HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/heartbb09cff3-8d71-436b-8ac0-6a61140dde6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/heartbb09cff3-8d71-436b-8ac0-6a61140dde6c-415x250-IndiaHerald.jpgమన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె... మనం జీవించటానికి అదే కారణం. అలంటి గుండెకు ఏమైనా సమస్యలు తలెత్తినట్లైతే మన జీవన ప్రమాణానికి ఆపద వచ్చినట్లే... ఈ రకమైన గుండె సమస్యలు రకరకాల ఒత్తిళ్ళ వల్ల అలాగే ఆహారపు అలవాట్ల వల్ల పురుషుల్లోనే ఎక్కువగా ఉంటాయని అంతా భావిస్తారు. కానీ తాజా స్టడీలో కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. పురుషులతో పోల్చితే.. మహిళల్లో హార్ట్ ఫెయిల్యూర్ అవకాశాలు 20 శాతానికి పెరిగినట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అంతేగాక.. మొదటి హార్ట్ ఎటాక్ వచ్చిన ఐదేళ్లలోనే మరణిస్తారని పేర్కొందిheart;auto;nithya new;telugu;scheduled tribes;director;survey;heart;heart attackమహిళలను కలవరపెడుతున్న 'గుండెపోటు'పై తాజా సర్వే ఫలితాలు!మహిళలను కలవరపెడుతున్న 'గుండెపోటు'పై తాజా సర్వే ఫలితాలు!heart;auto;nithya new;telugu;scheduled tribes;director;survey;heart;heart attackWed, 02 Dec 2020 09:20:00 GMTమన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె... మనం జీవించటానికి అదే కారణం. అలంటి గుండెకు ఏమైనా సమస్యలు తలెత్తినట్లైతే మన జీవన ప్రమాణానికి ఆపద వచ్చినట్లే... అయితే ఈ రకమైన గుండె సమస్యలు రకరకాల ఒత్తిళ్ళ వల్ల అలాగే ఆహారపు అలవాట్ల వల్ల పురుషుల్లోనే ఎక్కువగా ఉంటాయని అంతా భావిస్తారు. కానీ తాజా స్టడీలో కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. పురుషులతో పోల్చితే.. మహిళల్లో హార్ట్ ఫెయిల్యూర్ అవకాశాలు 20 శాతానికి పెరిగినట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అంతేగాక.. మొదటి హార్ట్ ఎటాక్ వచ్చిన ఐదేళ్లలోనే మరణిస్తారని పేర్కొంది. ‘అమెరికన్ హార్ట్ అసోషియేషన్’‌లో సోమవారం ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పరిశోధకులు కెనడాలోని అల్బెర్టాలో 2002-2016 మధ్య మొదటిసారి గుండె పోటు(హార్ట్ ఎటాక్)తో హాస్పిటల్‌లో చేరిన 45 వేల మంది రోగులపై ఈ అధ్యయనం జరిపారు. వీరిలో 30.8 శాతం మంది మహిళలే ఉన్నారు. పరిశోధనలో భాగంగా నిపుణులు ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (స్టెమీ - STEMI), నాన్ స్టెమీ (Non-STEMI or NSTEMI) అంశాలపై దృష్టిపెట్టారు. రోగులపై సుమారు 6.2 ఏళ్లు నిఘా పెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు తెలుసుకున్నారు.



 
 మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చిన తర్వాత చాలామంది మహిళలు.. ముఖ్యంగా వయస్సు మీదపడిన స్త్రీలు.. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు తెలుసుకున్నారు. వారిలో ఎక్కువ మందికి హార్ట్ ఫెయిల్యూర్ అవుతున్నట్లు కనుగొన్నారు. మొత్తం రోగుల్లో 24,737 మందిలో హార్ట్ ఎటాక్ సమస్య (NSTEMI) తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 34.3 శాతం మహిళలు, 65.7 శాతం పురుషులు ఉన్నారు. అంటే.. గుండె సమస్యలను స్వల్పంగా ఎదుర్కొనేవారిలో పురుషుల శాతమే ఎక్కువగా ఉంది. అలాగే.. మొత్తం రోగుల్లో 20,327 మంది రోగులు స్టెమీ సమస్య.. అంటే హార్ట్ ఎటాక్‌ ఎదుర్కొటున్నట్లు తెలుసుకున్నారు. వీరిలో 26.5 శాతం మంది స్త్రీలు, 73.5 శాతం మంది పురుషులు ఉన్నారు. అయితే, పురుషులతో పోల్చితే.. మహిళలు ఐదేళ్లలోనే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోతున్నట్లు తెలుసుకున్నారు. మొదటిసారి హార్ట్ ఎటాక్‌తో హాస్పిటల్‌లో చేరిన మహిళలు అప్పటికే ఇతరాత్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. బీపీ, డయాబెటీస్, ఫైబ్రిలేషన్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వంటి వ్యాధులు గుండెను మరింత బలహీనం చేయడం వల్లే వారు త్వరగా చనిపోతున్నారని తెలుసుకున్నారు.
 
 
 
 ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన కెనడియన్ విగౌర్ సెంటర్ కో-డైరెక్టర్, కార్డియాలజిస్ట్ జస్టిన్ ఎ.ఎజేకోవిట్జ్ మాట్లాడుతూ.. ‘‘మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చిన తర్వాత మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ స్టడీ ద్వారా తెలుసుకున్నాం. శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం, బీపీ నియంత్రణలో ఉంచుకోవడమే కాకుండా.. నిత్యం వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మరణం నుంచి బయటపడొచ్చు. స్మోకింగ్ అస్సలు మంచిది కాదు. ఇంకా ఏమైనా చెడు వ్యసనాలు ఉంటే.. వాటిని విడిచిపెట్టడమే ఉత్తమం’’ అని తెలిపారు.



 
 ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. పలు అధ్యయనాల్లో తేలిన అంశాలను మీకు తెలియజేయడానికే వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన ఈ కథనం. మరింత సమాచారం తెలుసుకోవాలంటే తప్పకుండా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించాలని మనవి.




గ్రేటర్ యుద్ధం : నిద్ర లేవని నగరం.. పాపం చలికాలం కాబోలు..!?

త్వరలో ఆరు గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించేలా టైం టేబుల్ - రైల్వే బోర్డు

బ్రేకింగ్: తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్ లోనే

ఏపీలో అడుగు పెడుతున్న పవన్... ఈసారి ఎక్కడికి అంటే...!

తెరాస మాజీ ఎంపీకి బిజెపి రాజ్యసభ ఆఫర్...?

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>