MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-melkote-unbelievable-back-ground87fcc3fa-ba99-43ce-b8bd-bd1b7d4f3c20-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-melkote-unbelievable-back-ground87fcc3fa-ba99-43ce-b8bd-bd1b7d4f3c20-415x250-IndiaHerald.jpgహాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించిన శంకర్ మేల్కోటే నిజ జీవితంలోను ఎంతో ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ప్రతి సినిమాలోనూ పిల్లి గడ్డంతో బ్లాక్‌ సూట్‌లోనే దర్శనమివ్వడం ఆయన ప్రత్యేకత. ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థలో పనిచేసేవారు. actor melkote;jeevitha rajaseskhar;ramoji rao;shankar;sridhar;mp;cinema;bcci;producer;comedy;producer1;hero;fidaaఈ కామెడీ యాక్టర్ బ్యాగ్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మ తిరిగిపోద్దిఈ కామెడీ యాక్టర్ బ్యాగ్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మ తిరిగిపోద్దిactor melkote;jeevitha rajaseskhar;ramoji rao;shankar;sridhar;mp;cinema;bcci;producer;comedy;producer1;hero;fidaaWed, 02 Dec 2020 14:00:00 GMTసినిమా రంగంలోకి అడుగుపెట్టాక జయాపజయాలు అనేవి సర్వసాధారణం. సినీ ఇండస్ట్రీలోకి చాలామంది నటి, నటులు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు. కానీ కొంతమందిని మాత్రమే ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు. అలాంటి కోవలోకి చెందిన  హాస్యనటుడు శంకర్ మేల్కొటి.  అనేక సినిమాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించిన శంకర్ మేల్కోటే నిజ జీవితంలోను ఎంతో ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించి మనల్ని తన మాటలతో, హావభావాలతో కట్టి పడేస్తున్న ఆయన జీవిత విశేషాలు మీకోసం అందిస్తున్నాం..  తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హాస్యనటులున్నా కొందరు మాత్రం కలకాలం గుర్తుండిపోతారు. అలాంటి వారిలో శంకర్ మేల్కొటే ఒకరు.

ప్రతి సినిమాలోనూ పిల్లి గడ్డంతో బ్లాక్‌ సూట్‌లోనే దర్శనమివ్వడం ఆయన ప్రత్యేకత. అయితే ఈయన  సినీ రంగ ప్రవేశం చాలా విచిత్రగా జరిగిందట. అసలు మేల్కొటి ఎక్కడ పని చేసేవారంటే... ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థలో పనిచేసేవారు. ఆ సంస్థ కోసం తీసిన ఒక ప్రకటనలో ఆయనను తొలిసారి నటించమని అడిగితే నటించారట. అయితే అప్పుడు ఆయన నటనకు రామోజీరావు ఫిదా అయ్యారట. కొద్దిరోజుల తర్వాత ఉషాకిరన్ మూవీస్ నిర్మించిన ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాలో హీరో బాస్ పాత్ర కోసం నటుడిని అన్వేషిస్తుండగా మేల్కొటేని పిలిచారట రామోజీరావు. ఆ సినిమాలో తెలుగు రాని బాస్‌ పాత్రలో మేల్కొటే ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు  180 చిత్రాల  నటించారు. ఒకట్రెండు సినిమాల్లో తప్ప అన్ని సినిమాల్లోనూ బాస్‌గానే కనిపించినా ప్రేక్షకులకు ఎప్పుడూ బోర్ కొట్టలేదు..ఆయన డైలాగ్ డెలివరీ చాలా బాగా ఉంటుంది. సినిమాల్లో ఏదైనా కామెడీ బాస్ పాత్ర ఉందంటే ఇప్పటికీ దర్శక నిర్మాత ఫస్ట్ ఛాయిస మేల్కొటినే.

ఎదో సినిమాల్లో ఆడపదడపా కనిపిస్తు,  చిన్నచిన్న వేషాలు చేస్తున్నంత మాత్రాన మేల్కొటే బ్యాక్‌గ్రౌండ్  తక్కువేమోనని అనుకోకండి. అయితే ఆయన వ్యక్తిగత జీవిత గురించి చాలామందికి తెలియదు. ఆయన ఒక కంపెనీ కి సీఈవోగా పని చేస్తున్నారని చాలా మందికి తెలియదు.ఆయన హైదరాబాద్‌లోని ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవోగా కూడా పనిచేశారు. అంతేకాదు ఆయన అల్లుడు కూడా ఒక సెలెబ్రిటీనే. ఆయన మారెవరో కాదు.. మాజీ రంజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్‌ ఎంపీ శ్రీధర్. మేల్కొటే కూతురు రమానికి  శ్రీధర్ తో వివాహం జరిగింది. అంతేకాదు మేల్కొటికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అమెరికాలో ఓ సంస్థలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఒక కంపనీకి సీఈవో గా ఉండడం వల్లనేమో, సినిమాల్లో వేసే బాస్‌ పాత్రలలోను జీవించేస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.. !! ఆయనకు ఎంత డబ్బున్నా కానీ నటన మీద ఉన్న ఆసక్తితోనే సినీ రంగంలో ప్రవేశించారట.. !!


నాన్న కోసం హైపర్ ఆది చేసిన పని తెలిస్తే..

RRR 2021 రిలీజ్ డౌటేనా..?

గ్రేటర్ యుద్ధం : పట్నమోళ్ళు కాదు.. ఊరోళ్లే నయం..?

పులుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

అంటీలతో రొమాన్స్ చేస్తున్న కుర్ర హీరోలు ..పాపం వేరే దిక్కు లేదు మరి

విలక్షణ నటుడితో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన రాశి ఖన్నా

యోగి ఆదిత్య నాథ్ తో అక్షయ్ సమావేశం కారణం ఏంటో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>