MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-liquid-diet-for-slim-lookb0774bfb-1a5f-4f5d-9728-d70b219bb609-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-liquid-diet-for-slim-lookb0774bfb-1a5f-4f5d-9728-d70b219bb609-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ స్లిమ్ లుక్ కోసం లిక్విడ్ డైట్ . పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్ ' అనే చిత్రంలో నటిస్తున్నారన్న విషయం అందరికే తెలిసిందే. అందులో పవన్ చాలా సన్నగా కనిపించాలట. దాని కోసం బరువు తగ్గడానికి లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నాడటpawan kalyan;pawan;boney kapoor;johnny;kalyan;niharika konidela;pawan kalyan;sriram;janasena;bollywood;tollywood;cinema;producer;episode;remake;producer1;janasena party;venu sreeram;sri venkateshwara creations;johnny1;dil;chitramపవన్ కళ్యాణ్ స్లిమ్ లుక్ కోసం లిక్విడ్ డైట్ ... !!పవన్ కళ్యాణ్ స్లిమ్ లుక్ కోసం లిక్విడ్ డైట్ ... !!pawan kalyan;pawan;boney kapoor;johnny;kalyan;niharika konidela;pawan kalyan;sriram;janasena;bollywood;tollywood;cinema;producer;episode;remake;producer1;janasena party;venu sreeram;sri venkateshwara creations;johnny1;dil;chitramWed, 02 Dec 2020 17:00:00 GMTపవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడని వ్యక్తి ఎవరు ఉండరు. ఆయన రూటే సెపరేటు. అందుకే పవన్ అంటే అభిమానులు పడి చస్తారు.. సినిమా విజయంతో పని లేకుండా ఆయన సినిమాలను చూస్తూ ఉంటారు. సినిమా హిట్ అయిన ప్లాప్ అయినాగాని ఆయనకు ఉన్న క్రెజ్ మాత్రం తగ్గదు.. ఒక పక్క సినిమాలు తీస్తూనే, రాజకీయాలలో ప్రవేశం చేసారు. అయితే ఇప్పుడు ఈ రెండిటిని ఓకే లెవెల్ లో మెయింటైన్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా మరి. ఎందుకంటే సినిమాల్లో నటించాలంటే నటించే పాత్రకు అనుగుణంగా శరీరాన్ని మెయింటైన్ చేయాలి. ఇక రాజకీయాలు అంటారా.. ఎలా ఉన్నా పర్వాలేదు. మరి రాజకీయాలతో బిబీగా తిరిగే పవన్ కి ఫిజిక్ పై దృష్టి పెట్టె సమయం ఎక్కడ కుదురుతుంది..అలా అని సినిమాలను పక్కన పెట్టి పాలిటిక్స్ పైనే దృష్టి పెట్టిన పవన్ తన లుక్ విషయంలో మాత్రం పెద్దగా  కేర్ తీసుకుంటున్నట్లు అనిపించడం లేదు.

కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్ ' అనే చిత్రంలో నటిస్తున్నారన్న విషయం అందరికే తెలిసిందే.  కాగా వకీల్ సాబ్ చిత్రంలో ముఖ్యంగా పవన్ కల్యాణ్ కోసం ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని కూడా క్రియేట్ చేసారట. అందులో పవన్ చాలా సన్నగా కనిపించాలట.  దాని కోసం  బరువు తగ్గడానికి లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నాడట.అదేనండి కేవలం ద్రవ పదార్ధాలని మాత్రమే తింటున్నాడట. జనసేన అధినేత. ఈ మధ్య మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ రెగ్యులర్ గా వర్కౌట్స్ చేయడంతో పాటు పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ ఫిజిక్ ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జిమ్ చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు  పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫిజిక్ మీద కాస్త ఫోకస్ తగ్గించినట్లు కనిపించింది.

మళ్ళీ ఈ సినిమా కోసం బరువు తగ్గే క్రమంలో లిక్విడ్ డైట్ ని పాటిస్తూ సన్నాబడాలని చూస్తున్నాడంట. పవన్ గతంలో 'జానీ' సినిమా కోసం కష్టపడి సన్నగా మారాడు.వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్.. మెగా డాటర్ నిహారిక వివాహం అనంతరం 'వకీల్ సాబ్' ఫైనల్ షెడ్యూల్ లో పాల్గొననున్నాడు. ఇది పూర్తైన వెంటనే సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో 'అయ్యప్పనుమ్ కోషియం' తెలుగు రీమేక్ స్టార్ట్ చేయనున్నాడు. మరి పవన్ కళ్యాణ్  ఈ లిక్విడ్ డైట్ తో ఎంతవరకు స్లిమ్ అవుతాడో చూడాలి.. అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ లుక్... ఈ సినిమాలో ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. !!





సునీల్ ఇక హీరో గా చేయడా.. కొత్త అవతారం..?

బుడుగు: చలికాలంలో పిల్లలకు ఇవి పెడుతున్నారా.. జాగ్రత్త సుమీ..!?

కొత్త కార్ కొనాలనుకునే వారికి శుభవార్త.. కేవలం ఈఎంఐ రూ.లు 1900..?

డైట్ మెయింటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. దేనికోసమో తెలుసా..??

జాతీయ గీతం మార్చాలంటూ ప్రధానికి లేఖ రాసిన సుబ్రమణ్యస్వామి

గ్రేటర్ యుద్ధం: ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ బీజేపీ నేతల ఫిర్యాదు!

కాబోయే భర్తతో కలిసి నిహారికా ఏం చేస్తోందో తెలిస్తే షాక్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>