PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020f2d42029-68bc-4e8c-b334-d04e016178ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020f2d42029-68bc-4e8c-b334-d04e016178ae-415x250-IndiaHerald.jpgత‌గ్గిన ఓటు శాతం వారికే ఎఫెక్ట్ ప‌డుతుందంటే... వారికే ప‌డుతుందంటూ విప‌క్షాలు.. కామెంట్ చేస్తూ... మా గెలుపు త‌థ్యం అంటూ చెప్పుకుంటున్నాయి. వాస్త‌వానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికలో ముప్పై అయిదు శాతం పైన మాత్రమే పోలింగ్‌ జరగడం అందరినీ ఆలోచనలో ప‌డేస్తోంది. కొన్ని చోట్ల మరీ దారుణంగా పడిపోయింది. దీనికి కారణాలు ఏమిటి, ప్రభావమేమిటనే దానిపై రకరకాల అంచనాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా త‌గ్గినా ఓటు శాతం ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది... ఏ పార్టీ శ‌రాఘాతంగా మార‌నుంద‌నే అంశంపైనే ఇప్పుడు స‌ర్వ‌త్ghmc;kcr;bharatiya janata party;partyఆ విష‌యంపైనే పార్టీల్లో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌... జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల‌పై పార్టీలేమనుకుంటున్నాయంటే..?ఆ విష‌యంపైనే పార్టీల్లో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌... జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల‌పై పార్టీలేమనుకుంటున్నాయంటే..?ghmc;kcr;bharatiya janata party;partyWed, 02 Dec 2020 10:00:00 GMTపార్టీ శ‌రాఘాతంగా మార‌నుంద‌నే అంశంపైనే ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. మూడు డివిజన్లలో మాత్రమే 50 శాతం పోలింగ్ ఉండగా, మిగిలిన చోట్ల 40 శాతం కంటే తక్కువగానే నమోదైంది.



ఓటింగ్ ముగియడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు లెక్కల్లో మునిగారు. ఒక్కో ఓటును లెక్కించుకుంటూ అంచనా వేస్తున్నారు. ఓటింగ్ శాతం తగ్గడంపై అధికారపార్టీ కుట్ర కోణం ఉందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.  ఇదిలా ఉండ‌గా బీజేపీ నాయ‌కులు మాత్రం టీఆర్ ఎస్‌కు ఖ‌చ్చితంగా చేదు అనుభ‌వం త‌ప్ప‌ద‌ని, త‌మ పార్టీ ఊహించిన దాని క‌న్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. పోలింగ్శాతం తగ్గినా పార్టీలు మాత్రం ధీమానే వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ దాదాపు ఒంటరిగానే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని చెబుతోంది. బీజేపీ కూడా మేయర్స్థానం తమ ఖాతాలోనే ఉంటుందని చెబుతోంది.


 పొలింగ్ శాతం తగ్గేలా టీఆర్‌ఎస్‌ కుట్రకు పాల్పడిందంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు బీజేపీ నేత డీకే అరుణ తదితరులు ఆరోపించారు.  పోలింగ్‌ ముందు నాలుగు రోజులు సెలవులు వచ్చేలా ప్లాన్ చేశారన్నారు. సోమ‌వారం విలేఖ‌రుల‌తో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మాట్లాడుతూ టీఆర్ఎస్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు. ఓటింగ్‌ శాతం తగ్గించేందుకు టీఆర్ఎస్‌ కుట్ర చేసిందని విమర్శించారు. మేయర్‌ పీఠాన్ని బీజేపీ గెలవబోతోందని టీఆర్ఎస్‌ భయపెట్టినా ఓటర్లు బెదరలేదన్నారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లో ఎస్‌ఈసీ పనిచేసిందన్న బండి సంజయ్ అవగాహనలేని వ్యక్తిని ఎస్‌ఈసీని చేశారని మండిపడ్డారు. పార్టీల గుర్తులు కూడా ఎస్‌ఈసీకి తెలియదని ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీ పూర్తిగా విఫలంమైందన్నారు.






పవన్ కళ్యాణ్ ఇక కొత్త అవతారమెత్తబోతున్నారా..?

గ్రేటర్ యుద్దం: పెరిగిన పోలింగ్ శాతం అధికారుల్లో సంతోషం.

చంద్రబాబు ప్రవర్తనలో అది కనపడుతుందా...?

గ్రేటర్ యుద్ధం : నిద్ర లేవని నగరం.. పాపం చలికాలం కాబోలు..!?

త్వరలో ఆరు గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించేలా టైం టేబుల్ - రైల్వే బోర్డు

బ్రేకింగ్: తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్ లోనే

ఏపీలో అడుగు పెడుతున్న పవన్... ఈసారి ఎక్కడికి అంటే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>