PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-confident-words-in-assembly4bca8360-9a4e-46ae-a154-b3b7f300b9fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-confident-words-in-assembly4bca8360-9a4e-46ae-a154-b3b7f300b9fb-415x250-IndiaHerald.jpgఏపీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జగన్ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఊహించని విధంగా అప్పటివరకు అధికారంలో ఉన్న చంద్రబాబుని పక్కనబెట్టి, జనం జగన్‌ని గెలిపించారు. జగన్‌కు భారీ మెజారిటీ ఇచ్చారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటేసింది. ఇక ఈ ఏడాదిన్నర కాలంలో జగన్ పాలనకు మంచి మార్కులే పడుతున్నాయి. ప్రజల అండ కూడా గట్టిగానే ఉంది. jagan;cbn;amala akkineni;jagan;andhra pradesh;tdpతొలిసారి జగన్ ఇలా చెప్పి షాక్ ఇచ్చేశారుగా...!తొలిసారి జగన్ ఇలా చెప్పి షాక్ ఇచ్చేశారుగా...!jagan;cbn;amala akkineni;jagan;andhra pradesh;tdpWed, 02 Dec 2020 03:00:00 GMTఏపీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జగన్ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఊహించని విధంగా అప్పటివరకు అధికారంలో ఉన్న చంద్రబాబుని పక్కనబెట్టి, జనం జగన్‌ని గెలిపించారు. జగన్‌కు భారీ మెజారిటీ ఇచ్చారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటేసింది. ఇక ఈ ఏడాదిన్నర కాలంలో జగన్ పాలనకు మంచి మార్కులే పడుతున్నాయి. ప్రజల అండ కూడా గట్టిగానే ఉంది.

తాజాగా వచ్చిన ఓ సర్వేలో సైతం జగన్ ఓటింగ్ శాతం ఏ మాత్రం తగ్గలేదని తేలింది. అయితే తాను ప్రజల విశ్వసనీయత కోల్పోలేదని జగన్ అసెంబ్లీలో చెప్పారు. తమపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, జగన్‌ మాట చెప్తే చేసి చూపిస్తాడని, విశ్వసనీయత అన్నది మనం చేసే పనుల వల్ల వస్తుందని, మాట చెప్తే నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలను ఇవ్వగలిగామని స్ట్రాంగ్‌గా చెప్పారు.

అలాగే మేనిఫెస్టోలోని అంశాలను 90 శాతం అమలు చేశామని, అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని, ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు, మూడు స్థానాలు కూడా రావని జగన్‌ గట్టిగా చెప్పారు. సాధారణంగా జగన్ ఇలా మాట్లాడటం చాలా తక్కువ. ఎందుకంటే ఆయన పనులే మాట్లాడతాయి. ఆయన ప్రత్యేకంగా ప్రజలకు ఏం చేస్తున్నారో పెద్దగా ఎప్పుడు చెప్పుకోరు. అధికారంలోకి వచ్చాక పెద్దగా తన గురించి, తాను ఎప్పుడు చెప్పుకోలేదు.

కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలని తిప్పికొట్టడంలో భాగంగా, తాను ప్రజల విశ్వసనీయత కోల్పోలేదని డైరక్ట్‌గానే చెప్పారు. వాస్తవానికి జగన్ చెప్పింది కరెక్టే. ఎందుకంటే అధికారంలో రావడానికి పార్టీలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇస్తాయి. అయితే అధికారంలోకి వచ్చాక ఆ హామీలని అమలు చేయడం కష్టం. గతంలో చంద్రబాబు అలాగే చేశారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక, ఏడాదిన్నర సమయంలో మేనిఫెస్టోలోని దాదాపు అన్నీ హామీలని అమలు చేశారు. అందుకే జగన్ కాన్ఫిడెంట్‌గా తాను ఇంకా ప్రజల నమ్మకాన్ని కోల్పోలేదని చెప్పారు.




గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?

గ్రేటర్ యుద్ధం: పోలింగ్ తగ్గడానికి విశ్లేషకులు చెప్తున్న 15 కారణాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>