PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/counting6a246bf5-ad76-416c-8b8a-0f66109bd646-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/counting6a246bf5-ad76-416c-8b8a-0f66109bd646-415x250-IndiaHerald.jpgజీహెచ్‌ఎంసీ పోలింగ్‌ ముగిసింది. గత రెండు వారాలుగా హోరాహోరీ ప్రచారంలో తలమునకలైన నేతలకు కొంత విరామం దొరికింది. కానీ.. ఫలితంపై ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ మాత్రం మరో రెండు రోజులు కొనసాగనుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును శుక్రవారం (4న) చేపట్టనున్న సంగతి తెలిసిందే. బ్యాలెట్‌ పద్ధతిలో ఈ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో లెక్కింపు, ఫలితం వెల్లడికి ఎక్కువ సమయం పట్టనుంది.counting;bharatiya janata party;partyమరో రెండు రోజులు ఉత్కంఠ 4న ఓట్ల లెక్కింపుమరో రెండు రోజులు ఉత్కంఠ 4న ఓట్ల లెక్కింపుcounting;bharatiya janata party;partyWed, 02 Dec 2020 12:09:48 GMTఓటింగ్పై పార్టీ నేతల ఆరా..

 పోలింగ్ శాతం తగ్గడంతో ఆందోళన


జీహెచ్‌ఎంసీ పోలింగ్‌ ముగిసింది. గత రెండు వారాలుగా హోరాహోరీ ప్రచారంలో తలమునకలైన నేతలకు కొంత విరామం దొరికింది. కానీ.. ఫలితంపై ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ మాత్రం మరో రెండు రోజులు కొనసాగనుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును శుక్రవారం (4న) చేపట్టనున్న సంగతి తెలిసిందే. బ్యాలెట్‌ పద్ధతిలో ఈ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో లెక్కింపు, ఫలితం వెల్లడికి ఎక్కువ సమయం పట్టనుంది. 


ఆ రోజు మధ్యాహ్నానికి గానీ ఏ పార్టీకి మెజారిటీ అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం నుంచే ఓటింగ్‌ సరళిని ఆయా పార్టీల నేతలు ఎప్పటికప్పుడు ఆరా తీయడం కనిపించింది. దాన్ని బట్టి ఆయా డివిజన్లలో ఏ మేరకు విజయావకాశాలు ఉన్నాయన్న దానిపై అంచనాలు వేసుకున్నారు.



ఇతర ప్రాంతాల నుంచి వచ్చి.. ఆయా డివిజన్లలో బాధ్యతలు తీసుకున్న నేతలు సైతం ఓటింగ్‌ సరళిపైన ఎప్పటికప్పుడు ఆరాలు తీశారు. సానుభూతిపరులను తీసుకెళ్లి ఓటు వేయించుకోవడం, ఓటర్లకు అవరమైన సహకారం అందించడం వంటి కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తలు తలమునకలయ్యారు. అయితే, మంగళవారం సాయంత్రానికి ఓటింగ్‌శాతం తక్కువగా నమోదు కావడం పట్ల ప్రధాన పార్టీల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఓటర్లలో ఏర్పడిన నైరాశ్యం.. ఫలితంపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న దానిపై అవగాహనకు రాలేకపోతున్నాయి.



ఓటింగ్‌ శాతం తగ్గడం ఏ పార్టీకి అనుకూలమన్నదీ తెలియడం లేదు. ఓటింగ్‌ శాతం తగ్గినా ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా మారిందని, తాము ముందుగా అంచనా వేసిన స్థాయిలో డివిజన్లను గెలుచుకోనున్నామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతే ఉంటే భారీగా పోలింగ్‌ నమోదయ్యేదని, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు టీఆర్‌ఎ్‌సవైపే ఉన్నారని అధికార పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.





కేంద్రానికి చెప్తా: పవన్

గ్రేటర్ యుద్ధం: ‘‘ముషీరాబాద్ ఆరు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయం’’

పవర్ స్టార్ లిక్విడ్ డైట్ కి కారణమదేనా?

బిగ్ బాస్ 4 : అరియానా గ్రాఫ్ తగ్గుతుందా.. హౌజ్ లో వీక్ అవుతున్న బోల్డ్ పాప..!

ప్రాణం తీసిన కోతులు.. అసలేం జరిగిందంటే?

ఓటేయని ఉద్యోగులు వరుస సెలవులతో సొంతూళ్లకే పరిమితం తగ్గిన పోలింగ్‌

గ్రేటర్ యుద్ధం: ముందే చేతులెత్తేసిన బీజేపీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>