Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_trailers/ram-gopal-varma-release-new-trailer-of-corona-virus5e6a696d-a38a-4dc8-8332-8022bec72014-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_trailers/ram-gopal-varma-release-new-trailer-of-corona-virus5e6a696d-a38a-4dc8-8332-8022bec72014-415x250-IndiaHerald.jpgకాదేదీ కవితకనర్హం.. ఈ నానుడి ఎప్పటి నుంచో ఉంది. అయితే దీన్నే కాస్త మోడ్రన్‌గా ‘కాదేదీ సినమాకనర్హం’ అంటాడు ఆర్జీవీ. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్.. ఆర్జీవీ. ఇప్పటికే ఎన్నో కాంట్రవర్సీ సినిమాలను డైరెక్ట్ చేశాడు. వాటిలో కొన్ని ఇప్పటికే విడుదల కాగా.. మరికొన్ని విడులకు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి కరోనా వైరస్. ఆర్జీవీ రీసెంట్‌గా డైరెక్ట్ చేసిన సినిమా...corona;ram gopal varma;govi;cinema;twitter;murder;murder.;v;coronavirusఆర్జీవీ కరోనా వైరస్ కొత్త ట్రైలర్ వచ్చేసింది.. చూసేయండిఆర్జీవీ కరోనా వైరస్ కొత్త ట్రైలర్ వచ్చేసింది.. చూసేయండిcorona;ram gopal varma;govi;cinema;twitter;murder;murder.;v;coronavirusWed, 02 Dec 2020 14:35:40 GMT" style="height: 370px;">కాదేదీ కవితకనర్హం.. ఈ నానుడి ఎప్పటి నుంచో ఉంది. అయితే దీన్నే కాస్త మోడ్రన్‌గా ‘కాదేదీ సినమాకనర్హం’ అంటాడు ఆర్జీవీ. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్.. ఆర్జీవీ. ఇప్పటికే ఎన్నో కాంట్రవర్సీ సినిమాలను డైరెక్ట్ చేశాడు. వాటిలో కొన్ని ఇప్పటికే విడుదల కాగా.. మరికొన్ని విడులకు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి కరోనా వైరస్. ఆర్జీవీ రీసెంట్‌గా డైరెక్ట్ చేసిన సినిమా కరోనా వైరస్. కథ, కథాంశం పక్కన పెడితే ఈ సినిమా టైటిల్‌తోనే ఆర్జీవీ కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. అంతేకాదు లాక్‌డౌన్ సమయంలో సినిమా షూటింగ్‌ ఎక్కడా జరగకపోయినా ఆర్జీవీ మాత్రం 2, 3 సినిమాల షూటింగ్ పూర్తి చేసేశాడు. విచిత్రమేంటంటే వీటిలో రెండు సినిమాలు ఈ నెల 11న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. అంటే తన సినిమాకు తన సినిమానే పోటీ అన్నమాట.

లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్‌లో విడుదల అవుతున్న తొలి సినిమా ‘కరోనా వైరస్’. సమాజంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు వర్మ చెబుతున్నాడు. ఈ సినిమానే కాదు.. ‘మర్డర్’, ‘దిశ’ వంటి అనేక వివాదాస్పద చిత్రాలనూ ఆర్జీవీ రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలూ కోర్టు కేసుల్లో ఉన్నాయి. అయితే మర్డర్‌ సినిమాను కరోనా వైరస్‌తో కలిసి డిసెంబరు 11న విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ ఇప్పటికే ప్రకటించేశాడు.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ రెండో ట్రైలర్‌ను ఆర్జీవీ ఈ రోజు ట్విటర్‌లో విడుదల చేశాడు. ఈ ట్రైలర్‌ కరోనా డైలాగ్‌తోనే మొదలవుతుంది. ‘కరోనా ఎఫెక్ట్‌ ఉంది కదా.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరి నుంచి ఎవరికి.. ఎలా వస్తుందో తెలియటం లేదు. కాబట్టి నాకు చెప్పకుండా ఎవరు బయటకు వెళ్లేది లేదు.. అని కుటుంబ పెద్ద డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. ‘60-70 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లకు మాత్రమే కరోనా వస్తుందనడం కరెక్ట్‌ కాదు. 25 ఏళ్ల అబ్బాయి కూడా చచ్చిపోయాడంట.. ఇంకా ఆయన మాటలు వింటే గోవిందా.. గోవిందా’ అనే మరో డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ముగుస్తుంది. కరోనా పేషెంట్లు దగ్గినట్లుగా భారీ శబ్దంతో కూడిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ ఈ ట్రైలర్‌‌కు ఓ సెపరేట్ ట్రాక్ ఇస్తోంది. దీంతో సినిమాపై ఆసక్తినీ పెంచుతోంది.

మరి ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను, ముఖ్యంగా ఆర్జీవీ అభిమానులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.


విజేతను తేల్చేసింది ఆ పది వేలేనా ?

గ్రేటర్ యుద్ధం : ఆ ఇద్దరు ఎన్నికలను నిర్వీర్యం చేశారు..?

గ్రేటర్ యుద్ధం : గులాబీ కండువా కప్పుకున్న ఎన్నికల సంఘం..?

జూనియర్ ఆఫీసర్ అప్లికేషన్ కు ఈ రోజే చివరి తేదీ.

మహేష్ తో సుకుమార్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్..!

బిగ్ బ్రేకింగ్ : కెజిఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ 'సలార్' మూవీ అనౌన్స్ మెంట్ .....!!

గ్రేటర్ యుద్ధం: ముషీరాబాద్ లో సాయంత్రం 6 వరకు పోలింగ్ వివరాలు ఇవి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>