PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/drowning-danger-get-alert-raind766b2c1-e2f3-42f1-b6fb-3895c80d09c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/drowning-danger-get-alert-raind766b2c1-e2f3-42f1-b6fb-3895c80d09c5-415x250-IndiaHerald.jpgనివర్ తుఫాన్ మిగిల్చిన నష్టం నుంచి కోలుకోకముందే.. మరో తుఫాన్ వెంటాడబోతోంది. ప్రస్తుతం బురేవి తుఫాన్‌.. వాయుగుండంలా ఉంది. మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా మారుతుందని అంచనాలు ఉన్నాయి. తుఫాన్‌ శ్రీలంక తీరంలో ఉన్నప్పటికీ, దాని ప్రభావం మనదేశంపై కూడా ఉండబోతోంది. తూర్పుతీరంలోని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు నౌకలను, విమానాలను రక్షణశాఖ సిద్ధం చేస్తోంది. ఈ రోజు రాత్రి తుఫాన్‌ లంక తీరందాటే అవకాశం ఉంది. దీంతో కేరళ, తమిళనాడుకు రెడ్‌వార్నింగ్‌ జారీ అయింది.drowning danger get alert rain;kerala;koshta;andhra pradesh;sri lanka;east;rayalaseema;tamilnadu;central government;manadesamముంచుకొస్తున్న ప్రమాదం.. అలర్ట్ కండి..!ముంచుకొస్తున్న ప్రమాదం.. అలర్ట్ కండి..!drowning danger get alert rain;kerala;koshta;andhra pradesh;sri lanka;east;rayalaseema;tamilnadu;central government;manadesamWed, 02 Dec 2020 18:00:00 GMTఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఉండనుంది.

నివర్ తుఫాన్ మిగిల్చిన నష్టం నుంచి కోలుకోకముందే.. మరో తుఫాన్ వెంటాడబోతోంది. ప్రస్తుతం బురేవి తుఫాన్‌.. వాయుగుండంలా ఉంది. మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా మారుతుందని అంచనాలు ఉన్నాయి. తుఫాన్‌ శ్రీలంక తీరంలో ఉన్నప్పటికీ, దాని ప్రభావం మనదేశంపై కూడా ఉండబోతోంది.  తూర్పుతీరంలోని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు నౌకలను, విమానాలను రక్షణశాఖ సిద్ధం చేస్తోంది. ఈ రోజు రాత్రి తుఫాన్‌ లంక తీరందాటే అవకాశం ఉంది. దీంతో కేరళ, తమిళనాడుకు రెడ్‌వార్నింగ్‌ జారీ అయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంగా గాలులు వస్తాయి. హిందూ మహాసముద్రంలో ఈ ఏడాది బురేవి ఐదో తుఫాన్‌. ఇప్పటికే ఉంఫన్‌, నిసర్గ, గతి, నివర్‌ తుఫాన్లు మనదేశం మీద దాడిచేశాయి.

బురేవి దెబ్బకు రాయలసీమ, యానాం, ఉత్తర కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.  నెల్లూరు,ప్రకాశం,చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరిలో ఈ తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉండనుంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సైతం భారీగా తగ్గుతాయని వాతావరణ శాఖ చెబుతోంది.

ఇటు నివర్‌ తుఫాన్‌ తర్వాత తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఆదిలాబాద్‌లో నిన్నమొన్నటి వరకు 17 నుంచి 20 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మంగళవారం 14.7 డిగ్రీలకు పడిపోయింది. మరోవైపు.. రేపు తెలంగాణలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

మొత్తానికి నివర్ తుఫాన్ నుంచి కోలుకోకముందే.. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్టుగా మరో తుఫాన్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.






వామ్మో! కాజల్ కి ఏమైంది... ఈ సారి ఆ పాత్ర పోషిస్తుందా?

అయ్యయ్యో ప్రభాస్ సీతకెన్ని అవమానాలో..

గ్రేటర్ యుద్దం : సంజయ్ ,ప్రధాని ఫోన్ కాల్ పై సోషల్ మీడియాలో బిన్నాభిప్రాయాలు ..!!

ఆ వార్డెన్ పైశాచికత్వం పై స్పందించిన చిన్మయి...

సునీల్ ఇక హీరో గా చేయడా.. కొత్త అవతారం..?

పవన్ కళ్యాణ్ తీరుపై అభిమానుల నిరాశ..!

అలీతో సరదాగా షోకి వచ్చే గెస్ట్స్ ఒక్క ఎపిసోడ్ కోసం ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>