MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-srividyae2a50729-3595-433d-a805-c00510118a11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-srividyae2a50729-3595-433d-a805-c00510118a11-415x250-IndiaHerald.jpg శ్రీవిద్య తెలుగులో ఒక సినిమా షూటింగ్ కోసం రాజమండ్రికి కి వచ్చారు. కానీ అక్కడ నీరు ఎరుపు రంగులో ఉండటంతో స్నానానికి బిస్లరీ వాటర్ కావాలని అడిగారట. కానీ జీవిత చరమాంకంలో మాత్రం ఎవరి తోడు లేక సంపాదించినా డబ్బులు లేక ఇబ్బందులు పడ్డారు actress srividya;deva;srividhya;korcha;cinema;tamil;marriage;producer;industry;producer1;hero;heroine;rajahmundryఒకప్పుడు బిస్లరీ నీళ్లతో స్నానం..కానీ చివరికి అనాధ బ్రతుకుఒకప్పుడు బిస్లరీ నీళ్లతో స్నానం..కానీ చివరికి అనాధ బ్రతుకుactress srividya;deva;srividhya;korcha;cinema;tamil;marriage;producer;industry;producer1;hero;heroine;rajahmundryWed, 02 Dec 2020 11:00:00 GMTసినిమా మొదలయ్యిందంటే ఆ నిర్మాతకు ఇక డైలీ షాకులే. నటీనటులకు కావాల్సినవి ఏర్పాటు చేయడమే ఆయన పని. ఒక్కోసారి వారి గొంతెమ్మ కోరికలను తీర్చడం చాల కష్టం గా ఉంటుంది. అయినా నవ్వుతూనే సినిమా షూటింగ్ పూర్తి చేయాలి. షూటింగ్ అయిపోతే పాపం ప్రొడ్యూసర్ కి దేవుడు కనిపించినట్టే. ఇప్పుడు అంటే సినిమా ప్రొడక్షన్ బాగా కాస్టలీ అయ్యింది కానీ ఒకప్పుడు ఉన్నదాంట్లోనే మంచి నాణ్యతతో ఏర్పాట్లు చేసేవారు స్టార్ హీరో హీరోయిన్స్ అయినా. ఎంత పెద్ద హీరో అయినా ప్రొడ్యూసర్ కి కాస్త భయపడేవారు. ఇప్పుడు నిర్మాత ఆటలో అరటిపండు అయ్యారు కానీ మొన్నటి తరం వారికి నిర్మాతే దేవుడు. ఆయన చెప్పిందే వేదం. అయితే ఆలా నటీనటులు అడ్జస్ట్ అయ్యే రోజుల్లోనే ఒక సంఘటన గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది.  

విషయంలోకి వెళితే..తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగేవారు శ్రీవిద్య. ఆమె ఒక తెలుగు చిత్రం కోసం రాజమండ్రి నది ఒడ్డున షూటింగ్ చేయడానికి వచ్చారట. అక్కడ చుట్టూ పక్కల గ్రామాల్లో అందరు ఆ నది నీళ్లనే అవసరాల కోసం వాడుకుంటారట. అయితే నదిలో నీళ్లు ఎరుపు రంగులో ఉండేవి. అవి తెచ్చి పెట్టుకొని కాస్త తేరుకున్నాక వాటిని స్నానానికి వాడుకునే వారు. ఆ నీళ్లనే నటీనటులకు కూడా తెప్పించి ఇచ్చారు స్నానాలకు. కానీ శ్రీవిద్య మాత్రం ఆ బురద నీళ్లతో స్నానం చేయను అని, తన అందం దెబ్బ తింటుందని మొండి పట్టు పట్టుకొని కూర్చుంది.  బిస్లరీ నీళ్లను రెండు బాక్స్ లో పోసి ఇవ్వమని అడిగింది. ఇంకా ఎం చేయాలో తోచని ప్రొడ్యూసర్, తాగడం కోసం తెచ్చిన బిస్లరీ నీళ్లను ఆలా స్నానం చేయడానికి ఏర్పాటు చేయించాడట.అప్పట్లో ఒక బిస్లరీ బాటిల్ కి ఆరు రూపాయలు ఉండేది. ఇలా ఒకానొక సమయంలో బిస్లరీ నీళ్లతో స్నానం చేసిన శ్రీవిద్య, పెళ్లి చేసుకొని భర్తతో విడిపోయి చివరి రోజుల్లో ఆనాదగా జీవించింది. ఆమె జీవించిన ఇంటిని సైతం ఆమె పోయాక బ్యాంకు వారు జప్తు చేసుకుని వేలం పాట పాడి అమ్మేసారు. 


సర్పంచ్ కోసం వెళ్తున్న రేవంత్

డబ్బే డబ్బు : స్త్రీలకు సంపదను సృష్టించబోతున్న కరోనా వ్యాక్సిన్ !

కేసీఆర్ కు తొత్తుగా మారిన పోలీసులు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి

గ్రేటర్ యుద్దం : ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ విజయభేరి..ఎలా ??

నడుము నొప్పికి గల కారణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

సినీ పాకుడురాళ్ల అంచున సిల్క్ స్మిత (డిసెంబర్ 2 సిల్క్ స్మిత పుట్టిన రోజు)

గ్రేటర్ యుద్దం: పెరిగిన పోలింగ్ శాతం అధికారుల్లో సంతోషం.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>