PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-ware9d2d10e-788f-4d16-8263-0fe737524bd4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-ware9d2d10e-788f-4d16-8263-0fe737524bd4-415x250-IndiaHerald.jpgగత రెండు నెలలనుండి తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా జరిగిన రాజకీయ పరిణామాలకు నిన్న జరిగిన ఎన్నికలతో తెరపడింది. ముందుగా ఊహించిన ప్రకారం పోలింగు శాతం పెరుగుతుందనుకుంటే అలా జరగకపోవడం చాలా దురదృష్టకరం. గ్రేటర్ ఎన్నికల పోలింగు శాతం 47 కి పడిపోయింది. దీనితో ఓటింగు శాతం పైనే గెలుపు ఆధారపడి ఉంటుందని అంచనా వేసిన కొన్ని పార్టీల ఆశలు నీరు గారిపోయాయని చెప్పవచ్చు. ఓటింగు పూర్తి కావడంతో రక రకాల ఎగ్జిట్ పోల్స్ వాటి ఫలితాలను ప్రకటిస్తున్నాయి. అయితే వివిశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం greater war;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;telanganaగ్రేటర్ యుద్ధం: బీజేపీ ఆశలకు గండి పడనుందా...?గ్రేటర్ యుద్ధం: బీజేపీ ఆశలకు గండి పడనుందా...?greater war;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;telanganaWed, 02 Dec 2020 15:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా జరిగిన రాజకీయ పరిణామాలకు నిన్న జరిగిన ఎన్నికలతో తెరపడింది. ముందుగా ఊహించిన ప్రకారం పోలింగు శాతం పెరుగుతుందనుకుంటే అలా జరగకపోవడం చాలా దురదృష్టకరం. గ్రేటర్ ఎన్నికల పోలింగు శాతం 47 కి పడిపోయింది. దీనితో ఓటింగు శాతం పైనే గెలుపు ఆధారపడి ఉంటుందని అంచనా వేసిన కొన్ని పార్టీల ఆశలు నీరు గారిపోయాయని చెప్పవచ్చు. ఓటింగు పూర్తి కావడంతో రక రకాల ఎగ్జిట్ పోల్స్ వాటి ఫలితాలను ప్రకటిస్తున్నాయి. అయితే వివిశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఎన్నికలలో నూటికి నూరు శాతం విజయం తెరాస దేనని తెలుస్తోంది.

అయితే ఈ ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ ఎక్కడ ఫెయిలయింది అనే విషయాన్ని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతకీ కారణాలను ఒకసారి పరిశీలించుకుంటే ఎన్నికల ప్రచారంలో వీరి దూకుడు వలనే ప్రజలు వీరికి మద్దతుగా నిలబడలేదని కొందరు భావిస్తున్నారు. మామూలుగా ఎన్నికల ప్రచారంలో మన బలమెంతో చెప్పుకుని ఎన్నికలకు వెళ్ళాలి, అంతే కానీ అవతలివాళ్లు బలహీనతలను ఆధారంగా చేసుకుంటే ఇలాంటి ఫలితాలే చూడవలసి వస్తుంది. ముఖ్యంగా  తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చాలా ఘాటుగా చేసారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నకేసీఆర్ ను సైతం వదలకుండా నోటికొచ్చిన పదజాలంతో విమర్శించారు.

ఈ విషయాలను ప్రజలు గమనిస్తూ ఉంటారు తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మంచి చేసిందా చేదు చేసిందా అన్న విషయాన్ని పక్కన పెడితే, బీజేపీ వస్తే ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమి చేస్తారో చెప్పి, వాటిని ప్రజల ముందుకు ఒక ప్రణాళిక ప్రకారం తీసుకెళ్లడం ప్రధానం. అంతే కానీ ఎలా అంటే అలా..పరుషమైన పదజాలం ఉపయోగించి మాట్లాడితే ప్రజలు ఏమి అర్ధం చేసుకుంటారు. ఇక్కడే వీరికి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. మరి ఫలితాలు తారుమారైతే తప్ప తెరాస అభ్యర్థి మేయర్ అవడం ఖాయం.


టాలీవుడ్‌లోకి శ్రీదేవి రెండో కూతురు!!!

గ్రేటర్ యుద్ధం : ఆ ఇద్దరు ఎన్నికలను నిర్వీర్యం చేశారు..?

గ్రేటర్ యుద్ధం : గులాబీ కండువా కప్పుకున్న ఎన్నికల సంఘం..?

ఆర్జీవీ కరోనా వైరస్ కొత్త ట్రైలర్ వచ్చేసింది.. చూసేయండి

జూనియర్ ఆఫీసర్ అప్లికేషన్ కు ఈ రోజే చివరి తేదీ.

మహేష్ తో సుకుమార్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్..!

బిగ్ బ్రేకింగ్ : కెజిఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ 'సలార్' మూవీ అనౌన్స్ మెంట్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>