Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-war4dd03db6-ccf5-4276-a201-9f133b75f0c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-war4dd03db6-ccf5-4276-a201-9f133b75f0c8-415x250-IndiaHerald.jpg జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిశాయి. సాధారణ ప్రజలతో పాటు అనేకమంది ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎంఎల్‌సీ కవిత ఓటు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కవిత రెండు ఓట్లు వేశారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని, వెంటనే ఆమె ఓటు రద్దు చేయాలని అంతేకాకుండా ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని...greater war;kavitha;hyderabad;indira gandhi;రాజీనామా;loksabha;tpcc;election;husband;e-mail;election commission;nijam;bodhanకవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటనకవిత రెండు ఓట్లు వేశారంటూ ఆర్వో సంచలన ప్రకటనgreater war;kavitha;hyderabad;indira gandhi;రాజీనామా;loksabha;tpcc;election;husband;e-mail;election commission;nijam;bodhanWed, 02 Dec 2020 20:42:00 GMTహైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిశాయి. సాధారణ ప్రజలతో పాటు అనేకమంది ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎంఎల్‌సీ కవిత ఓటు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కవిత రెండు ఓట్లు వేశారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని, వెంటనే ఆమె ఓటు రద్దు చేయాలని అంతేకాకుండా ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కవిత నిజంగానే రెండు చోట్ల ఓటు వేశారంటూ ఆర్వో ప్రకటించడం సంచలనంగా మారింది.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్, పోతంగల్‌ నియోజకవర్గంలో ఓటు ఉంది. అయితే ఆమె అక్కడి ఓటును వదులుకోకుండానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి ఓటు వేశారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ మంగళవారం ఫిర్యాదు చేశారు. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అని, తక్షణమే ఆమె ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని కోరారు. ఈసీ పార్థసారథికి ఈ మెయిల్ ద్వారా తన ఫిర్యాదును పంపారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పొతంగల్ పోలింగ్ బూత్ నుంచి ఎమ్మెల్సీ కవిత ఓటు చేశారని, అలాంటప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మళ్లీ ఎలా ఓటు వేస్తారంటూ ప్రశ్నించారు. అందుకు సంబంధించి ఆధారాలను కూడా ఆమె తన ఫిర్యాదుకు జతపరిచినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు వేయడంపై బోధన్ ఆర్వో రాజేశ్వర్ స్పందించారు. కవిత రెండు చోట్ల ఓటు వేసిన మాట వాస్తవమేనని, అయితే ఆమె జూబ్లీ‌హిల్స్‌లో తన ఓటు వినియోగించుకోవడం కోసం పోతంగల్‌లో ఉన్న ఓటును తొలగించుకున్నారని, ఆమెతో పాటు ఆమె భర్త ఓటును కూడా అక్కడి నుంచి హైదరాబాద్‌కు బదలాయించుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోగలిగారని క్లారిటీ ఇచ్చారు.


ఎన్నికల్లో పాల్గొన్న వారు ఐసోలేషన్‌కేనా.. హెల్త్ అఫీషియల్స్ ఏం చెబుతున్నారు..?

గ్రేటర్ యుద్ధం: కాన్వాయ్‌ మీద బీజేపీ దాడిపై మంత్రి పువ్వాడ స్పందన ఇదీ

దిగి రావమ్మా అంటే కొండెక్కి కూర్చుంది..!

అయ్య బాబోయ్ ప్రభాస్ తో సినిమానా.. జనాలు బెదిరిపోతారంటున్న జక్కన్న

మరో క్రికెట్ టీంను కొన్న బాలీవుడ్ భాద్ షా షారుక్ ఖాన్

ఆ మూవీ కోసం పవన్ కి అదిరిపోయే రెమ్యునరేషన్ ?

తెలంగాణాలో జరగనున్న మరో ఉప ఎన్నిక....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>