TVyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/big-bossba62c5cf-0bed-46b1-a6e9-df7640ff173a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/big-bossba62c5cf-0bed-46b1-a6e9-df7640ff173a-415x250-IndiaHerald.jpg17 మంది కంటెస్టెంట్స్, ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, 15 వారాల పాటు కొనసాగే ఎపిసోడ్‌లు.. ఇదీ బిగ్‌బాస్4. బిగ్‌బాస్‌‌గా కింగ్ నాగార్జునకు ఓ సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ షో విషయంలో చానల్ యాజమాన్యం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో మరో 3 వారాల్లో...big boss;abhijith;avinash;yajamanya;adinarayanareddy;king;king 1;star maaక్యూలో కొత్త సీరియల్.. ఇక బిగ్‌బాస్4 అంతేనా..!క్యూలో కొత్త సీరియల్.. ఇక బిగ్‌బాస్4 అంతేనా..!big boss;abhijith;avinash;yajamanya;adinarayanareddy;king;king 1;star maaWed, 02 Dec 2020 13:54:00 GMTఇంటర్నెట్ డెస్క్: 17 మంది కంటెస్టెంట్స్, ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, 15 వారాల పాటు కొనసాగే ఎపిసోడ్‌లు.. ఇదీ బిగ్‌బాస్4. బిగ్‌బాస్‌‌గా కింగ్ నాగార్జునకు ఓ సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ షో విషయంలో చానల్ యాజమాన్యం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో మరో 3 వారాల్లో ముగియనుంది. ఇప్పటివరకు ఈ షో రాత్రి 9:30 గంటలకు ప్రాసారం కారనుంది. వీకెండ్స్ శని, ఆది వారాల్లో 9 గంటలకే ప్రసారమవుతంది. అయితే వదినమ్మ అనే ఓ కొత్త సీరియల్ రెడీ అవడంతో ఇప్పుడు బిగ్‌బాస్ షో ప్రసారంపై స్టార్ మా తీసుకున్న నిర్ణయం ఫాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది.

సీరియల్స్ సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారమవుతాయి. వీకెండ్స్‌లో ప్రసారం చేయరు. దీంతో ఈ కొత్త సీరియల్‌ను సోమ నుంచి శుక్ర వరకు రాత్రి 9:30 గంటలకు ప్రసారం చేయాలని స్టార్ మా నిర్ణయిచిందట. దీనికోసం బిగ్‌బాస్4 షో టైమింగ్స్ మార్చాలనుకుంటోందట. ఇక నుంచి రాత్రి 9:30 గంటలకు కాకుండా 10 గంటలకు షోను ప్రసారం చేస్తారట. వీకెండ్స్‌లో మాత్రం ఎప్పటిలానే 9 గంటలకే ప్రసారం చేసేందుకు స్టార్ మా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్టార్ మా తాజా నిర్ణయంతో బిగ్‌బాస్4 ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇప్పటివరకు 9:30 గంటలకు చూడడానికి అలవాటు పడిన వారు ఉన్నట్లుండి అరగంట లేట్‌గా షో ప్రసారం కావడంపై పెదవి విరుస్తున్నారు. అయితే ఎప్పుడు ప్రసారమైనా తమ అభిమాన షోను మిస్ చేయమని, కచ్చితంగా షో చూస్తామని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే బిగ్‌బాస్4 ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకుంది. సూపర్ టాస్క్‌లతో కంటెస్టెంట్స్ పడుతున్న కుస్తీలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా మోనాల్, అఖిల్‌-లవ్‌స్టోరీ, అవినాశ్-అరియానా కెమిస్ట్రీ.. అభిజిత్ నెగెటివ్ షేడ్స్.. ఇలా ఒక్కొక్కటీ ఫాన్స్‌కు తెగ నచ్చేస్తున్నాయి.


పూజారిపై వైసీపీ నేత దాడి...టీడీపీ రియాక్షన్ ఇది...!

RRR 2021 రిలీజ్ డౌటేనా..?

గ్రేటర్ యుద్ధం : పట్నమోళ్ళు కాదు.. ఊరోళ్లే నయం..?

అంటీలతో రొమాన్స్ చేస్తున్న కుర్ర హీరోలు ..పాపం వేరే దిక్కు లేదు మరి

విలక్షణ నటుడితో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన రాశి ఖన్నా

యోగి ఆదిత్య నాథ్ తో అక్షయ్ సమావేశం కారణం ఏంటో తెలుసా ?

గ్రేటర్ యుద్ధం: ‘‘ముషీరాబాద్ ఆరు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయం’’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>