PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/burevi2d3a92df-e528-411d-a4df-d6e69f81b8a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/burevi2d3a92df-e528-411d-a4df-d6e69f81b8a7-415x250-IndiaHerald.jpgగత కొద్దిరోజులుగా నివర్ తుపాన్ తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. రాబోయే 12గంటల్లో ఇది మరింత బలపడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తుఫాన్‌ ప్రభావంతో బుధ, గురువారాల్లో తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.burevi;tiru;vidya;idukki;minister;tamilnadu;central government;redఅలర్ట్: ముంచుకొస్తున్న బురేవి తుపాన్..!అలర్ట్: ముంచుకొస్తున్న బురేవి తుపాన్..!burevi;tiru;vidya;idukki;minister;tamilnadu;central government;redWed, 02 Dec 2020 15:00:00 GMT
ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయాలని సూచించారు. కొవిడ్‌ నేపథ్యంలో శిబిరాల్లో ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని, హ్యాండ్‌ శానిటైజర్లు, సామాజిక దూరం పాటించేలా చూడాలన్నారు. విద్యుత్‌ సమస్యలు ఎదురయ్యేతే తక్షణ సహాయక చర్యలు అందించేందుకు వెయ్యి మందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎన్‌ఆర్‌డీఆర్‌ బృందాలను తూత్తుకుడి, కన్యాకుమారిలో అధికారులు మోహరించారు. తుఫాను ప్రభావంతో దక్షిణ కేరళలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వర్షాలతో పాటు భారీగా గాలులు వీస్తాయని, సముద్రం అల్లకోల్లంగా ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని, గురువారం, శుక్రవారం సైతం కొనసాగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, ఇడుక్కి, జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేశారు.

తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, అలప్పుజలలో గురువారం రెడ్ అలర్ట్, తిరువనంతపురం, ఇక్కుడి జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. మూడు రోజుల పాటు రాష్ట్ర తీర ప్రాంతాల్లో 75-85 కిలోమీటర్లు, గరిష్ఠంగా 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. అయితే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ మంత్రి స్పందించారు. తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను శిబిరాలకు తరలించాలని సూచించారు.


గ్రేటర్ యుద్ధం: ముషీరాబాద్ లో ఓటేసిన నేతలు వీరే..

గ్రేటర్ యుద్ధం : ఆ ఇద్దరు ఎన్నికలను నిర్వీర్యం చేశారు..?

గ్రేటర్ యుద్ధం : గులాబీ కండువా కప్పుకున్న ఎన్నికల సంఘం..?

ఆర్జీవీ కరోనా వైరస్ కొత్త ట్రైలర్ వచ్చేసింది.. చూసేయండి

జూనియర్ ఆఫీసర్ అప్లికేషన్ కు ఈ రోజే చివరి తేదీ.

మహేష్ తో సుకుమార్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్..!

బిగ్ బ్రేకింగ్ : కెజిఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ 'సలార్' మూవీ అనౌన్స్ మెంట్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>