PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/another-fitting-for-jagan-govt-in-colors091a8ab0-d2aa-4b45-9f61-c4ed0906301d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/another-fitting-for-jagan-govt-in-colors091a8ab0-d2aa-4b45-9f61-c4ed0906301d-415x250-IndiaHerald.jpgఏపీలో మళ్ళీ రంగుల రాజకీయం మొదలైంది. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ముద్ర ఉండేలా చూసుకుంటారు. గతంలో అధికారంలో టీడీపీ ప్రభుత్వం అదే విధంగా చేసింది. రాష్ట్రంలో పసుపు కలర్ ఎక్కువగా కనిపించేలా చేసింది. ప్రతి పథకం, ప్రతి నిర్మాణంపై టీడీపీ ముద్ర ఉండేలా చూసుకుంది. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ కూడా టీడీపీ కంటే ఎక్కువగానే తన ముద్ర ఉండేలా చూసుకుంది. jagan;jagan;botcha satyanarayana;buggana rajendranath reddy;court;tdp;ycp;reddy;party;mantraభలే ట్విస్ట్: మళ్ళీ జగన్ ప్రభుత్వానికి ఫిట్టింగ్ పెట్టారుగా...!భలే ట్విస్ట్: మళ్ళీ జగన్ ప్రభుత్వానికి ఫిట్టింగ్ పెట్టారుగా...!jagan;jagan;botcha satyanarayana;buggana rajendranath reddy;court;tdp;ycp;reddy;party;mantraWed, 02 Dec 2020 01:00:00 GMTపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ముద్ర ఉండేలా చూసుకుంటారు. గతంలో అధికారంలో టీడీపీ ప్రభుత్వం అదే విధంగా చేసింది. రాష్ట్రంలో పసుపు కలర్ ఎక్కువగా కనిపించేలా చేసింది. ప్రతి పథకం, ప్రతి నిర్మాణంపై టీడీపీ ముద్ర ఉండేలా చూసుకుంది. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ కూడా టీడీపీ కంటే ఎక్కువగానే తన ముద్ర ఉండేలా చూసుకుంది.

అందుకే ప్రతి గ్రామ సచివాలయానికి పార్టీ కలర్ వేసింది. ఇక గ్రామ సచివాలయమే కాకుండా వాటర్ ట్యాంకులు, స్కూల్స్, గోడలు, స్తంభాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నిర్మాణాలకు వైసీపీ రంగులు కనిపించాయి. ఇక ఇక్కడే ఆశల రగడ మొదలైంది. టీడీపీ హయాంలో పలు వాటికి పసుపు రంగు ఉన్నా సరే ఏం మాట్లాడని కొందరు పెద్దలు, వైసీపీ రంగులపై విమర్శలు చేశారు. అలాగే కొందరు టీడీపీకి చెందిన వారు దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు.

కోర్టు సైతం ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం సరికాదని, వెంటనే తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు కొన్నిరోజులు జరిగాక, ప్రభుత్వం రంగులని తొలగించి తెలుపు రంగు వేసింది. అయితే ఇంతటితో సమస్య క్లోజ్ అయిందట...కాలేదు. మరొకసారి ఈ రంగుల అంశంపై కోర్టుకు వెళ్లారు. ఇక ఇక్కడొక ట్విస్ట్ ఉంది. రంగులేసి తొలగించినందుకు రూ.4 వేల కోట్లయ్యాయని, వీటిని రాబట్టాలని పిటిషనర్ కోరారు. ఈ రూ.4 వేల కోట్లను ఖజానాకు జమ చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణలను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా చేర్చి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గనుక కోర్టు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే మళ్ళీ తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. మరి చూడాలి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో.


గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?

గ్రేటర్ యుద్ధం: పోలింగ్ తగ్గడానికి విశ్లేషకులు చెప్తున్న 15 కారణాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>