TVyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/hyper-adi-gifted-10-acres-land-to-his-father-where-he-sold-his-3-acres-for-adi-education2a1a7a93-4b8c-46d3-b469-cbefe5251a80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/hyper-adi-gifted-10-acres-land-to-his-father-where-he-sold-his-3-acres-for-adi-education2a1a7a93-4b8c-46d3-b469-cbefe5251a80-415x250-IndiaHerald.jpgహైపర్ ఆది.. ఈ పేరుకు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా యమా పాపులర్ అయ్యాడు ఆది. తన పంచ్‌లు, ప్రాసలతో ఆది స్కిట్‌ను రక్తి కట్టిస్తాడు. అయితే ఆదికి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ వచ్చినా దానికి అతడి...hyper adi;adinarayanareddy;tollywood;jabardasth;comedy;father;anandamనాన్న కోసం హైపర్ ఆది చేసిన పని తెలిస్తే..నాన్న కోసం హైపర్ ఆది చేసిన పని తెలిస్తే..hyper adi;adinarayanareddy;tollywood;jabardasth;comedy;father;anandamWed, 02 Dec 2020 14:14:34 GMTకామెడీ షో ద్వారా యమా పాపులర్ అయ్యాడు ఆది. తన పంచ్‌లు, ప్రాసలతో ఆది స్కిట్‌ను రక్తి కట్టిస్తాడు. అయితే ఆదికి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ వచ్చినా దానికి అతడి కఠిన శ్రమే కారణం. ఆ క్రేజ్‌తోనే టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. అక్కడ కూడా తన పంచ్ డైలాగ్‌లతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే అతడి కుటుంబ నేపథ్యంలో గురించి ఇన్నాళ్లూ ఎక్కడా చెప్పుకోని ఆది.. ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో మాత్రం తన కుటుంబ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.


హైపర్ ఆది ఇంజినీరింగ్ చదివాడని అందరికీ తెలుసు. కానీ దానికోసం ఆది ఎంతకష్టపడ్డాడో ఎవరికైనా తెలుసా..? ఆదికంటే ఆతడి తండ్రి ఇంకా కష్టాలు అనుభవించాడట. తన చదువు కోసం ఊళ్లో ఉన్న 3 ఎకరాల పొలాన్నీ తండ్రి అమ్మేశాడని, అది తెలిసి చాలా బాధపడ్డానని, కానీ నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేకపోయానని ఆది బాధపడ్డాడు.

ఇంజినీరింగ్ పూర్తయ్యాయ కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసినా రైటర్ కావాలనే కలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని ఆది చెప్పుకొచ్చాడు. అప్పుడే జబర్దస్త్ తనకు మంచి ఫ్లాట్ ఫాం ఇచ్చిందని చెప్పాడు. ‘జబర్దస్త్‌లో అవకాశం రావడంతో కొద్దిరోజులకే హైపర్ ఆదిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. మా కుటుంబానికి అండగా నిలబడ్డాను. నా చదువు కోసం ఆస్తులన్నీ అమ్మేసిన నాన్న.. నాకు వస్తున్న గుర్తింపు చూసి ఎంతో ఆనందపడ్డాడు. మా కుటుంబ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. నాన్న నా కోసం అమ్మేసిన 3 ఎకరాల పొలం దగ్గరే మరో 7 ఎకరాలు కలిసి మొత్తం 10 ఎకరాలు కొన్నాం. ఊళ్లో పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నాం. ఇప్పుడు చాలా గర్వంగా ఉంది’ అంటూ ఆది భావోద్వేగంతో చెప్పాడు.

ఏది ఏమైనా ఎన్నో కష్టాలు పడి కని, పెంచిన తల్లిదండ్రులకు అండగా ఉంటూ వారిని ఆనందంగా ఉంచడం కంటే కొడుకుగా వేరే బాధ్యత ఏముంటుంది..? చెప్పండి.


అమరావతే రాజధాని: స్పష్టం చేసిన బిజెపి

గ్రేటర్ యుద్ధం :: కథ అంతా తారుమారైంది..?

గ్రేటర్ యుద్ధం : ఓటింగ్ లో అత్యల్పం, అత్యధికం అక్కడే !

సెటైర్ : ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే ?

ఎమ్మెల్యేకి కరోనా ఏపీ మంత్రులు సూపర్ స్పైడర్లు అయ్యారా...?

క్యూలో కొత్త సీరియల్.. ఇక బిగ్‌బాస్4 అంతేనా..!

RRR 2021 రిలీజ్ డౌటేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>