SatireVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/naidu-assembly-jagan-amaravati-tammineni-tdp-ycp7f9f6006-bef0-4322-be94-9f2a6c777739-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/naidu-assembly-jagan-amaravati-tammineni-tdp-ycp7f9f6006-bef0-4322-be94-9f2a6c777739-415x250-IndiaHerald.jpgఇక చంద్రబాబు విషయాన్ని వివరిస్తు ఇచ్చిన మాటను ఏనాడైనా అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకుందా అంటూ సభలోనే నిలదీశారు. అదికూడా చంద్రబాబును సూటిగా చూస్తునే మొహం మీద ప్రశ్నించారు. జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక చంద్రబాబు బాగా ఇబ్బంది పడిన విషయం ఆయన మొహం చూసిన వాళ్ళకు స్పష్టంగా అర్ధమైపోతుంది. పథకాల అమలు, హామీలపై చంద్రబాబు చేసిన ప్రకటనలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు తీరును పరిశీలించిన వారికి స్పష్టంగా తెలిసిపోతుంది చంద్రబాబంటే ఏమిటో అంటూ జగన్ ప్రత్యక్షంగానే చంద్రబాబు గాలి తీసేశారు. క్రెడిబులిటి అనnaidu assembly jagan amaravati tammineni tdp ycp;cbn;amala akkineni;jagan;n. chandrababu naidu;backward classes;dwcra;history;assembly;air;reddyహెరాల్డ్ సెటైర్ : అసెంబ్లీ సాక్షిగా బయటపడిన చంద్రబాబు క్రెడిబులిటిహెరాల్డ్ సెటైర్ : అసెంబ్లీ సాక్షిగా బయటపడిన చంద్రబాబు క్రెడిబులిటిnaidu assembly jagan amaravati tammineni tdp ycp;cbn;amala akkineni;jagan;n. chandrababu naidu;backward classes;dwcra;history;assembly;air;reddyWed, 02 Dec 2020 07:00:00 GMTరాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబునాయుడుకు ఎంత క్రెడిబులిటి ఉంది ? ఇంతకాలం ఇదొక మిలియన్ డాలర్ల క్వశ్చన్. అయితే దీనికి తాజాగా అంటే అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు మంగళవారం జగన్మోహన్ రెడ్డి గట్టి సమాధానమే చెప్పారు. పథకాల అమలు తదితరాలపై సభలో  చర్చ జరిగింది.  ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తనకు, చంద్రబాబుకు ఉన్న క్రెడిబులిటి ఏమిటో స్పష్టంగా చెప్పారు. జగన్ చెప్పిన ప్రకారం పాదయాత్ర సందర్భంగా తానిచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో సుమారు 90 శాతం అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. జగన్ ఏదైనా మాటిస్తే లేదా హామీ ఇస్తే కచ్చితంగా అమలు చేస్తాడనే నమ్మకం జనాల్లో బాగా ఉందన్నారు. పథకా అమలుకు తమ ప్రభుత్వం చెప్పిన గడువు తప్పకుండా అమల్లోకి తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని జగన్ గర్వంగా చెప్పుకున్నారు.




ఇక చంద్రబాబు విషయాన్ని వివరిస్తు ఇచ్చిన మాటను ఏనాడైనా అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకుందా అంటూ సభలోనే నిలదీశారు. అదికూడా చంద్రబాబును సూటిగా చూస్తునే మొహం మీద ప్రశ్నించారు. జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక చంద్రబాబు బాగా ఇబ్బంది పడిన విషయం ఆయన మొహం చూసిన వాళ్ళకు స్పష్టంగా అర్ధమైపోతుంది. పథకాల అమలు, హామీలపై చంద్రబాబు చేసిన ప్రకటనలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు తీరును పరిశీలించిన వారికి స్పష్టంగా తెలిసిపోతుంది చంద్రబాబంటే ఏమిటో అంటూ జగన్ ప్రత్యక్షంగానే చంద్రబాబు గాలి తీసేశారు. క్రెడిబులిటి అనేది మనం చేసే పనులు, నడవడిక, వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుందే కానీ చేసే ప్రకటనల వల్ల రాదని ఎద్దేవా చేశారు. తన ప్రకటనలు, హామీల్లో ఏది అమలు చేయలేదో చూపించగలరా ? అంటూ నేరుగా చంద్రబాబునే జగన్ సవాలు చేయటం సంచలనంగా మారింది.




నిజానికి ఇచ్చిన మాటను గాలికి వదిలేయటం, హామీలిచ్చి తప్పటం అన్నది చంద్రబాబుకు మొదటి నుండి ఉన్న అలవాటే. 2014లో అధికారంలోకి రావటమే ఏకైక లక్ష్యంగా రైతు రుణమాఫీ అన్నారు. ఎన్నికలకు ముందు చెప్పన పద్దతి ఒకటైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసింది మరోటి. అలాగే కాపులను బీసీ రిజర్వషన్ల పరిధిలోకి తీసుకొస్తానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని గాలికొదిలేశారు. డ్వాక్రా, చేనేతల రుణాలను కూడా మాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారు. అనంతపురం జిల్లాలోని కొన్ని కులాలను ఎస్టీల్లో కలుపుతానని చెప్పి మళ్ళీ పట్టించుకోలేదు. ఇలాంటి చరిత్రున్న చంద్రబాబు కూడా క్రెడిబులిటి గురించి వైఎస్ ఫ్యామిలిని చాలెంజ్ చేయటమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుకున్న క్రెడిబులిటి ఏమిటో అందరికీ అర్ధమైపోయింది.





డిసెంబ‌ర్ 2వ తేదీకి చరిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>