ శాతం తగ్గడాన్ని ఆయన అనుమానిస్తున్నారు. టీఆర్ఎస్ వల్లే పోలింగ్ శాతం తగ్గిందని, తగ్గిన పోలింగ్ శాతం వారికి అనుకూలంగా ఉందని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. అంటే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కే మద్దతిచ్చినట్టు పరోక్షంగా సంజయ్ చెబుతున్నట్టుంది.

గ్రేటర్ లో పోలింగ్ పర్సంటేజీ తగ్గడానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని బండి సంజయ్ ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్, పోలీసులతో కలిసి సీఎం కేసీఆర్.. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారని.. అందుకే పోలింగ్ శాతం తగ్గిందని అంటున్నారు. ఈ విషయంలో కేసీఆర్ వందశాతం సక్సెస్ అయ్యారని విమర్శించారు. పోలింగ్ శాతం పెరిగినా, తగ్గినా ఏ పార్టీకి లాభం చేకూరుతుందని ఎవరూ ఊహించలేరు. ఇంట్లో ఉన్న వారంతా బైటకు వచ్చి ఓట్లు వేస్తే.. అది ఎవరికి వేశారో తెలుసుకోవడం కష్టమే. పోలింగ్ శాతం తగ్గినా కూడా దాన్ని అంచనా వేయలేం. అయితే బండి సంజయ్ మాత్రం బీజేపీకి ఓటు వేయాలనుకుంటున్న వారు ఇళ్లలో ఉండిపోయారని, కేవలం టీఆర్ఎస్ అభిమానులు మాత్రమే బైటకొచ్చి ఓటు వేశారని అంటున్నారు.

పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల దౌర్జన్యాలు జరిగాయని, పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు బీజేపీ నేతలు. పోలింగ్ రోజు ఏకంగా దీక్షలకు దిగారు కూడా. ఈ సందర్భంగా కేసీఆర్, ఈసీపై విమర్శలకు దిగారు బండి సంజయ్. పోలింగ్ శాతం తగ్గిన విషయంలో పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకరకంగా పోలింగ్ శాతం తగ్గడంతో తమకు ఫలితాలు వ్యతిరేకంగా వస్తాయనే విషయాన్ని ప్రస్తావించారు బండి సంజయ్. ఫలితాలు రాకముందే ఇలా విజయావకాశాలపై మాట్లాడటంతో బీజేపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. సంజయ్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


పోలింగ్ కి రాని ఓటర్...ఎవరి వశమో గ్రేటర్?

సర్పంచ్ కోసం వెళ్తున్న రేవంత్

భారీ బహిరంగ సభ, టార్గెట్ కేసీఆర్...?

ముగిసినతుంగభద్ర పుష్కరాలు

డబ్బే డబ్బు : స్త్రీలకు సంపదను సృష్టించబోతున్న కరోనా వ్యాక్సిన్ !

కేసీఆర్ కు తొత్తుగా మారిన పోలీసులు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి

గ్రేటర్ యుద్దం : ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ విజయభేరి..ఎలా ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>