MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/character-is-small-remuneration-is-big872dfd88-eb51-4b76-abaf-ccddc0226461-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/character-is-small-remuneration-is-big872dfd88-eb51-4b76-abaf-ccddc0226461-415x250-IndiaHerald.jpgకరోనా సమయంలో శృతిహాసన్‌ నిర్మాతలపై కరోనా ట్యాక్స్ వేసింది. ఫేడౌట్‌ అయిన ఈ అమ్మడికి ఆఫర్స్ రావడమే గ్రేట్‌ అనుకుంటే... రెమ్యునరేషన్‌ పెంచేసిందట. పాత్ర చిన్నదైనా.. 10 రోజులే నటించినా.. ఫుల్‌ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తోంది శృతిహాసన్‌. character is small remuneration is big;shruti;shruti haasan;sethu;sruthi;korcha;telugu;tamil;pinkక్యారెక్టర్ చిన్నది.. రెమ్యునరేషన్ పెద్దది..!క్యారెక్టర్ చిన్నది.. రెమ్యునరేషన్ పెద్దది..!character is small remuneration is big;shruti;shruti haasan;sethu;sruthi;korcha;telugu;tamil;pinkWed, 02 Dec 2020 05:00:00 GMT
ఆ మధ్య బాయ్‌ఫ్రెండ్‌ను చూసుకొని.. సినిమాలను పట్టించుకోలేదు. మూడేళ్లపాటు ఈ అమ్మడు కనిపించలేదు. బ్రేకప్‌ తర్వాత మళ్లీ కెరీర్‌ గుర్తుకొచ్చింది. బాయ్‌ఫ్రెండ్‌ పోయి.. మరోవైపు ఆఫర్స్‌ లేక డిప్రెషన్‌లో ఉన్న సమయంలో తమిళంలో లాభం మూవీలో విజయ్‌ సేతుపతితో నటించే అవకాశం  అందుకుంది. తెలుగులో క్రాక్‌ చేస్తోంది. ఇప్పటికే పవన్‌లో రెండుసార్లు జత కట్టిన శృతి వకీల్‌సాబ్‌తో మూడోసారి కాస్త బిజీ అయింది.

హిందీలో హిట్‌ అయిన పింక్ రీమేక్‌గా వకీల్‌ సాబ్‌ రూపొందుతోంది. ఒరిజినల్ వెర్షన్‌లో అమితాబ్‌కు హీరోయిన్‌ ఉండదు. పవర్‌స్టార్‌ ఇమేజ్‌కు తగ్గట్టు హీరోయిన్‌ క్యారెక్టర్‌ సృష్టిస్తూ.. శృతిహాసన్‌ను సెలెక్ట్‌ చేశాడు దర్శకుడు వేణు శ్రీరాం. ఇందులో శృతీది  గెస్ట్‌ రోల్‌ అయినా.. హీరోయిన్‌గా నటిస్తే.. ఎంత తీసుకుంటుందో.. అంతే ఛార్జ్‌ చేసిందట.

సాధారణంగా హీరోయిన్స్‌ ఐటంగర్ల్‌గా మారితే ఎక్కువ ఛార్జ్‌ చేస్తారు. హీరోయిన్‌గా తీసుకునే రెమ్యునరేషన్‌లో సగం .. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ డిమాండ్‌ చేస్తారు.  ఆఫర్స్‌ కోసం వెయిట్ చేస్తున్న శృతిహాసన్‌కు పవన్‌తో జత కట్టే బంపర్ ఆఫర్‌ ఇస్తే.. కొండెక్కి కూర్చుందట. డిసెంబర్‌ మొదటివారంలో సెట్స్‌లోకి అడుగుపెట్టనుంది శృతి. మొత్తానికి శృతిహాసన్.. క్రేజ్ లేకపోయినా.. రెమ్యునరేషన్ విషయంలో మొండిపట్టుపడుతోంది. గెస్ట్‌ రోలే అయినా.. ఫుల్‌ రెమ్యునరేషన్ కోసం పట్టుబడుతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. వకీల్‌సాబ్‌లో శృతిహాసన్‌ రోల్ చిన్నదే అయినా.. హీరోయిన్‌గా తీసుకునేంత పారితోషికం డిమాండ్‌ చేస్తోంది.ఆ మధ్య బాయ్‌ఫ్రెండ్‌ చెట్టాపట్టాలేసుకొని తెగ తిరిగేసిన ఈ అమ్మడు.. సినిమాలకు మూడేళ్లు దూరం ఉంది. అయితే ఫేడౌట్‌ అయినా లక్కీగా ఛాన్సులు కొట్టేస్తోంది.
చుద్దాం..శృతి హాసన్ డిమాండ్ వర్కవుట్ అవుతుందో లేదో.













గ్రేటర్ యుద్దం : వార్ ముగిసింది..మరి గెలుపేవారిది ..??

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>